Castor Cultivation: దేశంలో పండించే నూనెగింజల పంటల్లో ఆముదం సాగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కప్పుడు ఆముదంను చివరి పంటగా ఎంచుకునే వారు. అయితే నేడు అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడంతో ఇది రైతులకు ఆదాయ వనరుగా మారింది. అంతేకాకుండా నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలుగుతుంది. మెట్ట పాంత్ర రైతులు దీనిని ఒక్క పంటగా ఎంచుకోని దీని ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. చాలా ప్రాంతాల్లో అన్నదాతలు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సరైన సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లుతే దీని ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.
ఆముదం సాగులో ప్రపంచంలో మన దేశం మొదటి స్థానం
ఆముదం పంట, ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఆయుధం సాగవుతుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో దీని విస్తీర్ణం వుంది. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్, రాకెట్‌పరిశ్రమల్లో లూబ్రికెంట్‌గానూ, పాలిష్‌లు, ఆయింట్‌మెంట్లు , మందుల తయారీల్లోనూ, డీజిల్‌పంపుసెట్లలో డీజిల్‌కు ప్రత్యమ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. సబ్బులు, డిటర్జెంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండటంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది.
Also Read: Drone Subsidy: 50 శాతం సబ్సిడీపై రైతులకు డ్రోన్లను పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.!

Castor Cultivation
బెట్ట పరిస్థితులకు చేరుకున్న ఆముధం
ఆముధం పంట ఉత్పత్తుల వల్ల భారతదేశానికి కొన్ని వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. అయితే ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యంగా రావడం వల్లన చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో రైతులు విత్తలేకపోయారు. అక్కడక్కడ వేసిన ఆముదం వర్షాభావ పరిస్ధితులు వల్లన బెట్టకు చేరుకుంది. అంతేకాకుండా పంట వాడు దశకు చేరుకుంది. గింజ ఏర్పడే దశలో వర్షాభావం ఏర్పడం తో కొంత మంది రైతులు పంటను దున్నుతున్నారు మరికొన్ని రోజులు ఇవే పరిస్ధితులు వెంటాడితే నస్ఠాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో కూడా వర్ష సూచన కనిపించడం లేదు. ఆముదంతో పాటు మరికొన్ని పంటలు అయినా వేరుశనగ, కంది, పత్తి పంటలు కూడా నీటి ఎద్దడికి గురై వాడు దశకు చేరాయి.
మార్కెట్లో మంచి ధర పలకడం
సరైన నీటి తడులు అందించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే మంచి దిగుబడులను ఆశించే అవకాశం ఉంది. ఆముదం సాగుకు తక్కువ పెట్టుబడి కాబట్టి రైతులు రాయలసీమలో ఎక్కువగా సాగుచేస్తారు,. దానికి తోడు శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతోంది. సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లైతే ఎకరానికి 5 నుండి 6 క్వింటాల దిగుబడిని పొందవచ్చని ఆధికారుల అంటున్నారు. నీటి సౌకర్యం ఉంటే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే వీలుందని అంటున్నారు.
Also Read: Polyhouse Rose Cultivation: పాలిహౌస్ లో గులాబి సాగు, లక్షల్లో ఆదాయం.!