Seed Treatment in Groundnut – విత్తన ఎంపిక: నాణ్యత కలిగి మంచి మొలక శక్తి కలిగిన విత్తనాలను ఎన్నుకోవాలి. విత్తనం లావుగా దృఢంగా ఉంటే మొక్క కూడా దృఢంగా ఉంటుంది. గుత్తి రకాల్లో 90-95% తీగ రకాల్లో 85-90% కలిగి మొలకశాతం కలిగి ఉండాలి. విత్తనం కొరకు కాయ రూపంలోనే నిల్వ చేయాలి. గింజ రూపంలో నిల్వ చేయరాదు.విత్తుకొనే 1-2 రోజుల ముందు కాయలు వలిచి గింజలు ముడత లేని మచ్చ లేని, బద్దలు కానీ విత్తనాలను ఎన్నుకోవాలి.
గింజలు వేరు చేసేటప్పుడు గింజ పై పొర బాగా ఉండి సమానంగా ఉన్న విత్తనాలను ఎన్నుకోవాలి. బీజ కవచం తొలగిన మరియు బద్దలైన విత్తనాలను వాడరాదు.
విత్తన శుద్ది: విత్తన శుద్ధి అనునది తక్కువ ఖర్చుతో దాదాపు 20% వరకు అధిక దిగుబడులు ఇస్తుంది. విత్తనం వేసిన తరువాత అసంపూర్తిగా మొలకెత్తడం , మొలకెత్తిన తర్వాత విత్తనం కుళ్ళి పోవడం, వేర్లు కుళ్లడం, కాండం కుళ్లడం.ఆకు మచ్చ మరియు మొదలగు బూజు తెగులు వచ్చి మొక్కలు అక్కడక్కడా చనిపోతాయి.దీని వలన దిగుబడి తగ్గిపోతుంది.
Also Read: Advances in Tractor Use: ట్రాక్టర్ వినియోగంలో మెలకువలు.!
విత్తనం ద్వారా నేల ద్వారా గాని వచ్చునటువంటి అనేక రకాల బూజు తెగుళ్ళు నివారించుటకు కిలో విత్తనానికి3 గ్రా మాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బడిజం పొడి మందును విత్తుటకు ఒక రోజు ముందు విత్తన శుద్ది చేయాలి. వేరు పురుగులు ఉధృతి ఉన్న ప్రాంతంలో కిలో విత్తనానికి 6మీ. లీ.క్లోరిఫైరిఫస్ లేదా 2 మీ. లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేయాలి.
మొదట విత్తనాన్ని క్రిమిసంహార మందులతో శుద్ధి చేసి అరబెట్టి తరువాత అవసరం అయితే రైజోబియం కూడా పట్టించవచ్చు. విత్తన శుద్ది చేయననప్పుడు విత్తనం పై పొర దెబ్బ తినకుండా చేయాలి.
రైజోబియం కల్చర్ పట్టించు విధానము: క్రొత్తగా వేరుశెనగ పండించు నేలలో మాగాణి పొలాల్లో వేసే వేరు శెనగ పంటకు తగిన విధంగా రైజోబియం కల్చర్ ను పట్టించి విత్తుట వలన 15-20% దిగుబడులు పొందవచ్చు. చల్లని ప్రదేశంలో నిల్వ చేసిన కల్చర్ ను వాడాలి. విత్తన శుద్ది చేసిన తర్వాత విత్తనానికి రైజోబియం కల్చర్ రెట్టింపు మోతదులో పట్టించాలి.
ఒక లీటర్ నీటికి 50 గ్రా. బెల్లం లేదా చక్కెర వేసి 15 నిముషాలు మారగనిచ్చి పూర్తిగా చల్లర్చిన దానిలో 200 గ్రా.రైజోబియం బాక్టీరియా కల్చర్ వేసి చిక్కగా ద్రావణం తయారు చేయాలి.ఈ ద్రావణం ఒక ఎకరాకు సరిపడా విత్తనాన్ని కలపాలి. ఈ విత్తనము నీడలో అరబెట్టి వెంటనే విత్తుకోవాలి.
Also Read: Pest Control Techniques In Groundnut Crop: వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు మరియు వేరు పురుగు నివారణ