ఇది రబీ పంటలు విత్తే సమయం గనుక రైతులు పంటలు విత్తడంతో పాటు ఎరువుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. విత్తిన తర్వాత పైపాటుగా భాస్వరం ఎరువులు వేసుకోరాదు. నూనె గింజల పంటలలో భాస్వరంను సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో వేసుకోవడం వల్ల భాస్వరంతో పాటుగా కాల్షియం, గంధకం పోషకాలు కూడా లభ్యంకావడం వల్ల గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.
వేరుశనగ, బొబ్బర్లు పంటలను నవంబర్ 30వ తేదీ వరకు, మినుము, పెసర పంటలను డిసెంబర్ 10వ తేదీ వరకు, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు. కనుక రైతులు భాస్వరం ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Leave Your Comments