మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

Mushroom Cultivation: పుట్టగొడుగుల షెడ్ ల విషయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
Mushrooms
Mushrooms

Mushroom Cultivation: పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

Mushroom Cultivation

Mushroom Cultivation

జాగ్రత్తలు:

  • 16 చదరపు అడుగుల ఒక పూరి పాక లేదా షెడ్ అవసరం. దాన్ని విత్తు విత్తడానికి ఒక గది, పెంపకానికో గది ఉండేలా విభజించుకోవాలి.
  • విత్తడానికి వాడే గదిలో 25 నుంచి 300 సె ఈ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చక్కని గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.
  • పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250 సె ఉష్ణోగ్రత ఉండేలా, గాలిలో 75 – 80% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత, తేమలను కొలిచే డిజిటల్ థర్మామీటర్లు, హ్యుమిడిటీ మీటర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. స్పాన్(పుట్టగొడగులను విత్తడం)

Also Read: పుట్టగొడుగులలో వచ్చే ఈగల వ్యాధులు, వాటి నివారణ చర్యలు

Shed

Shed

  • సరైన ఆధారం : సజ్జ/ ముడిశనగలు / జొన్న, గోధుమ ధాన్యాలు
  • స్పాన్ తయారుచేయడం : సగం ఉడకబెట్టిన ధాన్యాలు గాలికి ఎండబెట్టి, 2 శాతం కాల్షియం కార్బొనేట్ పొడితో కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ గ్లూకోజు డ్రిప్ బాటిళ్లలో నింపాలి. వాటిని పత్తితో మూతి బిగించి 2గంటలసేపు ఉడకబెట్టాలి.
  • వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి లేదా వ్యవసాయ శాఖలనుంచి పరిశుద్ధమైన శిలీంధ్రాన్ని తెచ్చి గది ఉష్ణోగ్రతకు దగ్గర 15 రోజులు పొదగనివ్వాలి. ఈ 15-18 రోజుల స్పాన్ను ఉపయోగించి విత్తాలి పుట్టగొడగుల పాదును ఏర్పాటు చేయడం
Mushrooms

Mushrooms

  • సరైన ఆధారం : వరి గడ్డి / గోధుమ గడ్డి, చెరకు పిప్పి, పైపొట్టుతీసిన మొక్కజొన్న
  • ఉడకబెట్టడం : 5సెం.మీల ముక్కలుగా వాటిని కత్తిరించి నీటిలో 5గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని ఒక గంటసేపు వేడిచేయాలి. ఆ తర్వాత నీటిని వొంపి, 65 శాతం తేమ మాత్రమే ఉండేలా ఆరబెట్టాలి(చేతులతో నీటిని పిండకూడదు).

Also Read: పుట్ట గొడుగులు – పోషకాల గనులు

Leave Your Comments

Benefits of Vermi Compost: వర్మికంపోస్టింగ్ వల్ల లాభాలు

Previous article

OPSC Invites Online Applications:123 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు

Next article

You may also like