Paddy Cultivation: మారుతున్న సామాజిక జీవన పరిస్థితులు, మెరుగు పడిన వినియోగదారుని ఆర్థిక పరిస్థితి. నాణ్యతపై అవగాహన పెరగడం వల్లవరిలో గింజ నాణ్యత అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. అందువల్ల వారిలో అధిక దిగుబడులను సాధించడంతో పాటు నాణ్యత గల ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం కూడా ఎంతో ముఖ్యం. అంతే గాక రైతు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించా లంటే నాణ్యమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. ప్రభుత్వం ప్రతి పంటకు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను నిర్ధారించి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. ఈ ప్రామాణిక నిబంధనలకు లోబడి ఉండే నాణ్యతా ప్రమాణాలనే కనీస నాణ్యతా ప్రమాణాలుగా పరిగణి స్తారు. ధాన్యంలో ఈ నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించిన విధంగా లేకపోతే నిర్ధారించిన మద్దతు ధర లభించదు.
నాణ్యతా ప్రమాణాలు: వరిలో గింజ నాణ్యతను ప్రధానంగా భౌతిక నాణ్యత, రసాయనిక నాణ్యతలుగా విభజించవచ్చు. భౌతిక నాణ్యతలో గింజ పొడవు- వెడల్పులు, గింజ బరువు, పొట్ట తెలుపు, నిండు గింజలు. తాలు గింజలు, రసాయనిక నాణ్యతలో అమైలోజ్ శాతం, జెలాటి నైజేషన్ ఉష్ణోగ్రత, జెల్ కన్సిస్టెన్సీ (అన్నం స్వభావం) లు ముఖ్య మైనవి. ఈ నాణ్యతా లక్షణాలన్నీ ప్రధానంగా సాగుచేస్తున్న రకంపై ఆధారపడినప్పటికీ కొంతమేర వాతావరణ పరిస్థితులు, యాజమాన్య పద్ధతులతో ప్రభావితమవుతాయి.
Also Read: Cultivation of Maize In Paddy Fields: వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – మెళకువలు.!
వాతావరణ ప్రభావం: వరి గింజలను పొడవు, వెడల్పుల నిష్పత్తిని బట్టి పొడవు- సన్నం, పొడవు-లావు, మధ్యస్థం-సన్నం, మధ్యస్థం లావు, పొట్టి- ‘సన్నం, పొట్టి-లావుగింజ రకాలుగా విభజించవచ్చు. పొట్టి.మధ్యస్థ పొడవు రకాలు సాధారణంగా అధిక నిండుగింజల దిగుబడినిస్తాయి. వరిగింజ గట్టిపడే దశలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు లేదా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కు వగా ఉన్నప్పుడు లేదా బాగా ఎండిన గింజలపై వర్షం కురిసినప్పుడు గింజ లపై పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి గింజలు మిల్లింగ్ చేస్తే ముక్కలు అవు తాయి. వరి గింజలోని పిండి పదార్థ రేణువుల మధ్య కొన్నిసార్లు గాలి చొరబడటం వల్ల పిండి పదార్థ రేణువులు గట్టిగా అమరి ఉండవు. ఇలా పిండి పదార్ధం లూజుగా అమరి ఉన్నచోట గింజ తెల్లగా, మెత్తగా ఉండి మిల్లిం గులో నూక అవుతాయి. ఈ పొట్ట తెలుపు బియ్యపుగింజ విస్తీర్ణంలో 10. శాతంలోగా ఉంటే తక్కువగాను, 10-20 శాతం వరకుంటే మధ్యస్థంగాను, 20 * శాతం కన్నా ఎక్కువైతే అధిక పొట్ట తెలుపు రకాలుగా పరిగణిస్తారు. వరి పంట పూత సమయంలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పుప్పొడి నిర్జీవమై పరాగసంపర్కం జరగక తాలు వస్తుంది. దీనివల్ల పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది.
Also Read: Rice Stem Borer In Paddy: ఇటీవల వరిని ఆశిస్తున్న కాండం తొలుచు పురుగు నివారణ చర్యలు.!
అన్నం నాణ్యత:
సాధారణంగా వండిన అన్నం నాణ్యత పెరిగింజలోని అమైలోజ్ స్థాయిపై ఆధారపడుతుంది. అమైలోజ్ స్థాయిని బట్టి వరి రకాలను తక్కువ (20 శాతం కన్నా తక్కువ), మధ్యస్థ (20-25 శాతం), ఎక్కువ (25 శాతం కన్నా ఎక్కువ మైలోజ్ రకాలుగా విభజించవచ్చు. సాధారణంగా అమైలోజ్ మధ్యస్థ స్థాయిలో ఉన్న రకాలు అన్నానికి అనుకూలమైనవి. బియ్యాన్ని వండి నప్పుడు అది ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీటిని గ్రహించి ఉడకటం మొదలు పెడుతుందో దాన్ని జెలాటినైజేషన్ ఉష్ణోగ్రత అంటారు.
సాధారణంగా జెలా టినైజేషన్ ఉష్ణోగ్రత మధ్యస్థంగా 70-74 డిగ్రీ సెం.గ్రే. ఉన్న రకాలు అన్నా నికి అనువైనవిగా పరిగణిస్తారు. సాధారణంగా పొట్ట తెలుపు ఉన్న గింజ లకు, సరిగా తోడుకోని గింజలకు ఈ ఉష్ణోగ్రత మారుతుంది. వండిన అన్నం మృదువుగా లేదా గట్టిగా ఉండటం అనేవి జెల్ కన్సిస్టెన్సీ అనే లక్షణంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జెల్ కన్సిస్టెన్సీ తక్కువగా (20-40 మి. మీ.) ఉన్న రకాల అన్నం చాలా గట్టిగాను, ఎక్కువగా (60 మి.మీ. కన్నా ఎక్కువగా ఉన్న రకాల అన్నం మెత్తగాను ఉంటుంది. కాబట్టి మధ్యస్థ జెల్ కన్సిస్టెన్సీ ఉన్న రకాలు (40-60 మి.మీ.) అన్నానికి అనువైనవి.
వరిగింజ భౌతిక, రసాయనిక నాణ్యత, రకం గుణగణాలపై ఆధారపడిన ప్పటికీ పైన తెలిపిన విధంగా వాతావరణం కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా రైతు పంటకాలంలో చేపట్టే యాజమాన్య పద్ధతులపై కూడా ఆధారపడి ఉంటుంది. నాణ్యత కలిగిన ధాన్యాన్ని పొందడానికి రైతు పంట కాలంలో కొన్ని మెలకువలను పాటించాలి. వీటిని పంట కోతకు ముందు, కోత సమయంలో కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా విభజించవచ్చు.
Also Watch:
Must Watch: