Telangana Rice Varieties: తెలంగాణాలో ప్రధాన ఆహారపు పంట వరి దీనిని సుమారుగా గత సంవత్సరం 57.40 లక్షల ఎకరాలలో సాగుచేసారు. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో రైతులు పంటలను కోసి వచ్చే సంవత్సరానికి పంటలు వేసుకోవడానికి వ్యవసాయ భూములను తయారు చేసుకుంటున్నారు. అలాగే రైతులు విత్తనాన్ని సమకూర్చుకుంటున్నారు, కాబట్టి రైతులు విత్తన ఎంపికలో మెళకువలు పాటించి అధిక దిగుబడినిచ్చే మరియు వ్యాధులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ ఎంపిక విధానం పైన అవగాహన కల్గి ఉండాలి. ఈ నేపధ్యంలో మధ్య, స్వల్పకాలిక కొత్త రకాలు, వివిధ వరి సాగు పద్ధతులు, చౌడు మరియు వివిధ వ్యాధులను తట్టుకునే రకాల పైన అవగాహన కల్గి ఉండాలి. దీర్ఘకాలిక రకాలు సుమారుగా 150 రోజుల కాలపరిమితి ఉండి సాగుచేయడానికి, ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. అలాగే పచ్చి రొట్ట పంటలు వేసి భూమిలో కలియదున్నడానికి సమయం ఉండదు. ఆలస్యంగా వేయడం వలన చీడ పీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అందువలన తెలంగాణ లో మధ్య మరియు స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది. మూడు వ్యవసాయ వాతావరణ మడలాలుగా విభజించడం జరిగింది. వివిధ మండలాలకు సిఫార్సు చేసిన రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి.
ఉత్తర తెలంగాణకు అనుకూలమైన రకాలు :
ప్రాణహిత, పొలాస ప్రభ, జగిత్యాల సన్నాలు, తెలంగాణ సోన, సాంబ మషూరి, జగిత్యాల మషూరి, అంజన, బతుకమ్మ, కూనారం సన్నాలు, యం.టి.యు-1010.
మధ్య తెలంగాణకు అనుకూలమైన రకాలు :
తెలంగాణ సోన, సిద్ధి, బతుకమ్మ, కూనారం సన్నాలు, సాంబ మషూరి, సోమనాథ్, భద్రకాళి, సురేఖ, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబ, శీతల్, రామప్ప, జగిత్యాల మషూరి, విజేత, బతుకమ్మ, కూనారం సన్నాలు, తెలంగాణ సోన, తెల్లహంస, నెల్లూరి మషూరి, యం.టి.యు -1010, ఎర్రమల్లెలు, ప్రద్యుమ్న, వరాలు, యం.టి.యు-1010
దక్షిణ తెలంగాణకు అనుకూలమైన రకాలు :
విజేత, బతుకమ్మ, కూనారం సన్నాలు, సాంబ మషూరి, కృష్ణ, జగిత్యాల మషూరి, తెలంగాణ సోన, తెల్లహంస, నెల్లూరి మషూరి, యం.టి.యు-1010. యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది. చలి ఉధృతిని ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటకాలం 15 ` 30 రోజుల వరకు పెరుగుతుంది.
నూతన వరి రకాలు :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రొఫెసవర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విడుదల చేశారు. ఈ రకాలు రెండు తెలుగు రాష్ట్రాలలో సాగు చేయడానికి అనుకలమైనవి.
