వ్యవసాయ పంటలు

‘Sri’ Method Cultivation in Paddy: వరి లో ‘ శ్రీ ‘ పద్దతి సాగు వలన లాభాలు.!

1
'Sri' Method Cultivation
'Sri' Method Cultivation

‘Sri’ Method Cultivation in Paddy: శ్రీ వరి సాగు పద్ధతిని మొట్టమొదటి సారిగా 1980 సంవత్సరం లో “మడగాస్కర్” దేశం లో రూపొందించడం జరిగింది. ఈ రకమైన పద్దతి లో వరిని సాగు చేయటం ఇప్పుడు బాగా ప్రాధాన్యత సంతరించుకున్నది, ఎందుకంటే ఈ శ్రీ పద్దతి లో రైతులు సిరులు పండిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో, ఎక్కువమంది కూలీలు అవసరం లేకుండా ప్రతి దశలోనూ యాంత్రీకరణ వలన అధిక దిగుబడులు పొందవచ్చును. శ్రీ పద్ధతి లో వరి పిలకలు యొక్క వేర్లు విస్తారముగా వ్యాప్తి చెందుతాయి , బాగా లోతు వరకు చొచ్చుకు పోయినందు వలన భూమి లోపల పొరల యందు ఉన్న పోషక పదార్థాలను సులభముగా తీసుకొనగలుగుతాయి. శ్రీ పద్ధతి లో వరిపైరు సహజముగా పెరగుతుంది. కాబట్టి వరి పిలకలు మరియు పైరు చాలా ఆరోగ్యముగా మంచి ఎదుగుదలతో ఉంటుంది.

సాధారణమైన సాగు పద్ధతిలో పండించిన మూడు వరి దుబ్బులను కలిపి పీకడానికి ఒక మనిషికి సుమారు 28 కిలోల బలం అవసరం వస్తే శ్రీ పద్ధతి లో సాగు చేసిన ఒక వరి దుబ్బును పీకడానికి 53 కిలోల బలం అవసరమవుతుంది, అంత అద్భుతముగా వరి పెరుగుతుంది శ్రీ పద్ధతిలో. సాధారణముగా వరిని సాగు చేసే పద్ధతిలో ఎకరాకు సుమారు 20 కిలోల విత్తనం అవసరమయితే శ్రీ పద్ధతిలో కేవలం 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువ , కాబట్టి రైతులకు చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది.

Also Read: Sri Method in Sugar Cultivation: చెరకు సాగుకు ‘‘శ్రీ’’ పద్ధతి లాభదాయకం.!

'Sri' Method Cultivation in Paddy

‘Sri’ Method Cultivation in Paddy

రైతులందరూ వరి బాగా పెరిగి అధిక దిగుబడులు రావాలంటే పొలం లో ఎప్పుడూ నీరు ఎక్కువగా నిల్వ ఉండాలని అనుకుంటారు కాని నిజానికి వరి నీటి మొక్క కానే కాదు కేవలం నీటిలో కూడా బ్రతికే స్వభావం ఉన్నది. ఎప్పుడైతే నీరు ఎక్కువగా నిల్వ ఉంటుందో వరి ఏదైతే ధాన్యం తయారీకి ఉపయోగపడాల్సిన శక్తిని ప్రేళ్ళలో గాలి సంచులు తయారుకి మరియు బ్రతకడానికి వాడు కొంటుంది. అందువలన సాధారణంగా వరిని సాగు చేసే విధానములో వరి పూత దశ కు వచ్చినప్పటికి 70 శాతం వరకు వేర్లు ముదిరిపోయి కొసలు కృశించిపోయి పోషకాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటాయి, కానీ శ్రీ వరి సాగు పద్ధతి లో అలా జరగదు.

ఈ పద్ధతిలో పొలం లోని నీరు ఎక్కువ నిలువ ఉండకుండా చూసుకోవలి. కాబట్టి మామూలుగా పండించే వరి పద్ధతిలో ఉపయోగింపబడే నీటిలోని 1/3 వంతు నీరు సరిపోతుంది. శ్రీ వరి సాగు పద్ధతిలో 8 నుంచి 12 రోజుల వయసు కలిగిన నారుని నాటటం వలన వాటి యొక్క వేర్లు బాగా వృద్ధిచెంది బలంగా ఉంటాయి కావున సుమారుగా 30 నుండి 50 వరకు పిలకలు వేస్తుంది. శ్రీ వరి సాగులోని యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించినట్లయితే ఒక్కోక్క మొక్కకు 50 నుండి 100కి పైగా బలమైన పిలకలు వస్తాయి, అవి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేసి, గింజలు బాగా పాలు పోసుకొని దృఢంగా నాలుగు వందల గింజల వరకు నింపుకుంటాయి . ‘శ్రీ’ పద్ధతి వాడుట వలన భూమిలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది తద్వారా నేల యొక్క సారం కూడా బాగా వృద్ధి చెంది , సూక్ష్మ జీవులు సహజంగానే పైరుకు కావలసిన పోషక పదార్థాలను అందజేస్తూ, భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడుల నివ్వగలదు.

Also Read: Rotovator and Rotopuddlers Uses: వరిలో రోటోవేటర్ మరియు రోటోపడ్లర్ యొక్క ఉపయోగాలు.!

Leave Your Comments

Dairy Cattle Calendar 2023: పాడి పశు క్యాలెండర్‌ 2023

Previous article

Paddy Plantation: యంత్రాలతో వరినాట్లు వేసే విధానం.!

Next article

You may also like