Coconut Crop: భారతదేశంలో పండించే వాణిజ్య పరమైన పంటలలో కొబ్బరి ముఖ్యమైనది. దీనిని కేరళ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేశంలో 54% విస్తీర్ణం, 42% ఉత్పత్తి ఒక్క కేరళలోనే ఉంది, ఉత్పాదకతలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రులో కొబ్బరి లక్ష హెక్టార్లలలో సాగుచేయబడుతూ సాలీనా 1000 మిలియన్ కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పాదకత ఎకరాకు 4 వేల కాయలు నెల్లూరు, క్రిష్ణ, గుంటూర్, గోదావరి జిల్లాలు విజయవాడ, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలు సాగుకు అనుకూలమైనవి.
కొబ్బరిలో ప్రతి భాగం ఉపయోగకరమైనది. వ్యాపార రీత్యా కొబ్బరి నూనె, ఎండుకొబ్బరి, పీచు ముఖ్యమైనది. చెట్టు కాండాలను వంట చెరుకు, కలపగా వాడుతారు. కొబ్బరి ఉష్ణమండలపు చెట్టు, తేమతో కూడిన వేడి వాతావరణం సాగుకు మిక్కిలి అనుకూలం. కొబ్బరి మొక్కలను మెట్ట ప్రాంతాలలో జూన్-జూలై నెలల్లో పల్లపు ప్రాంతాలలో అక్టోబర్-నవంబర్ నెలలో నాటుకోవచ్చు. సముద్ర తీర ఇసుక భూములు, డెల్టా భూములు పొడిమన్ను కలిగిన నేలలు కొబ్బరి సాగుకు రకాలు: కొబ్బరిలో ముఖ్యంగా పొడవు, పొట్టి అను 2 రకాలు ఉంటాయి.
రకాలు:
1. అంత గంగ అండమాన్ ఆర్డినరి గంగా బొండం
2. గోదావరి గంగ: ఈస్ట్ కోస్టల్ గంగా బొండం
3. కేరళ గంగ: వెస్ట్ కోస్టల్ గంగా బొండం
ఈస్ట్కాస్టాల్ : చెట్టు 20-25 మీటర్ల పొడవు పెరుగుతుంది. 7-10 సంవత్సరాల లోపు కాపు మొదలౌతుంది. సంవత్సరానికి 8–100 కాయలను దిగుబడిగా వచ్చును. కాయలో నూనె శాతం 60-65 వరకు వుండును.
గంగా బొండం: ఈ రకం 8 మీటర్ల వరకు పెరుగును. నాటిన 4 సంవత్సరాలకు కాపు వస్తుంది. సంవత్సరానికి 50-60 కాయలు దిగుబడిని
ఇస్తుంది. నీరు చాలా తీరుగా ఉంటుంది. సంకర జాతి కొబ్బరి మొక్కల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించును. కాయలో నూనె 68% వరకు ఉంటుంది. కొబ్బరిని విత్తన పిలకల ద్వారా మొక్క వస్తుంది.
Also Read: Backyard Garden Maintenance:పెరటి తోటల కృషి .. రోజురోజు స్వనిర్వహణ.!
చెట్టు ఎన్నికలో చాలా శ్రద్ధ వహించాలి. తల్లి మొక్కలను ఎన్నుకొనేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నుకోవాలి. మొక్క వయస్సు 25-50 సంవత్సరాల వరకు ఉండాలి. బాగా పెరిగిన 30-40 ఆకులను కల్గి ఉండాలి. చెట్టు తల భాగం గోళాకారంగా ఉండాలి. నిటారుగా ఉండకూడదు. సుమారు 100 కాయల దిగుబడిగా ఇచ్చే మొక్కలను ఎన్నుకోవాలి. ఇంటి దగ్గరలో పశువుల షెడ్డుకు, ఎరువు దిబ్బలకు దగ్గరలో పెరిగే మొక్కలను ఎన్నుకోరాదు.
