Canopy Cultivation: కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీలకు 50శాతం సబ్సిడీపై పందిర్ల సాగుకు రాయితీలను అందిస్తున్నారు. దీంతో రైతులు సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లిస్తున్నారు. దీనిలో భాగంగా కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. తక్కువ కాలంలో అధిక దిగుబడులను సాధించే పందిరి కూరగాయలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
నేలపై వేసే కూరగాయల్లో ఎక్కువగా తెగుళ్లు సోకుతున్నాయి. ఎన్ని పురుగు మందులు పిచికారి చేస్తున్న ప్రయోజనం ఉండటం లేదు. అంతేకాకుండా వచ్చే కాస్త దిగుబడులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. నాణ్యత లేకపోవడంతో మార్కెట్లో వాటికి ధర పలకడం లేదు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పందిరి కూరగాయల సాగుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
తక్కువనీటితో ఎక్కువ సాగు
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు వంద శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. చిక్కుడు, దొండ, కాకర, బీర, సోరకాయ, బీర్నీస్ పందిరిపై సాగు చేస్తుండగా, పందిరి కింద టమాటా, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, దొండ, మిరప పంటలను సాగు చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని పోందుతున్నారు. వరి, ప్రత్తి, మిరప పంటలు వేసి నష్టపోయే కంటే తక్కువ కాల వ్యవధి లో కూరగాయల సాగు చేసి ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని రైతులు అంటున్నారు. అంతేకాకుండా డ్రిప్‌తో సాగు చేయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకోవచ్చని వీటిని కూడా వంద శాతం సబ్సిడీని అందిస్తోందని రైతులు అన్నారు. ఈఆవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు కోరుతున్నారు.
Also Read: Curry Leaves: కిలో రెండు రూపాయలు పలుకుతున్న కరివేపాకు.!
అకౌంట్‌లో డబ్బులు జమ
పందిరిపై తీగజాతి కూరగాయలు, పందిరి కింద కూరగాయలను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులను తీస్తున్నారు. దీంతో పెట్టుబడులు పోను తమకు కాస్త డబ్బులు మిగులుతున్నాయని రైతులు అంటున్నారు. అన్ని పంటలు ఒకేలా సాగుచేస్తే నష్టపోతారని ఇలా చేస్తే తెగులు కూడా రాదని, తక్కువ నీటితో పంటలను సాగు చేయవచ్చు.
రైతులు అరెకరం లో కూరగాయల పందిళ్లు వేసుకుంటే వారికి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఇస్తున్నది. పందిళ్లు వేసుకున్న రెండు నేలల్లో రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. ఈ రైతును చూసి మిగతా రైతులు ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నారు. తోటలు దగ్గరకు వచ్చి కూరగాయలను కోనుక్కుంటున్నామని అన్నారు.
Also Read: Date Palm Cultivation: కాసుల పంట ఖర్జూరం, ఒక్కసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి..