Crop Protection In Agriculture: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులను సాధించే క్రమంలో తమకు ఉన్న అనుభవంతో గాని తోటి రైతులు చేపడుతున్న యాజమాన్య పద్ధతులు చూసుకొని కొన్ని సందర్భాలలో సిఫార్సు చేసిన మోతాదుకు మించి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం వలన పర్యావరణ సమతుల్యత లోపించడంతో పాటు రసాయనాలను తట్టుకునే శక్తి అధికం కావడంతో పాటు సాగు ఖర్చులు పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా మనదేశంలో హరిత విప్లవం మొదలైన తర్వాత అధిక మోతాదులో ఎరువులు వాడటం వల్లన పంటలను ఆశించే చీడపీడలు పెరగడం గమనించడం జరిగింది. దీనివలన రైతులు వివిధ రకాల పురుగుమందులను చీడపురుగుల నియంత్రించడానికి విచక్షణ రహితంగా మరియు అవగాహన లోపంతో వినియోగిస్తున్నారు. అందువలన పురుగుమందుల ప్రభావం ఉత్పత్తుల నాణ్యత పైన పర్యావరణం మీద అధికంగా ఉండటం వలన పురుగుమందులు వాడకుండా ఆహార పద్ధతులు ద్వారా నియంత్రించవలెను. సమగ్ర సస్యరక్షణ లో భాగంగా ఎర్ర పంటలు, కంచె పంటలు పెంచడం ద్వారా పురుగు వల్ల మరియు పురుగు మందుల వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read: విద్యుత్ లేకపోయినా నీరు తోడేస్తున్న మోటార్… ఆ రైతు ఐడియాకి నెటిజన్లు ఫిదా.!
ఎర పంటలు : కొన్ని రకాల పురుగులు కొన్ని పంటలకు మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి. కావున ఆపంటలను పురుగుల ఆకర్షించడానికి ఎరగా వాడాలి. వీటిని ఎరపంట అంటారు. ఎర పంటను ఎన్నిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎర పంటను పురుగు ఉనికిని తగ్గట్టుగా ఎన్నిక చేయవలసి ఉంటుంది. ఎర పంట అనేది చీడపురుగులను ఆకర్షించేదిగా ప్రధాన పంటలను అన్ని దశలలో కాపాడే విధంగా మరియు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా ఉండాలి. ఎర్ర పంటను వాడటం వలన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కాకుండా పురుగుమందుల వినియోగం తగ్గించవచ్చు. ఎర్ర పంటలను ప్రధాన పంటలు వేసేటప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
కంచె పంటలు : కంచె పంటలు వీటిని రక్షక పంటలను కూడా అంటారు. ముఖ్యంగా వీటిని పొలంలో ముఖ్య పంటకు చుట్టూ గాని, గట్టు వెంబడి కానీ, కొద్ది వరసులో వేస్తారు. ఈ పంటలు పురుగులను శిలింద్ర బీజాలను ఒక పొలం నుండి ఒక పొలానికి రాకుండా అడ్డుకోవడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ముఖ్య పంట కన్నా ఎత్తు పెరిగేవిగా ఉంటాయి. మినిము, పెసర పంటలలో మంచి పంటలను వేసి తెగుళ్లను వ్యాప్తి చేసే తెల్ల దోమ త్రిప్స్ వంటి రసం పిల్చు పురుగుల ఉధృతిని వలసను నిరోధించవచ్చు. వేరుశనగ, మిరప పంటలో జొన్న, సజ్జ వంటి పంటలను వేయడం ద్వారా తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈవిధంగా వ్యవసాయంలో రక్షణ పంటలు వేసి పురుగులు మరియు తెగులు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read: వేరుశనగ కాయలను నిల్వఉంచేటప్పుడు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.!