Redgram Cultivation: కంది సాగులో ప్రధాన సమస్యలు –తగిన సాంద్రతలో మొక్కలు లేకపోవడం, ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండడం వలన దిగుబడులు తగ్గుతాయి.
పైరు చివరి దశలో బెట్టకు గురికావడం.
కంది పైరు సహ పంటగను, మిశ్రమ పంటలగాను సాగు చేసే ప్రాంతాలలో ప్రధాన పంటను నిర్లక్ష్యం చేయడం వలన.
మరుకా మచ్చ పురుగు, కాయ ఈగ, ఎండు తెగులు, మరియు వెర్రి తెగులు.
కావాలిన మోతదులో రసాయన, జీవ సంబంధిత ఎరువులు వాడక పోవడం.
అంతర పంటలు
కంది +జొన్న 1:4
కంది +పెసర /మినుము /వేరుశెనగ /సొయా చిక్కుడు 1:7
నేల తాయారి మరియు ఎరువులు
మురుగు నీరు పోవు వసతి గల భూములు అనువైనవి. వేసవి లో తొలకరి వర్షాలు పడగానే గొర్రు తో /నాగలి తో గాని మెత్తగా దున్నలి. ఆఖరి దుక్కిలో హెక్టర్ కి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20కిలోల నత్రజని,50కిలోల భాస్వరం నిచ్చు సూటి ఎరువులు వేసి కలియాదున్నాలి.
విత్తన శుద్ధి
ఎండు తెగులు ఉధృతిగా ఉన్న ప్రాంతాలలో ట్రైకోడెర్మావీరిడి కిలో విత్తనానికి 10గ్రా మరియు ఫైటోప్తేరా ఎండు తెగులు ఉన్నచో మీటల్లక్సిన్ మందును కిలో విత్తనానికి 2గ్రా చొప్పున విత్తన శుద్ధి చేసి చివరిగా విత్తుకొని గంట ముందు 10కిలోల విత్తనానికి జీవసంబంధిత ఎరువులైన రిజోబియo, ఫాస్పోబాక్టీరియా 200 గ్రా వమ్ 50గ్రా కలిపిన మిశ్రమoతో విత్తన శుద్ధి చేసినట్లు అయితే గాలిలోని నత్రజని , భూమిలోని భాస్వరంతోపాటు ఇతర పోషకాలను అందించి నేలను సారవంతం చేస్తుంది.

Redgram Cultivation in India
Also Read: Redgram Harvesting: కందిపంట కోత మరియు నిల్వ పద్ధతులు.!
విత్తు సమయం
జూన్, జులై మాసాలు అనువైనవి. అగస్ట్ వరకు కూడా విత్తుకోవచ్చు. ఆగష్టు నేల తర్వాత నుండి విత్తుకున్నట్లు అయితే మొక్కల సాళ్ళ మధ్య దూరం తగ్గించుకుని మొక్కల సాంధ్రత పెంచుకోవాలి.
విత్తన మోతాదు
5నుండి 8 కిలోలు /హెక్టర్ కు విత్తు కోవాలి.
విత్తే దూరం
120-240సెం. మీ 20 సెం. మీ నేల స్వభావన్నీ బట్టి నాటుకోవాలి.
స్వల్పకాలిక రకాలు
15-20కిలోల / హెక్ట్
120-130రోజులు 45-60,10సెం. మీ నాటుకోవాలి
అంతర కృషి
కంది పైరును మొదటి 40-45 రోజుల వరకు కలుపు బారినుండి రక్షించుకోవాలి. మొదటి రెండు నేలల వరకు తరచుగా గొర్రు / దంది ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణ తగ్గుతుంది. అలాగే తేమను కూడా నిలుపుకోవచ్చు.
కలుపు నివారణ
విత్తిన వెంటనే 24గంటల లోపు ఎకరానికి తేలిక పాటి నేలలో 1.0లీ, బరువు నేలలో 1.25 లీ పెండిమిథలీన్ కలుపు మందును 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. నాటిన 20-25 రోజుల తర్వాత అంతర కృషి చేయించలేని పరిస్థితులలో వెడల్పాటి ఆకులు మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు అనగా ఊదా చెప్పేరా,గరిక, ఊర్రకి మొక్కలు ఎక్కువగా ఉన్నచో ఇమిజితాపిర్ మందును హేక్టర్ కు 600-650మిల్లి వాడుకొని కలుపు మొక్కలను నివారణ చేయవచ్చు.
Also Read: Seed Production in Redgram: కంది పంట విత్తనోత్పత్తిలో మెళుకువలు