Sunflower Cultivation: మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనెగింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడులో నూనె (49%) మరియు మాంసకృత్తులు (22%) ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం (66% ఎక్కువగా ఉండుట వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే శ్రేష్ఠమైనది. ఈ నూనెను వనస్పతి తయారీకి, వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృత్తులు (21%) ఉండుట వలన పశువులు మరియు కోళ్ళ దాణాగాను విరివిగా వాడుతున్నారు.
అనువైన వాతావరణ పరిస్థితులు :
ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20-25 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనువైనది. వర్షాధారపు పంట కాలంలో 500-750 మి.లీ. వర్షపాతం సమానంగా విస్తరించి, పూత మరియు గింజ కట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటి పారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండిరచవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో కాని లేదా పగటి ఉష్ణోగ్రత 38 %జ% కంటే ఎక్కువగా కాని ఉండకుండా చూసుకోవాలి. రబీ మరియు వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడినిస్తుంది.
రకం పంట కాలము నూనె (%) దిగుబడి (కి./హె.)
ఎన్.డి.ఎస్.హెచ్ -1012 90-95 40-41 1500-1800
ఎల్.యస్.ఎఫ్.హెచ్-171 90-95 34-35 1600-1800
డి.ఆర్.ఎస్.హెచ్ -1 92-95 42-44 1300-1600
కె.బి.ఎస్. హెచ్- 44 90-95 36-38 1400-1600
విత్త్తే సమయం :
రబీలో నవంబర్ – డిశంబర్ మరియు వేసవిలో నీటి పారుదల క్రింద జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
విత్తే దూరం : 45 సెం.మీ.I25 సెం.మీ.
విత్తన మోతాదు : 2 కిలో
వరి తరువాత ప్రొద్దు తిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుండి జనవరి మొదటివారం వరకు విత్తుకోవాలి. నీటిపారుదల పంట ఎరువుల యాజమాన్యం (కి/ఎ) నత్రజని32(16G8G8) భాస్వరం36, పొటాష్12 నత్రజని మొదటి దఫా విత్తేటప్పుడు 50% (35 కిలోల యూరియా) తరువాత రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో 25% (18 కిలోల యూరియా), మూడవ దఫాగా 50 రోజుల తరువాత పూవు వికసించే దశలో 25% (18 కిలోల యూరియా) ఒక ఎకరానికి వేసుకోవాలి. మొత్తం భాస్వరాన్ని 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్) మరియు పొటాష్ని (20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైపాటుగా ఎరువు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ వుండేటట్లు చూసుకోవాలి.
గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో (55 కిలోలు / ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూతదశలో (ఆకర్షక పత్రాలు వికసించే దశలో) ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. దీనివలన గింజలు బాగా కడుతుంది. మొదట బోరాక్స్ను వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేయాలి. లేదా ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల చొప్పున బోరిక్ ఆమ్లాన్ని వేస్తే అధిక దిగుబడి పొందవచ్చు.
కలుపు నివారణ, అంతరకృషి :
విత్తిన 30-40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. లీటరు నీటికి పెండిమిథాలిన్ 30% ఇ.సి. 5 మి.లీ. కలుపుకొని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజుల తరువాత గొర్రుతో అంతరకృషి చేయాలి లేదా ఫినాక్సిప్రాప్ ఇథైల్ / క్విజలోఫాప్ ఇథైల్ 1.25 మి.లీ. లీటరు నీటికి కలిపి గడ్డిజాతి కలుపును నివారించవచ్చు.
సస్యరక్షణ :
శనగపచ్చ పురుగు :
ప్రొద్దు తిరుగుడు పండిరచే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగు ఆశిస్తుంది. దీని లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్న యెడల స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా నొవల్యురాన్ 1 మి.లీ. లేదా ఫ్లుబెండామైడ్ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 200 ఎల్.ఇ. పిచికారి చేసి కూడా ఈ పురుగును నివారించవచ్చు.
1. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు :
ఈ తెగులు ప్రొద్దుతిరుగుడు పండిస్తున్న అన్ని ప్రాంతాలలో ఆశించి విపరీత నష్టం కలుగజేస్తుంది. ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. వాతావరణం అనుకూలించినట్లయితే పంట వేసిన 20 రోజుల నుండి ఈ తెగులు మొదలవుతుంది. ఈ తెగులు సాధారణంగా 45-60 రోజుల మొక్కల మీద కనిపిస్తుంది. సాధారణంగా మొక్కల పూత దశలో మరియు గింజకట్టే దశలో ఈ తెగులు ఉధృతి అధికం కావడం గమనించవచ్చు. ముదురు గోధుమ రంగు లేదా నల్లటి గుండ్రని లేదా అండాకారపు మచ్చలు మొక్క యొక్క క్రింది ఆకులపై ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయాలు ఏర్పడి మచ్చల మధ్యభాగం బూడిద రంగులో కనిపిస్తుంది. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోవటమే గాక పువ్వు కుళ్ళిపోయే అవకాశం ఉంది. దీనివల్ల గింజ నాణ్యత తగ్గి మొలకశాతం తగ్గిపోతుంది.
ఈ తెగులు లక్షణాలు ఆకులపైనే కాక ఆకు కాడలు, కాండం, పువ్వు వెనక భాగాలు మరియు పూరేకులపై కనిపిస్తాయి. కాండం మీద మచ్చలేర్పడినప్పుడు వాటి మధ్యభాగం చీలిపోయి ఉంటుంది. దీని నివారణకు క్వింటాల్ (ఇప్రోడియోన్ 25% G కార్బెండిజిమ్ 25%) లేదా సాఫ్ (కార్బెండిజిమ్ 12% G మాంకోజెట్ 63%) 2 గ్రా. ను కేజి విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. అదే విధంగా సాఫ్ లేదా క్వింటాల్ అనే మందును 2 గ్రా. లేదా టాస్పా (డైఫెనకొనజోల్ 25% G ప్రొపికొనజోల్ 25%) 0.25 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 25% ఇ.సి. 1 మి.లీ. లేదా నేటివో (ట్రిప్లాక్సిస్ట్రోబిన్ 25% G టెబ్యుకొనజోల్ 50%) 0.3 గ్రా. లీటరు నీటికి కలిపి 30-45 రోజుల పంట కాలంలో పిచికారి చేయాలి. పంట అవశేషాలను పూర్తిగా నిర్మూలించాలి.
2 పువ్వు (తల) కుళ్ళు :
ఈ తెగులు పూతదశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది. మొదట మొక్క చివరి భాగంలో మరియు పువ్వు క్రింద వున్న ఆకులు శిలీంధ్రం ఆశించుట వలన ఎండిపోతాయి. పువ్వు క్రింది భాగం నీటిలో తడిచినట్టు ఉండి తర్వాత గోధుమ రంగుకు మారుతుంది. దీని నివారణకు ఫెన్ థియాన్ 1 మి.లీ. మరియు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పువ్వు దశలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
3. నెక్రోసిస్ తెగులు :
ఈ తెగులు పైరును అన్ని కాలాల్లో, ఏ దశలోనైనా ఆశించవచ్చు. ఇది వైరస్ వల్ల వచ్చే తెగులు. తామర పురుగుల ద్వారా ఈ తెగులు పొలమంతా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు ఆకుల మధ్య ఈనె దగ్గరగా వుండే భాగం ఎండిపోయి మొదట బూడిద రంగులోను తర్వాత నల్లగా మారి వంకరలు తిరుగుతుంది. తరువాత ఆకు కాడకు, కాండానికి పువ్వుకు వ్యాపించి నల్లగా మాడి ఎండిపోతాయి. లేత మొక్కలలో ఈ తెగులు వస్తే ఆకులు సరిగా పెరగక గిడసబారి ఎండిపోతాయి. పూతదశలో వస్తే పువ్వు సరిగా విచ్చుకోక, మెలిక తిరిగి వంకర టింకరగా మారిపోతుంది. పుష్ప భాగాలు దెబ్బతిని విత్తనవృద్ధి జరగదు.
డా.పి.వెంకట రావు, వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త,
డా.జి.చిట్టిబాబు, సస్యరక్షణ శాస్త్రవేత్త,
డా.జె.జగన్నాధం, ప్రధాన శాస్త్రవేత్త Ê సమన్వయ కర్త