Leafy Vegetables Cultivation in Summer: సమీకృత పోషకాహారంలో ఆకుకూరలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను సాగు చేసుకో వచ్చు. ఎండాకాలంలో హరితగృహాల్లో గాని, బయటగాని ఆకుకూరల సాగు చాలావరకు లాభదాయకంగా ఉంటుంది. ఆకుకూరగా, పప్పులో, పరోటాల్లో వీటిని ఉపయోగిస్తారు.
వేసవిలో పండించే ఆకుకూరల్లో ముఖ్యమైనది తోటకూర, తోటకూర గింజల్ని పేలాలుగా, చిక్కోలుగా, మాల్స్ తయారీలో ఉపయోగిస్తారు.
తోటకూరలో మాంసకృత్తులు, లవణాలు, కాల్షియం, ఇనుము, విట మిన్ ఎ, సి అధికంగా లభిస్తాయి. పాలకూరలో ఎక్కువగా విటమిన్ ఎ, సి, మాంసకృత్తులు, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. మెంతి కూరలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. ధనియాలు ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్నాయి.
Also Read: Insect Pests in Leafy Greens: వివిధ ఆకుకూరల్లో తెగుళ్ల సమస్యలు -నివారణ
ధనియాల లేతమొక్క కొత్తిమీర అంటారు. కరివే పాకు తర్వాత కొత్తిమీర మన ఆహారంలో సువాసన కలిగించే ఆకుగా విరివిగా వాడుతారు. బచ్చలి కూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. బచ్చలిలో ఆక్సాలిక్ ఆసిడ్ పాలకూరలో కన్నా చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల మూత్రపిండాలకు ఎలాంటి హాని కలగదు. కాని ఈ ఆకుకూర అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.
వేసవిలో ఆకుకూరలు:
వేసవిలో నీటి ఎద్దడి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల అన్ని పంటలను సాగుచేయలేం. నీటి వసతి ఉన్నచోట మడులుగా చేసి ఆకుకూరలు సాగుచేస్తే రైతుకు లాభం, కూలీలకు ఉపాధి కూడా దొరుకుతుంది. ఆకుకూరల సాగులో లాభాన్ని పొందవచ్చు.
Also Read: Bay Leaf Health Benefits: ఈ ఒక్క ఆకు ఎన్నో సమస్యలకు దివ్య ఔషధం
దిగుబడి పెంచే మార్గాలు:
ఆరుతడి పంటగా విస్తీర్ణం పెరగాలి. తక్కువ కాలపరిమితి కలిగి, అధిక దిగుబడి శక్తిగల రకాలనురూపొందించాలి.మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.ఈ మధ్యకాలంలో హరితగృహాల్లో కూడా ఎత్తయిన నారుమడులు చేసుకొని వాటిపైన డ్రిపై లైన్ అమర్చి ఆకుకూరలను సాగుచేసి రైతులు మంచి లాభాలను గడిస్తున్నారు.
రకాల ఎంపిక:
పాలకూరలో ఆస్క్రీన్, తోటకూరలో ఆర్. ఎన్. ఎ-1, అర్కఅరుణ (ఎరుపు) రకాలు, మెంతిలో పూసా ఎర్లీ బంచింగ్ రకం, కొత్తిమీరలో స్వాతి, సాధన రకాలు, గోంగూరలో ఎర్రగోంగూర రకం అనువైనవి. నేలలు: ఆకుకూరలు అన్నిరకాల నేలల్లో పండించవచ్చు. కాని ఇసుకతో కూడిన తువ్వ నేలలు బాగా అనుకూలం. నీరు నిల్వకుండా ఉండాలి. ఉదజని సూచిక 5.5 – 7.5 మధ్య ఉన్న నేలలు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి.
నేలను నాలుగైదుసార్లు బాగా దున్ని, చిన్నచిన్న మడులుగా తయారు చేసుకోవాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 15 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్ని, మళ్లను బాగా చదునుగా చేయాలి.
విత్తన మోతాదు:
ఎకరాకు తోటకూరలో 800 గ్రాములు, పాలకూరలో 10-12 కిలోలు, మెంతికూరలో 8 కిలోలు, కొత్తిమీరలో 4-5 కిలోల విత్తనం వాడాలి.
Also Watch:
Must Watch: