Late Harvesting – పంట కోత: పంట పక్వ దశకు వచ్చిన తర్వాత పంట తీసివేయుట / కోయుట చేసి దానిలో ఆర్థిక విలువ కలిగిన భాగములను వేరుచేయుట ను “పంట కోత” అంటారు. పంట కోసిన తర్వాత నేలలో వదిలి వేసిన వ్రేళ్ళ భాగము మరియు నేలపై వదలి వేసిన కాండ భాగం కలిపి (స్టబుల్) అం టారు.
పంట తయారీ కి ముందు కోత వలన నష్టాలు: నూర్పిడి మరియు మరలో ఆడించి నపుడు గింజ విరిగి పోతుంది.గింజ బరువు తగ్గుతుంది. దాని వలన దిగుబడి తగ్గుతుంది.నూర్పిడి చేసినపుడు గింజ పూర్తిగా వేరు చేయబడదు.బాగా ముదరని గింజ నాటి నపుడు మొలకెత్తక పోవచ్చు. మొలకెత్తిన గింజలో ఆహార పదార్దములు మొలకెత్తు టకు, మొలిచిన మొక్క పెరుగుటకు కావలసిన శక్తి నందించదు. కోసిన ఉత్పత్తి లో అధిక తేమ మరియు అపక్వ గింజలు ఎక్కువగా ఉంటాయి.
ఆలస్యం గా పంట కోత వలన నష్టాలు: గింజలు రాలిపోవుట మరియు పొలంలో వెదజల్ల బడుట జరుగుతుంది.చీడ పీడలు, ఎలుకలు, పక్షుల వలన నష్టాలు.పంట పడి పోవచ్చు.
పైన పేర్కొన బడిన నష్టాలను అధిగమించి, పంట నాణ్యత, అధిక దిగుబడులు సాధించుటకు పంటను సకాలంలో కోయాలి.
పంట పక్వత రెండు రకాలు:
· వృక్ష శరీర ధర్మ పక్వత (physiological maturity)
· కోత పక్వత (Harvest maturity)
వృక్ష శరీర ధర్మ పక్వతః ధాన్యపు గింజ లేదా ఇతర ఉత్పత్తులలో బరువు ఏ స్థాయి లో పెరుగుతుందో దానిని “వృక్ష శరీర ధర్మ పక్వత “.అంటారు. అనగా ప్రత్యుత్పత్తి దశ పూర్తి అయినట్లు గా వ్యక్తమౌతుంది. ఈ పక్వత వద్ద గింజ మృదువు గా ఉంటుంది. కాని గింజ లోనికి/ ఇతర ఉత్పత్తుల లోనికి మొక్క తయారు చేయు పిండి పదార్ధాలు/ క్రొవ్వు పదార్ధాలు / మాంస కృత్తుల సరఫరా ఆగి పోతుంది.
కొన్ని పైర్లకు బాహ్య లక్షణాలు: మొక్క జొన్న, జొన్న – గింజ క్రింది భాగంలో నలుపు పొర ఏర్పడుట. కంది – పుష్పించిన 25 రోజుల తర్వాత ఆకు పచ్చని కాయలు గోధుమ రంగు లోనికి మారుట.
కోత పక్వత (harvest maturity): వృక్ష శరీర ధర్మ పక్వత తర్వాత 7 రోజులకు కోత పక్వత కు చేరుకుంటుంది. గింజ లోని పిండి పదార్థాలు పూర్తిగా నిండిన తర్వాత బీజ కవచం రంగు మారుట, తేమ తగు స్థాయి కి తగ్గినపుడు చూపే పక్వత ను “కోత పక్వత” అంటారు.
Also Read: Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!