Optimum plant population: విత్తనపు నాణ్యత – విత్తన నాణ్యత మొలకశాతం, మొలిచిన మొక్క బలంగా ఉండడం బట్టి నాణ్యతను నిర్ణయించవచ్చు. విత్తన మొలకపాతం కనీసం 85 ఉండాలి. విత్తన నాణ్యత విత్తనం లో అండము యొక్క జీవనశక్తి పై ఆధారపడి ఉంటుంది.
విత్తన శుద్ధి/అభిచర్యం: విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళ వ్యాప్తిని నిరోధించుటకు శిలీంద్ర నాశీనులతో / జీవసంబంధిత నివారణ మందులతో శుద్ధి చేయాలి.కొన్ని పంటల విత్తనాలకు నిద్రావస్థ స్థితి ఎక్కువ కాలం ఉంటుంది. కొన్ని పంటలకు నిద్రావస్థ స్థితి ఉండదు. కొన్ని రసాయనాలతో శుద్ధి చేసి విత్తిన నిద్రావస్థ స్థితి తొలగి మొలకెత్తుతుంది. కొన్ని పంటలలో విత్తనపు పై పొర చాలా గట్టిగా వుండి మొలక శాతం తగ్గుతుంది. అటువంటి విత్తనాలను గరుకు ప్రదేశం పై రుద్దిన పై పొర పల్చనయి నేలలో తేమను పీల్చుకొని మొలకెత్తుతాయి.
ఉదా: ఆముదాలు
ప్రత్తి విత్తనం మీద ఉన్న ఫజ్ ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లముతో శుద్ధి చేసిన ఫజ్ మాడి విత్తనము బాగా మొలకెత్తును. పప్పు జాతి పంటలను ఒక ప్రాంతం లో క్రొత్తగా ప్రవేశ పెట్టుటకు ముందు ఆ విత్తనాన్ని సరైన జీవన ఎరువుతో కలిపి విత్తిన మొలక శాతం తో పాటు పంట దిగుబడులు పెరుగుతాయి. ఉదా: సోయా చిక్కుడు ను “రైజోబియం జపానికం” అనే జీవన ఎరువులను వాడి దిగుబడులు పెంచవచ్చు.
Also Read: Nitrogen Fixing Biofertilizers: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులతో ఎన్నో లాభాలు.!
ప్రధాన మడి తయారీ: ప్రధాన మడిలో కలుపు మొక్కలు, పంట మోళ్ళు దుబ్బులు) పూర్తిగా తొలగించి పంటకు సరిపడ్డ దుక్కి దున్ని విత్తుకోవాలి.
విత్తే లోతు: విత్తనాలు సమానం గా, త్వరగా మొలకెత్తుటకు సరైన లోతులో విత్తాలి. ఆ లోతులో తగినంత తేమ ఉండేటట్లు చూడాలి. విత్తే లోతు నేలను బట్టి (బరువు నేలల్లో పై పైన, తేలిక నేలల్లో కొద్దిగా లోతుగా) మరియు ” కొలియాస్టైల్” పొడవు ను బట్టి (పొట్టి వాటికి పై పైన, పొడుగు వాటికి లోతుగా ) ఆధారపడి ఉంటుంది.
నేల ఉష్ణోగ్రత: విత్తే లోతు వద్ద అతి తక్కువ లేదా ఎక్కువ ఉష్ణోగ్రత లు ఉన్నా మొలక శాతం తగ్గుతుంది.
నేలలో తేమ: సరిపడ్డ తేమ ఉన్నప్పుడే విత్తనం నాటిన విత్తనం నీటిని పీల్చుకుని త్వరగా మొలకెత్తుతాయి.
నేలలో గాలి: నేలలో విత్తనం నాటగానే తేమను పీల్చుకొని అనేక రకాల ఎంజైములు పనిచేస్తూ మొలకెత్తుటకు వీలవుతుంది. మొలకెత్తే సమయం లో ఉద్ఛ్వాస నిశ్వాసములు అధికం గా వుండడం వల్ల నేలలో తగినంత గాలి ప్రసరణ ఉండాలి.
నేల గట్టితనo: నేలలో చౌడు వున్నపుడు లేదా బంకమన్ను అధికం గా గల నేలలైన, లేదా అత్యధిక ఇనుప ధాతువు ఉన్నపుడు విత్తిన వెంటనే వర్షము పడిన నేల పై పొర గట్టి పడి విత్తనపు మొలక పైకి రాలేదు. అటువంటి నేలలకు అత్యధికంగా సేంద్రియ పదార్ధం చెయ్యాలి.
ఋతువు: ఖరీఫ్ పంట కాలంలో అధిక వర్షాలు పడి పొలం లో నీరు నిలబడిన మొలక దెబ్బ తింటుంది. అదే విధం గాఅత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నా మొలక శాతం తగ్గుతుంది.