Maize Farmers: మొక్కజొన్న ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఆదరణ పొందడంతో పాటు తక్కువ పంట కాలపరిమితి, ఆధిక దిగుబడి ఎక్కువగా రావడంతో చాలామంది రైతులు ఈపంట సాగు వైపు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో దాదాపు కొన్ని వేల హెక్టార్లలో రైతులు మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చీడపీడలు పంటను నాశనం చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్షాభావం ఏర్పడడంతో ఈబెడద అనేది తగ్గడం లేదు. దీంతో పంట చేతికి రాదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు తీసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాలు గురించి తెలియజేస్తున్నారు.
శాస్త్రవేత్తల సూచనలు
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటి ఇది ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగా, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను దీనిని ఉపయోగిస్తున్నారు. వర్షపాతం ఆధారంగా ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో వర్షాలు పడటంతో మొక్కజొన్న ను రైతులు సాగు చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో అయితే దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు.

Maize Farmers
వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగుకు నల్లరేగడి, ఎర్రనేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలం. సారవంతమైన నేలల్లో సాగు చేయకపోవడం మరియు సరైన సమయంలో నాటక పోవడం. కలుపు నివారణ పలు కారణాల వల్లన మనం దిగుబడులను సాధించలేకపోతున్నారు. వీటి పాన మనం దృష్టి పెడితే మంచి దిగుబడులను సాధించవచ్చు.
అధికారులు స్పందించాలి
మనదేశంలో పండించే పంటల్లో మొక్కజొన్న ఒకటి. దీనికి మార్కెట్లో మంచి ధర పలకడంతో పంటలపై ఆసక్తి చూపుతున్నారు. నీటి వసతి కింద రైతులు ఈ పంటను వేసుకుంటున్నారు. దీని ద్వారా రైతులకు అధిక దిగుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు తీవ్ర వర్షాభావంతో మొక్కజొన్న సగం పంట దెబ్బతింటే ప్రస్తుతం కాస్తోకూస్తో ఉన్న పంటను కత్తెర పురుగు నాశనం చేస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి పురుగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెండు మూడు సార్లు పిచికారి చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే పెటుబడులు భారీగా పెరుగుతున్నాయాని అన్నదాతలు అంటున్నారు. కలుపు సమస్య ప్రధాన సమస్యగా మారిందని కూలీల కొరత అధికంగా ఉందని అంటున్నారు. అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Also Read: e- Crop App Problems: రైతులకు ఈ క్రాప్ ఇక్కట్లు.!