Nutrient Deficiencies in Turmeric Crop: నత్రజని లోపం – పొలంలో నీరు నిలబడిన లేదా క్షార గుణం కలిగి ఉండి లేదా సమతల మరియు సమగ్ర ఎరువులు వాడకపోవడం వల్ల నత్రజని లోపం రావచ్చు. ఆకులు పాలి పోయి లేదా ఆకు పచ్చ రంగుకి మారతాయి.పైరు ఎదగాక పోవడం ఆకులు కొనలనుండి మడి పోవడం. దిగుబడి తగ్గడం.
లోప నివారణకు మరుగు నీరు పోవు సౌకార్యం కలిపించాలి.
సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి.
లోపం గమనించిన వెంటనే 20 గ్రా. యూరియా ½మి. లీ శాండో విట్ లేదా టీపాల్ లాంటి సబ్బు నీరు కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
పసుపు నాటిన వెంటనే మాల్చింగ్ చేయాలి.
పొటాషియం లోపం
ఆకుల అంచులు ఎండి పోయి పాలిపోతాయి.
పిలకలు తక్కువగా వస్తాయి.
పండిన కొమ్మలు ఎండిన తర్వాత ముడతలు ఏర్పడతాయి.
కొమ్ములలో కర్కుమీన్ పసుపు రంగు తగ్గుతుంది.
మొక్కలు సులభంగా చీడ పిడలకు గురి అవుతాయి.
లోప నివారణకు లీటర్ నీటికి 10 గ్రా.మల్టి – కె లాంటి పోషకాలను 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశెనగలో విత్తన శుద్ధి ఎలా చేయాలి.!
ఇనుము ధాతు లోపం
నేలలో చౌడు, సున్నం ఎక్కువగా ఉన్నపుడు , సేంద్రియ పదార్ధం తక్కువగా ఉన్నప్పుడు, భాస్వరం ఎక్కువగా ఉన్న ఆమ్లా భూములు ఈ లోపనికి కారణం కావచ్చు. లేత ఆకు ఈనెలు ఆకు పచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం తెల్లగా మారిపోతుంది.
ఆకు సైజ్ తగ్గి, ఆకులు ఎండి పోతాయి.
దుంపలు,కొమ్ములు చిన్నవి గా తయారు అయ్యి. నాణ్యత తగ్గుతుంది.
నివారణకు లీటర్ నీటికి 5 గ్రా. ఫెర్రాస్ సల్ఫేట్ లేదా 10గ్రామ్. అన్నబేది 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పైరు పై 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
జింక్ లోపం
ముదురు ఆకుల్లో ఈ పోషక లోపం కనిపిస్తుంది.
ఈనెల మధ్య భాగం లేత ఆకు పచ్చ రంగుకు మారుతుంది.ఆకులు దగ్గర దగ్గరగా కుచ్చులమాదిరి ఉంటాయి.
లోప నివారణకు దుక్కిలో ఎకరాకు జింక్ సల్ఫేట్ వేయాలి.
లీటర్ నీటికి 5 గ్రా జింక్ సల్ఫేట్ ½ మీ. లీ.సబ్బు నీరు కలిపి 15 రోజులకి 2 సార్లు పిచికారీ చేయాలి.
Also Read: Advances in Tractor Use: ట్రాక్టర్ వినియోగంలో మెలకువలు.!