Modern Seedling Cultivation: ఇరు తెలుగు రాష్ట్రంలో వాణిజ్య పంట అయినా మిరపను రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతిలో మిర్చిని పండించడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఎక్కువ దిగుబడులను సాధించడానికి అనేక సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది పలికిన ధరలతో రైతులు కౌలుకి తీసుకొని మరీ మిర్చిని వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు అధిక రేట్లు పెట్టి మరీ మిర్చినారును కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో నకిలీ విత్తనాలు, నకిలీ మిర్చి నారు వలన రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మిర్చి నారు నిర్వహకులు రసీదులు కూడా ఇవ్వకపోవడంతో రైతులు పూర్తిగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో కొంతమంది రైతులు వినూత్న పద్ధతిలో మిర్చి నారును పెంచుతున్నారు. మిర్చి నారును రైతులు ఎకరం భూమిలో 50, 60 ఎకరాలకు సరిపడా నారును పెంచుతున్నారు. పొలంలో ఆధునిక పద్ధతిలో మిర్చి నారును పెంచుతుడంతో చుట్టుపక్కల తోటి రైతులు ఇక్కడకు వచ్చి మరీ నారును కొనుగోలు చేస్తున్నారు.
నారు కోసం క్యూ కడుతున్న రైతులు
పంట పొలంలో నీరు పుష్కలంగా ఉండటంతో ఈనాడును పెంచుతున్నట్లు రైతులు తెలుపుతున్నారు. ఈ నారు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందని రైతులు అంటున్నారు. ఈ నారు వల్ల ఆధిక దిగుబడి వస్తుందని రైతులు తెలుపుతున్నారు. ఇక్కడ మిర్చి నారు కోసం దూర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి మరీ కొంటున్నారని నారు పెంపకం దారులు అంటున్నారు. సొంత పొలంలో రైతులు మిర్చి నారు ను సాగు చేస్తున్నారు.
Also Read: Carrot Cultivation: క్యారెట్ పంట ఇలా సాగు చేస్తే రైతులకి మంచి లాభాలు వస్తాయి.!
విత్తనాలను నారు పోయడం తో పెద్ద ఎత్తున్న డిమాండ్ ఏర్పడింది. అక్కడ మిర్చి నారును కొనడానికి రైతులు క్యూ కొడుతున్నారు. మిర్చి నారు కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి మరీ కొంటున్నారు. రెండు నెలలకు ముందే విత్తనాలను కొనుగోలు చేసి మరీ తమ సొంత కమతంలో నారును పెంచుతున్నారు. నర్సరీలో పెంచే నారుపై నమ్మకం లేక రైతులు పంట పొలంలో నారును పెంచుతున్నారు.
ఇక్కడ వేసిన నారు వాతావరణ పరిస్ధితులను తట్టుకొని మరీ నిలబడుతుందని కొనుగొలుదారులు అంటున్నారు. దీనికి పెట్టుబడులు కూడా తక్కువ అవుతాయని అంతేకాకుండా నాణ్యమైన దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు.ఈనారును కొనుగోలు చేయడానికి రైతులు ఆసక్తిని చూపుతున్నారు.
Also Read: Intercropping Onion: రెండు ఋతువులు మధ్య అంతర పంటగా ఉల్లి సాగు.!