వ్యవసాయ పంటలు

Pink Garlic Cultivation: రైతుల పాలిట వరంగా మారుతున్న పింక్ వెల్లుల్లి.. భారీ ధర, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

1
Pink Garlic
Pink Garlic

Pink Garlic Cultivation: సాధారణంగా వెల్లుల్లి తెలుగురంగులో ఉంటుందని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే వెల్లుల్లి గురించి వింటే ఖచ్చితంగా అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే ఈ వెల్లుల్లి పాయ ఉండేది పింక్ రంగులో. తెలుపురంగు వెల్లుల్లి తో పోలిస్తే ఇందులో కాస్త ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే చెప్పవచ్చు. తెల్ల వెల్లుల్లి కంటే ఎక్కువ సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది.

పింక్ వెల్లుల్లి వెల్లుల్లి రైతులకు ఒక వరం లాంటిది అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనిని సాగు చేయడం ద్వారా ఒకవైపు రైతులు భారీ లాభాలను ఆర్జించవచ్చని , మరోవైపు ఈ గులాబీ రంగు వెల్లుల్లిని తినడం ద్వారా ప్రజలు మునుపటి కంటే తమ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి.

White Garlic Cultivation

White Garlic Cultivation

పింక్ వెల్లుల్లిలో ఫాస్పరస్, మాంగనీస్, జింక్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన, అద్భుతమైన గులాబీ రంగు వెల్లుల్లి మరింత సమాచారాన్నితెలుసుకుందాం..

Also Read: Agro Processing: ఆగ్రో ప్రాసెసింగ్ /ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైనవి ?

ఈ గులాబీ వెల్లుల్లిని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ సబోర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది వెల్లుల్లిలో అత్యుత్తమ మేలిమి రకం. ఈ వెల్లుల్లి యొక్క దిగుబడి సామర్థ్యం తెల్ల వెల్లుల్లి కంటే చాలా ఎక్కువ. అదనంగా, దాని ఔషధ గుణాలు సంప్రదాయ తెలుపురంగు వెల్లుల్లి కంటే ఎక్కువ. ఇది తెల్ల వెల్లుల్లి కంటే ఎక్కువ సల్ఫర్ ను యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. దీనిలో ఉత్తమమైన అంశం ఏమిటంటే, ఈ వెల్లుల్లి తెల్ల వెల్లుల్లి వలె త్వరగా చెడిపోదు. అంతేకాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం ఇంకా దీనిని పాడవకుండా ఎక్కువ కాలం ఉండేటట్లు చేస్తుంది.

Pink Garlic Cultivation

Pink Garlic Cultivation

రైతులకు ఓ వరం – పింక్ వెల్లుల్లి, దాని ప్రత్యేకత గురించి వార్తలు వచ్చినప్పటి నుండి, రైతులు దాని గురించి విని చాలా సంతోషిస్తున్నారు. బీహార్ ప్రభుత్వం త్వరలో ఈ గులాబీ వెల్లుల్లి విత్తనాలను రైతులకు అందించనుంది. అప్పుడు బీహార్‌లోని చాలా మంది రైతులు ఈ గులాబీ వెల్లుల్లిని పండిస్తారు. ఒకసారి బీహార్‌లో సాగు చేస్తే, దేశవ్యాప్తంగా రైతులు ఈ గులాబీ వెల్లుల్లిని పండించవచ్చు. దీంతో రైతులు భారీ లాభాలు పొందవచ్చు.

రైతులు ఈ వెల్లుల్లిని భారతీయ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలో విక్రయించవచ్చు. కాబట్టి మీరు వెల్లుల్లిని పండిస్తున్నారా లేదా పండించాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా నిపుణుల సలహా తీసుకొని, సాంప్రదాయ తెల్ల వెల్లుల్లి కంటే ఎక్కువ దిగుబడి, లాభాలను అందించే గులాబీ రంగు వెల్లుల్లిని పెంచండి.

Also Read: MS Dhoni: ఐపిఎల్ తర్వాత వ్యవసాయం చేస్తున్న మహేంద్ర సింగ్ ధోని.!

Leave Your Comments

Agro Processing: ఆగ్రో ప్రాసెసింగ్ /ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైనవి ?

Previous article

QR Code System for Quality Seeds: నాణ్యమైన విత్తనాల కోసం -QR కోడ్ సిస్టమ్.!

Next article

You may also like