1. తెలంగాణ సోన (ఆర్.ఎన్.ఆర్ 15048) :
ఈ రకం వ్యవసాయ పరిశోధన స్థానం రాజేంద్రనగర్ వారిచే విడుదల చేయబడిరది. ఇది ఆలస్యంగా నార్లు పోయుటకు అనువైన రకం కనుక ఖరీఫ్‌లో రైతులు జూలైలో ఈ రకాన్ని సాగుచేసుకోవచ్చు. ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనువుగా ఉండే ఈ రకం అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకొని ఎకరానికి 2.6-2.8 టన్నులు దిగుబడిని ఇస్తుంది. సాంబ మషూరి కన్నా సన్న గింజ నాణ్యతతో, తక్కువ నూక శాతముతో (68%-70% బియ్యం), అన్నము నాణ్యత కలిగి ఉండి, యాసంగిలో గింజ రాలదు. దీనికి 15 రోజుల నిద్రావస్ధ ఉంది. ఈ రకంలో కాండము తొలుచు పురుగు (మొగి పురుగు లేదా తెల్లకంకి) ఆశించును కనుక నాటిన 7-10 రోజులలో మరియు చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యుపి (400 గ్రా./ఎకరాకు) లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్‌సి (60 మి.లీ./ఎకరాకు) పిచికారి చేయాలి.
2. బతుకమ్మ (జె.జి.ఎల్ 18047) :
ఈ రకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల వారిచే విడుదల చేయబడినది. తెలంగాణలో దొడ్డు రకాలలో యం.టి.యు 1010కి ప్రత్యామ్నాయంగా బతుకమ్మ అనే రకాన్ని సాగు చేయవచ్చు. ఈ రకం రెండు కాలాలకు అనుకూలంగా ఉండి 125 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8-3.2 టన్నులు/ఎకరాకు దిగుబడినిస్తుంది. యాసంగిలో గింజరాలదు. దీనికి 3 వారాల నిద్రావస్థ కలదు.
3. కూనారం సన్నాలు (కె.ఎన్.యం 118) :
ఈ రకం వ్యవసాయపరిశోధనా స్థానం కూనారం వారిచే విడుదల చేయబడిరది. ఇది కూడ యం.టి.యు 1010కు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవచ్చును. గింజలు రాలే లక్షణము తక్కువగా ఉండి, గింజ బరువు ఎక్కువగా ఉండును. ఈ రకం కూడా రెండు కాలాలకు అనుకూలంగా ఉండి 125 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8-3.2 టన్నులు/ఎకరాకు దిగుబడినిస్తుంది. దీనికి 3-4 వారాల నిద్రావస్థ కలదు.
4. సోమనాథ్ (డబ్ల్యు.జి.ఎల్ 347) :
ఈ రకం ప్రాంతీయ వ్యవసాయ స్థానం వరంగల్ వారిచే విడుదల చేయబడినది. మధ్యస్థ గింజ నాణ్యత కలిగి ఉల్లికోడును తట్టుకొనే మధ్యకాలిక రకము (130-135 రోజులు). కాని వరంగల్ ఉల్లికోడు బయోటైప్ (4ఎమ్‌ను) తట్టుకోదు. ఈ రకం అగ్గి తెగులును కూడ తట్టుకొని, ఎకరాకు 2.6-3.0 టన్నులు దిగుబడిని ఇస్తుంది.
5. సిద్ధి (డబ్ల్యు.జి.ఎల్ 44) :
ఈ రకం కూడా ప్రాంతీయ వ్యవసాయ స్థానం వరంగల్ వారిచే విడుదల చేయబడినది. ఇది వర్షాకాలానికి మాత్రమే అనుకూలము. 150 రోజుల పంటకాలము కలిగిన మధ్యస్థ గింజ రకం. ఎకరాకు 2.4-3.0 టన్నుల దిగుబడినిస్తుంది.
తెలంగాణలో పండిరచుటకు అనువైన వరి రకాలు :
Also Read: Agricultural Works: ప్రస్తుత పరిస్థితులలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు.!
Value Addition Palmyrah: తాటి పండు ఆవశ్యకత మరియు విలువ ఆధారిత ఆహార పదార్దాలు.!
Kiwi Cultivation: కివీ సాగు ఆమె జీవితాన్నే మార్చేసింది.. 24 ఏళ్ల కాశ్మీరీ యువరైతు విజయం.!