Pea Cultivation – వాతావరణం: తక్కువ ఉష్ణోగ్రతలలో పెరిగే పంట శీతకాలంలో రబీ పంటగా పండిస్తారు. ఉష్ణోగ్రత 10-17 సేం. గ్రే. ఉండే పరిస్థితులలో ఈ పంట బాగా పండుతుంది. వేడి వాతావరణంలో గింజలు సరిగా ఏర్పడక కాయలు నాణ్యమైనదిగా ఉండవు.
నేలలు: సారవంతమైన, బాగా నీరు ఇంకె నేలలు శ్రేష్టం, చౌడు భూములు తప్పక అన్ని రకాల నేలలు అనుకూలము.
నేల తయారీ: ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. అనుకూలంగా బోదెలు, కాలువలు చేయాలి.నేలను సమానంగా మొలక రావడానికి అనుకూలమైన స్థితిలో ఉంచాలి.
విత్తే కాలము: అక్టోబర్ 15, నవంబర్ 15 నేలల్లో విత్తుకోవచ్చు.
విత్తన మోతదు మరియు విత్తే దూరము: ఎకరాకు స్వల్పకాలిక రకాలు 40-48 కేజీ మధ్య దీర్ఘ కాలిక మొక్కలకు 32-35 కేజీ ల విత్తనం అవసరం.
విత్తే దూరము: 30×15 సేం. మీ విత్తే ముందు కేజీ విత్తనానికి 1 గ్రా. కార్బడిజం కలిపి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశెనగలో విత్తన శుద్ధి ఎలా చేయాలి.!

Pea Cultivation
ఎరువులు: ఎకరాకు 10 కేజీల నత్రజని 28 కేజీల పోటాష్ ఎరువులను పంట విత్తే సమయంలో వేయాలి.ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును వేయాలి.
నీటి యాజమాన్యం: విత్తనం విత్తే ముందు నీరు పెట్టడం మంచిది. తర్వాత 10-15 రోజులకొకసారి తడులను ఇవ్వాలి.పూత, పిందె దశలో నీటి ఏద్దడిని తట్టుకోవాలి.
అంతర కృషి: కలుపు మొక్కలను ఎప్పటికి అప్పుడు తీసివేయాలి.పంట కాల పరిమితి 1-2 సార్లు గోతులు త్రవ్వి, బోదెలు కాలువలు సవరించాలి. కలుపు నివారణకు పెండిమీథలీన్ మందును ఎకరాకు 1.25 లీ.లేదా అల్లాక్లోర్ 1.0 లీ.చొప్పున 200 లీటర్లు నీటిలో కలిపి నాటిన 48 గంటల లోపు పిచికారీ చేయాలి.
కోత: 60-100 రోజులకి రకాన్ని బట్టి మొదట కోతకు వస్తుంది. ప్రతి 10 రోజుల ఒకసారి కోత తీయవచ్చు. కాయలు ఆకు పచ్చ వర్ణం నుండి లేత పసుపు పచ్చ రంగుకి మారినప్పుడు కాయలు కోయలి. బఠాణిలో పక్వా దశను టెండర్ మీటర్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.బఠాణి నాణ్యత గింజలలో చెక్కర శాతం అనుసరించి నిర్ణయించబడుతుంది.
దిగుబడి: కాయల నుండి గింజలు తీస్తే ప్రతి 100 కేజీ ల కాయలను 38-40 కేజీల తాజా బఠాణి గింజలు వస్తాయి.
Also Read: Advances in Tractor Use: ట్రాక్టర్ వినియోగంలో మెలకువలు.!