Green Gram Cultivation: మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 8.13 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 1.36 లక్షల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 180 కిలోలు. ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి, రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. పతి పంటలో అంతర పంటగా కూడ పండిస్తారు.
ఖరీఫ్ కాలంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను, కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం , ఉత్తరకోస్తా మండలాల్లో జూన్- జులైలోను విత్తుకోవచ్చు. రబీలో ఉత్తర, దక్షిణ తెలంగాణా, కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబరులో రైతులు పెసర పంట విత్తనాలు విత్తుకుంటారు . కృష్ణా-గోదావరి మండలంలో వరి మాగాణుల్లో నవంబరు-డిసెంబరు మొదటి వారంలో, వేసవికాలంలో ఫిబ్రవరి – మార్చిలో విత్తుకుంటారు.
పెసరను రాజస్తాన్, మాహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాకాలపు పంటగా సాగుచేస్తారు. ఎక్కడైతే సాంద్రవ్యవసాయ పద్ధతులను అవలంబిస్తారో, ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో, ఈ పంటను రబీలోను, వేసవిలోను ఎక్కువగా పండిస్తారు. తమిళనాడు, పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఈ పంటను రబీ/వేసవిలలో ఎక్కువగా పండిస్తారు.
Also Read: Green Gram Cultivation: పెసర పంటను రెండు సార్లు పండించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.!
ఆంధ్రప్రదేశ్ లో పెసరను వర్షాకాలం, చలికాలం, వేసవి కాలంలో రెండు పంటల మధ్యకాలాలలో కూడా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో జూన్ లో విత్తుతారు. చిత్తూరు,అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిజిల్లాల్లో జూన్-జూలై మాసాల్లో విత్తుతారు.
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అక్టోబరులో విత్తుతారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరి మాగాణుల్లో నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుతారు.
ఎండా కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి, మార్చి మాసాల్లోని విత్తుతారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఎంత త్వరగా విత్తితే పెసర దిగుబడి అంత ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో రైతులు పెసర పంటని సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. దానితో పాటు మంచి లాభాలు కూడా రైతులు పొందుతారు.
Also Read: Castor Cultivation: ఆముదం సాగును దున్నుతున్న రైతులు.!