Insect Pests in Leafy Greens: తెల్ల త్రుప్పు: తెల్ల త్రుప్పు తెగులు తోట కూర, పాల కూరను ఆశిస్తుంది. ఈ తెగులు వల్ల మొదట ఆకులపై తెల్లని పొక్కలు అక్కడ అక్కడ ఏర్పడతాయి. ఇవి ఉబెత్తుగా, మెరుపుతో 1-2 మి.మీ పరిమాణం కలిగి ఉంటాయి. తెగులు ఉదృతం అయ్యే కొలదీ ఇట్టి పొక్కులు మొదట ఏర్పడిన వాటి చుట్టూ ఎక్కువ సంఖ్యలో ఏర్పడి, ఎక్కువ ప్రాంతం అక్రమిస్తాయి. అకుల కణాలు చిట్లి తెల్లని పొడిలాంటి శిలీద్రం బీజాల రూపంలో జీవిస్తాయి. చలికాలంలో ఎక్కువ కనిపిస్తాయి.
యాజమాన్యం: అవసరం అయినప్పుడు మాత్రం 1%బోర్డు మిశ్రమం చల్లాలి.
Also Read: Vegetable Gardening: 30 రోజుల్లో ఇంట్లో కంటైనర్‌లో పెరిగే రుచికరమైన కూరగాయలు
బూజు తెగులు: బూజు తెగులు చుక్క కూర, పాల కూరలను ఆశిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు లేదా గోధుమ రంగు, మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రింది ఆకుల నుంచి మొదలు పెట్టి క్రమేపి పై వాటికి ప్రాకుతాయి. తెగులు సోకిన ప్రదేశాలు చనిపోయిన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. లేత ఊదా రంగులో బూజు పెరుగుదల కనిపిస్తుంది. ఇది భూమిలో బీజాలా రూపంలో, విత్తనాన్ని ఆశిస్తూ ఉంటుంది. తేమతో కూడిన చల్లని వాతావరణం తెగుల వ్యాప్తికి అనుకూలం.
యాజమాన్యం: ఆరోగ్యంవతమైన విత్తనం ఎoపిక, పంట అవశేషాలు నాశనం, పంట మార్పిడిచేసి, చేయాలి.
సర్కొస్పోరా ఆకు మచ్చ: పాల కూర పై ఆతి చిన్న వృత్తాకార, ఊదా గోధుమ నుంచి ముదురు అలీవ్ రంగులో ఉండి ఎర్రటి గోధుమ రంగు అంచులతో కనిపిస్తాయి. మచ్చల మద్యలో తెగులు కలుగజేసె శిలిoద్ర బీజ సముదాయo ఏర్పడడం గమనించవచ్చు.
ఫిల్లోస్టికా ఆకుమచ్చ: వృత్తాకారపు, గోధుమ రంగు మచ్చలు ఎర్రని అంచులు కలిగి ఉంటాయి. మచ్చల మధ్య భాగం చిన్న నల్లని పిక్కిడియా కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ ఆకు మచ్చల నుంచి నష్టాలను అరికట్టడానికి పొలంలో పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.
యాజమాన్యం: విత్తనాన్ని ఆరోగ్యవంతమయిన పంట నుంచి సేకరించి, పంట అవసశేషాలను నాశనం చేసి, మొక్కలకు గాలి సోకే విధంగా మొక్క సంఖ్య ఉండేలా, మురుగు పారుదల ఉండేలా చూసినట్లు అయితే వీటి తీవ్రత తగ్గించవచ్చు.
ఆంత్రాక్నోస్: పాల కూరలో ఆకుమచ్చలు చిన్నగా ముదురు ఆలీవ్ రంగులో లేదా నీటి మచ్చలుగా కనిపిస్తాయి. మచ్చలు పెరిగినకొద్దీ ఆకారం కోల్పోయి ఒక పరిమాణం లేక మాడినట్లు కనిపిస్తాయి. తరవాత ఆకు అంత వ్యాపించి ఆకు చనిపోతుంది.
యాజమాన్యం: నివారణకు తెగులు సోకని విత్తనాలు ఎంపిక, మురుగు పారుదల సౌకర్యం గల నేలలు ఎంపిక చేసి మ్యాకోజాబ్ 2.5గ్రా. లీ నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో చల్లాలి.
మాగుడు తెగులు: పాల కూర పడించే అన్నిప్రాంతాలలో మాగుడు తెగులు సాధారణంగా కనిపిస్తోంది. కొన్ని విత్తనాలు మొలకెత్తక ముందు కుళ్లుతాయి. కొన్ని మొలకెత్తిన తరువాత కాండం మెదలులో నల్లమచ్చలు ఏర్పడి కుళ్ళి నేల పై ఒరిగిపోతాయి.
యాజమాన్యం: తెగులు కలిగిచే శిలీంద్రాలు భూమిలో నివసిస్తాయి. 3గ్రా. థైరo 6గ్రా మీట్లాక్సిన్ కిలో విత్తనాలనికి కలిపి విత్తనశుద్ది చేయాలి.
ఎండు తెగులు: పాల కూర పండించే అన్ని ప్రాంతాలలో ఇది చాలా ముఖ్యం అయిన తెగులు. తెగులు సోకిన మొక్కలలో ముదురు ఆకులు పసుపు రంగుకి మారి వాడిపోతాయి. తెగులు సోకిన మొక్క కాండాన్ని చీల్చి పరిశీలిస్తే లోపలి కణజాలం గోధుమ రంగుకు మారడం గమనించవచ్చు.
యాజమాన్యం: కార్బడిజం 2గ్రా. కిలో విత్తనానికి కలిపి శుద్ది చెయ్యాలి.
త్రుప్పు తెగులు: చుక్క కూరపై ఇది చాలా ముఖ్యం అయిన తెగులు. ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు ఉబ్బేఅంతా పొక్కులు ఏర్పడితాయి. ఈ పొక్కులు పెరిగి ఆకుంతా వ్యాపిస్తాయి.
యాజమాన్యం: తెగులు ప్రారంభదశలో మాకోజెబ్ 2.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
గోoగూర తెగులు – వాటి సమస్యలు
బాక్టీరియా ఆకుమచ్చ తెగులు: ఆకుల అంచుల వద్ద v ఆకారంలో మచ్చలు ఏర్పడి అంచులు వడలి పోతాయి. ఈ మచ్చలు పెరిగి ఆకులు సగభాగాన్ని ఆక్రమిస్తాయి. మచ్చ పెరిగే కొద్దీ, మధ్యభాగం నల్లబడి ఆలీవ్ రంగు అంచు కలిగి ఉంటుంది.
ఆకు మచ్చ: ఆకులపై మొదట గుండ్రని మచ్చలు ముదురు గోధుమ రంగు అంచులతో ఏర్పడతాయి. ఈ మచ్చలు పెరిగి పెద్దవి అయ్యి నల్లటి కొనిడియా ఏర్పడుతుంది.
వేరు మరియు కాండం కుళ్ళు తెగులు: ఈ తెగులు మొక్క అన్నిదశలలో ఆశిస్తుంది. లేత మొక్కల మొదలు భాగం లో నల్లటి పలుచని చారలు ఏర్పడతాయి.
యాజమాన్యం: తెగులు కలిగించే శిలీంద్రం భూమిలో నివసిస్తుంది. 1కిలో విత్తనానికి 3గ్రా.ల థైరామ్ లేదా కెప్టెన్ కలిపి విత్తనశుద్ది చెయ్యాలి.
Also Read: Vegetable Cooler: రైతుల కూరగాయలను తాజాగా ఉంచడానికి చౌకైన కూలర్