వ్యవసాయ పంటలు

Fertilizer Management in Rice: వరిలో ఎరువుల యాజమాన్యం.!

1
Fertilizer Management in Paddy
Weed Management in Paddy

Fertilizer Management in Rice: భూసారా పరిరక్షను అధిగమించడాననికి రసాయనిక  ఎరువుల తో  బాటు సేంద్రియ లేదా జీవన  ఎరువులను  వాడి పైరుకు  సమాతుల్యంగా  పోషక  పదార్థాలను అందజేయాలి.

  • పశువుల ఎరువు, కాంపోస్టు, కోళ్ల ఎరువు వంటి  సేంద్రియ  ఎరువులను   రాసాయనిక  ఎరువు తో  కలిపి   వడినట్లయితే 20-25%  నత్రజనిని  ఆదా చేయవచ్చును.
  • వరి  మగణుల్లో  అపరాలు , జిలుగ,  జనుము, పిల్లి పెసర వంటి  పచ్చి రొట్టె పైరును పెంచి  కలియ  దున్నడం  ద్వారా భూసారం  పెరగడమే  గాక సుమారు 20-25 శాతం  నత్రజని, భాస్వరం, పోటాష్ లను  కూడా ఆదా చేయవచ్చు.
Nutrient management System

Fertilizer Management in Rice

  • సజీవ  ఎరువులైన నీలి ఆకు పచ్చ నాచు, అజోల్ల, అజోస్పైరిల్లం, ఫోస్సో బాక్టీరియా  మొదలగు  జీవన   ఎరువులను  వాడి నత్రజని, భాస్వర  మొతాదు లను  10-20 % తగ్గించవచ్చు 
  • నీలి ఆకు పచ్చ  శైవలాల – నాచు – వీటిని వరి పొలం లో వేస్తె ఎకరాకు  10 కిలోల  నత్రజని పైరుకు  అందుతుంది.  నాచుకు  పొడి చేసి  వరి  నాట్లు  వేసిన 7-10 రోజుల  మధ్య మడి  లో పలుచగా నీరు నిలువ  గట్టి ఎకరాకు నాలుగు కిలోల  నాచు   పొడిని ఇసుకతో  కలిపి మడి  అంటా  సమానం గా పడేటట్లు  చల్లాలి.
  • అజోల్లా   – వరి  పొలం దమ్ములో ఎకరాకు  50  కిలోల  సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలుచగా నీరు   100-150 కిలోల  అజోల్లా వేసి 2-3 వారాలు  పెరగనిచ్చి నేలలో  కలియ దున్నలి.  
  • ఎకరాకు  మూడు టన్నుల పచ్చి రొట్ట మరియు   12 కిలోల  నత్రజని  నేలకు   అందిస్తుంది .

Also Read:Brown Rice Health Benefits: బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే లాభాలు

అజాటో బాక్టర్ :  ఎకరాకు సరిపడే  విత్తనానికి 200-400గ్రా  చొప్పున  కాల్చరు ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చరును 20 కిలోల  పశువుల ఎరువు తో  కలిపి  ఎకరం  నేలపై చల్లల్లి .  దీని వల్ల ఎకరాకు   8-16 కిలోల  నత్రజని   పైరుకు అందుతుంది.

అజోస్పైరిల్లందీనిని కూడా అజాటో బాక్టర్ వాలే వాడాలి.

Azospirillum

Azospirillum

ఫాస్ఫో బాక్టీరియా :ఇది  భాస్వర  జీవన  ఎరువు.   భూమిలో  లభ్యం  కాని స్థితి లోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా  చేస్తుంది.   ఎకరాకు   సరిపడే  విత్తనం తో 200-400 గ్రాముల  కల్చర్  ను పట్టించాలి   లేదా ఒక  కిలో కల్చర్  ను  ఇరవై   కిలోల పశువుల ఎరువు తో  కలిపి ఎకరం  నేలలో  వేయాలి.

  •  భూసారాన్ని  బట్టి  రాసాయనిక   ఎరువుల మొతాదు నిర్ణయించి   నత్రజని , భాస్వరం , పోటాష్, జింకు నిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి.
  • వివిధ ప్రాంతాలకు  సిఫారసు చేసిన   పోషకాల మోతాదు, రకాల కాల పరిమితి , నేల  స్వభావం, భూసారం, ఋతువు , యాజమాన్యం పద్ధతులు బట్టి మారుతుంది.
  • నత్రజనిని  కాంప్లెక్స్  ఎరువుల  రూపం  లో గాని యూరియా రూపం లో గాని వాడవచ్చు 
  • నత్రజనిని మూడు సమ భాగాలు  గా చేసి  నాటుకు  ముందు  దమ్ము లోను, దుబ్బు చేసే  దశ  లోను, అంకురo   దశ లోను  బురద  పదునులో  మాత్రమే  సమానంగా   వెదజల్లి 36-48 గంటల  తర్వాత పలచగా  నీరు పెట్టాలి.
  • 50 కిలోల  యూరియా కి 10 కిలోల వేపపిండి  లేక 250 కిలోల తేమ  కలిగిన  మట్టిని గాని  కలిపి , రెండు రోజులు నిల్వ వించి  వెదజల్లితే  నత్రజని   వినియోగం  పెరుగుతుంది.
  • మొత్తం  భాస్వరం  ఎరువును దుమ్ములోనే వేయాలి.
  • పోటాష్ ఎరువులను   రేగడి  నేలలో   ఆఖరి   దమ్ములో  పూర్తి గా ఒకసారి వేయాలి. చల్కా  నేలల్లో ఆఖరి దమ్ములో సగం, అంకుర దశలో  మిగతా  సగాన్ని వేయాలి.
  • కాంప్లెక్స్ ఎరువులను  పై  పాటుగా దుబ్బు చేసి   సమయంలో  గాని, అంకురo ఏర్పడే దశలో  గాని వేయకూడదు.

Also Read:Late planting in rice: వరిలో ఆలస్యంగా నాట్లు వేయటానికి కావాల్సిన మొలకల వయస్సు

Also Watch:

Leave Your Comments

Integrated Farming Practices: సమగ్ర వ్యవసాయ పద్ధతులు .!

Previous article

Mango Fruit Orchards: పండ్ల తోటలు.!

Next article

You may also like