Pearl Millet: దీనినే pearl millet, cat tail millet, Bulrush millet అని కూడా అంటారు.
వాతావరణం:- ఈ పంటను వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయువచ్చు. సజ్జ పంట వాతావరణం లోని ఉష్ణోగ్రత , నీటి ఎద్దడి, ని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది. సజ్జ లో వివిధ రకాలు photo sensitive అందువల్ల ఈ పంటను వివిధ కాలల్లో సాగు చేయవచ్చు. ఈ పంటకు తక్కువ వర్ష పాతం మరియు పొడి వాతావరణం అవసరం పంట ఏపు గా పెరిగే దశ లో తేమ గల వాతావరణం, వర్ష పాతం, మంచి సూర్య రశ్మి అవసరం.
పంట పూత దశ లో వర్షానికి గురి కాకుండా చూసుకోవాలి. వర్షం ఉన్నట్లయితే పుప్పొడి వర్షం నీళ్ళలో కొట్టుకొని పోవడం మరియు పరాగ సంపర్కం తక్కువ గా ఉంటుంది. దాని వల్ల దిగుబడి తగ్గును. పక్వ దశ లో పొడి వాతావరణం తో కూడిన అధిక సూర్య రశ్మి అవసరం. సజ్జ పంట నీటి ఎద్దడి ని బాగా తట్టుకోంతుంది. కాని అధిక వర్ష పాతం, మంచు ను తట్టుకోలేదు.
నేలలు:-
తేలిక నుండి మధ్య రకం నేలల్లో సాగు చేసుకోవచ్చు
నీరు ఇంకే మురుగు నీరు పోయే వసతి గల నేలలు అనుకూలము
Also Read: Finger Millet Importance: రాగి ప్రాముఖ్యత

Pearl Millet
విత్తే సమయం:-
ఖరీఫ్ – జూన్, జులై. వేసవి-జనవరి
విత్తన మోతాదు :-
ఎకరాకు 1.6కిలోలు
విత్తన శుద్ధి:- 2% ఉప్పు నీటి ద్రావణం లో విత్తనాలకు 10 నిమిషాలు వుంచడం ద్వారా ఎర్గాట్ శీలింద్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు.ఆరిన కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ ను కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తే దూరం:- వరుసల మధ్య 45సెం. మి × మొక్కల 12 నుండి 15 సెం. మి ఎకరానికి 58000 నుండి 72000 మొక్కలు ఉండాలి.
నాటడం:- నారు పోసి పదిహేను రోజుల వయసు గల నారు మొక్కలను పైన తెలిపిన దూరం లో నాటవచ్చు
ఎరువులు:- ఎకరానికి 4 టన్నుల FYM ఎరువును ఆఖరి దుక్కి లో వేసి కలియ దున్నాలి.
నీటి యాజమాన్యం:- సజ్జ లో పంట దుబ్బు చేసే దశ, పిలక దశ, పూత దశ, మరియు పాలు పోసుకోను దశ మొదలైన దశలు కీలకమైనవి. ఈ సమయం లో నేలలో తగిన తేమ ఉండాలి. మొక్కలను 30 రోజుల వయసు లో ఎకరానికి రెండు టన్నులు వేరుశనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా భూమి లోని తేమను ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు
కలుపు నివారణ:-
విత్తన రెండు వరాల లోపు కలుపు తీసివేయాలి.
విత్తిన వెంటనే లేదా రెండు, మూడు రోజుల్లో అట్రజిస్ 50% పొడి మందు ఎకరానికి 400-600 గ్రాముల చొప్పున 200 లీటర్లు నీటిలో కలిపి తేమ ఉన్నపుడు పిచికారీ చేయాలి.
25,30 రోజులప్పుడు గుంటక లేదా దంతి తో అంతర కృషి చేయాలి.
అంతర పంట:- సజ్జ +కంది -2:1
పంట కోత మార్పిడి:-
సజ్జ పంట లో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. రెండు లేదా మూడు దశ ల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి కట్టెలతో లేదా ట్రాక్టర్ తో గాని నూర్పిడి చేసి గింజలను వేరు చేయవచ్చు. గింజలను బాగా ఆరబెట్టి నిలువ చేయాలి. అప్పుడప్పుడు గింజలను ఎండ బోసినట్లయితే పురుగుల బారి నుండి కాపాడవచ్చును.
Also Read: Pearl millet: సజ్జ పంటలో ఎరువుల యాజమాన్యం..