వ్యవసాయ పంటలు

Tomato and Eggplant: టమాట మరియు వంగలో సస్యరక్షణ.!

1
Tomato and Eggplant
Tomato and Eggplant

Tomato and Eggplant – టమాట: టమాటలో శనగపచ్చ పురుగు నివారణకు బంతిని ఎరపంటగా ప్రతి పదహారు (16) వరుసల టమాటకు రెండు వరుసల బంతిని నాటాలి.

* 40 రోజుల వయసుగల బంతి నారు 25 రోజుల టమాట నారును ఒకేసారి నాటిన యెడల రెండు పంటలు ఒకేసారి పుష్పించి శనగపచ్చ పురుగులు, తల్లి పురుగులు బంతిపూల మీదకు ఆకర్షింపబడి గ్రుడ్లను పెడతాయి.
* బంతి పూలను రోజు గమనిస్తే గ్రుడ్లను గమనించిన యెడల 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారి చేసి పురుగును తొలి దశలోనే అరికట్టవచ్చు.
* లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4-5 చొప్పున అమర్చుకోవాలి.
* అవసరాన్ని బట్టి స్పైనోశాడ్ 0.3 మి.లీ లేదా థయాడికార్బ్ మి.లీ. లేదా క్లోరాంట్రానిప్రోల్ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* కలుపు మొక్కలను వైరస్ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి.

Tomato

Tomato

* రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు ఉధృతి గమనించడానికి జిగురు కార్డులను పొలంలో అక్కడక్కడ అమర్చుకోవాలి.
* రసం పీల్చే పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిదాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* టమాటలో ఎక్కువగా ఆకు ఎండు తెగులు మరియు ఆకుమాడు తెగులు ఎక్కువగా ఆశిస్తాయి.
* ఆకు ఎండు తెగులు నివారణకు క్లోరాంట్రానిప్రోల్ 2గ్రా. లేదా అజాక్సీస్ట్రోబిన్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమాడు తెగులు నివారణకు, అజాక్సీస్ట్రోబిన్ 1గ్రా. లేదా సిమోక్సానిల్ 2 గ్రా. లేదా మెటలాక్సిల్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Also Read: Sesame Crop: వేసవి పంటగా నువ్వులను విత్తుకునుట.!

Tomato and Eggplant

Tomato and Eggplant

వంగలో సమగ్ర సస్యరక్షణ :

* వంగలో కాయ తొలిచే పురుగు నాటిన 15 రోజుల నుండి కాయ కోత వరకు సమస్యగా ఉంటుంది.
* పురుగులు సోకిన కొమ్మలను, కాయలను నాశనం చేయాలి.
* బి.టి. సంబంధిత మందులను 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
* ఈ పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా థయోడికార్బ్ 2 గ్రా. లేదా కోరాజిన్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* 10 రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి.
* రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
* వంగలో వెర్రి తెగులు పచ్చదోమ వలన వ్యాప్తి చెందుతుంది.
* ఈ తెగులు నివారణ కొరకు వైరస్ ఆశించిన మొక్కలను ఏరి నాశనం. చేయాలి. పచ్చదోమలు నివారించు కోవాలి.

Also Read: Turmeric Crop: ఉడికించిన పసుపు దుంపలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Leave Your Comments

Sesame Crop: వేసవి పంటగా నువ్వులను విత్తుకునుట.!

Previous article

Foods that lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు.!

Next article

You may also like