చీడ పీడలు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలు ఎన్నుకోవాలి. నీడలో నిలువ చేయాలి. తర్వాత అనువైన మడులను కట్టి విత్తనపు కాయలను 30 x 30 సెం.మీటర్ల దూరంలో పై విధంగా ఎన్నుకొన్న తల్లి మొక్క నుండి బాగా పరిపక్వం చెందిన 11-12 నెలలు కాయలను కొట్టి ఒక నెల అడ్డంగా వరుసల్లో నాటి మట్టితో కప్పి నీరు పెట్టాలి.
చెట్టు మొదలు నుండి 2 మీటర్ల వరకు పళ్ళెం చేసి 0.5 – 2 మీటర్ల మధ్యలో 15 సెం.మీటర్ల లోతులో సమంగా ఎరువును చల్లాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదును సంవత్సరానికి 2 భాగాలుగా విభజించి, జూన్-జూలై , అక్టోబర్-నవంబర్ నెలల్లో వేయాలి. జూన్-జూలై నెలల్లో 100 కేజీల చివికిన పశుపుల ఎరువు , 2 కేజీల వేప పిండిని ప్రతి చెట్టుకు వేయాలి.
సంవత్సరానికి ఒక సారి 50-75 గ్రాముల బోరాక్స్ వేయాలి. దెయ్యపు తట్టు నివారించటానికి పొటాష్, కాయ పగుళ్ళు నివారించటానికి బోరాన్ పని చేస్తాయి. జీలుగ, జనుము, పిల్లి పెసర మొదలైన పంటలను తొలకరిలో చల్లి ఆగష్టు-సెప్టెంబర్ నెలల్లో పూత దశల్లో దుక్కిలో కలియ దున్నాలి. అంతర పంటలు: నాటిన 5 సంవత్సరంలోపు మొక్కజొన్న, పుచ్చ, కాయకూరలు, పూల మొక్కలు, వేరుశనగ పంటలను, సారవంతమైన భూముల్లో దుంప పంటలను వేసుకోవచ్చు 2 సంవత్సరాలు పైబడిన యెడల అరటి, అనాస మిరియాలు, కంద, చాము, పసుపు మొదలైన పంటలను అంతర పంటలుగా పండించవచ్చు.
నీటి యాజమాన్యం: తగినంత తేమ లేకపోతే పూత, పిందెరాలటమే కాక కాయల దిగుబడి తగ్గును. వేసవిలో 3-4 పర్యాయాలు నీరు కట్టడం వల్ల అధిక దిగుబడులను పొందవచ్చు. కాలువల ద్వారా ప్రతి చెట్టుకు విడివిడిగా నీటి వసతి ఏర్పాటు చేసుకోవాలి. తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవటానికి ప్రతి చెట్టుకు 50 గ్రాముల కొబ్బరి పీచు పొట్టు, సేంద్రీయ ఎరువుల మరియు పచ్చి రొట్ట ఎరువులు వేయాలి. డ్రిప్ పద్దతి ద్వారా నీరు కట్టడం వలన నీటిని 2-3 వంతులు పొదుపు చేసుకొనవచ్చు.
చీడ పీడల వలన కూడా పిందె రాలుట సంభవించవచ్చు దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. వర్షకాలంలో 2-3 సార్లు బైటాక్స్ 3 గ్రాములు 1 లీటరు నీటిని కల్పి పిచికారి చేయాలి..
కొబ్బరిలో పూత పూసిన మార్చి-ఏప్రిల్, 13 నెలలకు కాయలు పక్వానికి వచ్చును. నీటి కాయలకు బొండాలకు 6-7 నెలల వయసు గల కాయలు కోయాలి. కొబ్బరి కొరకు 11-12 నెలల వయసు గల కాయలు కోయాలి. కొబ్బరి చెట్టు నాటిన 6-7 సంవత్సరాలకు కాపుకు వచ్చును. కొబ్బరి చెట్టు సగటు సంవత్సరానికి 80-100 కాయ దిగుబడి యిస్తాయి. పక్వానికి వచ్చిన కాయలను ఎప్పటికప్పుడు సంవత్సరం పొడవునా కోసుకోవచ్చు.
Also Read: Organic Sugarcane Farming: సేంద్రియ వ్యవసాయంలో చెరుకు సాగు చేయడం ఎలా ?