వ్యవసాయ పంటలు

Deficiency Symptoms in Plants: వివిధ పంటలలో సూక్ష్మపోషకాలు ప్రాముఖ్యత, లోప లక్షణాలు, లోప నివారణ.!

0
Nitrogen Deficiency in Plant
Nitrogen Deficiency in Plant

Deficiency Symptoms in Plants: తక్కువ సరఫరా లేదా అవసరమైన మూలకాలలో ఏవైనా పూర్తిగా లేకపోవడం విలక్షణమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఇవి నిర్దిష్ట మూలకాలు(ల)కు ప్రత్యేకమైనవి. ఈ పరిస్థితిని పోషకాహార లోపం అని మరియు లక్షణాలను లోపం లక్షణాలు అని పిలుస్తారు. వివిధ పోషక మూలకాల యొక్క లోప లక్షణాలు పోషకాల చలనశీలతను బట్టి పాత లేదా చిన్న ఆకులపై కనిపిస్తాయి. అందువలన, పోషకాహారం యొక్క సాపేక్ష చలనశీలత లోపం లక్షణాల రూపాన్ని ప్రభావితం చేస్తుంది.
చలన పోషకాలు : మొక్కలో లోపం ఉన్నప్పుడు, పరిపక్వమైన కణజాలం (పాత ఆకులు) నుండి యువ మెరిస్టమ్‌కు మారినప్పుడు చలన పోషకాలు అంటే పాత కణజాలంపై లోపం లక్షణాలు కనిపిస్తాయి. చలనం లేని పోషకాలు : మొక్కలో లోపం ఏర్పడినప్పుడు అవి పాత కణజాలం నుండి చిన్న కణజాలానికి మారలేవు మరియు అందువల్ల లోప లక్షణాలు చిన్న ఆకులపై కనిపిస్తాయి.

Deficiency Symptoms in Plants

Deficiency Symptoms in Plants 

జింక్‌ ధాతువు ప్రాముఖ్యత :

  •  మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
  • నత్రజని భాస్వరం, ఇతర పోషకాల సమర్ధ వినియోగానికి ఉపయోగపడుతుంది.
  • మొక్కలో అమైనో ఆమ్లాలు, మాంసకృత్తుల తయారీకి దోహదపడుతుంది.

జింక్‌ ధాతువు లోప లక్షణాలు :

  • జింక్‌ లోపిస్తే ఆకుల ఈనెల మద్యభాగం ఇరు ప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండును.
  • పంటలలో ఎక్కువ  మోతాదులో భాస్వరం ఎరువుల వాడకం వలన జింక్‌ లోపం వస్తుంది.

సవరణ :

  • ఒకేసారి వరి పండిరచే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి, రెండు పంటలు పండిరచే భూముల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరిదమ్ములో, ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ చివరి దుక్కిలో వేయాలి.
  • జింక్‌ లోపం సవరించడానికి ఎకరాకు 400 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
  • జింక్‌ ఎరువును భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు.

ఇనుపధాతువు ప్రాముఖ్యత :ఆకుల్లో పత్రహరితం, పిండి పదార్ధాలు తయారవడానికి ఉపయోగపడుతుంది.                                                              ఇనుపధాతువు లోప లక్షణాలు :ఇనుప ధాతువు లోపానికి నేలలోని సున్నం శాతమే కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఇనుపధాతువు లోపిస్తే లేత చిగురుటాకులు ముందుగ పసుపు రంగుకు మారి తదుపరి తెలుపుగా మారి చివరకు ఇటుక రంగులోకి మారి నిర్జీవ మవుతాయి.

Deficiency Symptoms

Deficiency Symptoms 

సవరణ :

  • ఇనుపధాతువు లోపం సవరించడానికి ఎకరాకు 20 కిలోల అన్నభేది ఆఖరి దుక్కిలో వేయాలి.
  • పైరుపై ఇనుపధాతువు లోప లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 1 కిలో అన్నభేది 200 గ్రా. సిట్రిక్‌ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

బోరాన్‌ ధాతువు ప్రాముఖ్యత :

  • మొక్కల పూత దశలో సంపర్యము మరియు ఫలదీకరణలో కీలక పాత్ర వహిస్తుంది.
  • మొక్కల ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కల్లోని అన్ని భాగాలకు చేరవేయడంలో ఉపయోగపడుతుంది.
  • మొక్కలు కాల్షియం ధాతువును సంగ్రహించి దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్‌ అవసరం.

Also Read:Nutritional Deficiencies in Maize: మొక్కజొన్నలో వచ్చే పోషక ధాతు లోపాలు వాటి యాజమాన్యం.!

బోరాన్‌ లోప లక్షణాలు :

  • సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలలలో బోరాన్‌ లోపం ఎక్కువగా వస్తుంది.
  • బోరాన్‌ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకు కొనలు నొక్కుకు పోయినట్లై, పెళుసుబారతాయి.
  • కాయ దశలో కాయలు పగుళ్ళు చూపడం సర్వ సాధారణంగా కనపడే లక్షణం.
  • బోరాన్‌ గింజల అభివృద్ధికి అవసరం.

సవరణ :

  • ఎకరాకు 2 కిలోల బోరాక్స్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి.
  • బోరాన్‌ లోప నివారణకు 0.15 శాతం లేదా బోరికామ్లాన్ని పూత, పిందె దశలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

జిప్సం ప్రాముఖ్యత :

  • జిప్సం ఎరువులో కాల్షియం, గంధకం ధాతువులు ఉంటాయి.
  • చౌడు భూముల్లో ఉండే మార్పిడి  చెందే సోడియంను  తగ్గించి నేలలను  బాగుచేయడానికి జిప్సం ఎరువు అవసరం.
  • జిప్సం ఎరువులో కాల్షియం ధాతువు మొక్కలో కొన్ని రకాల అమైనో ఆమ్లాల తయారీకి, అనేక ఎంజైమ్‌ల తయారీకి, నత్రజని స్తీరీకరణకు, కిరణజన్య సంయోగ  క్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది.
  • నూనె గింజల  పంటలలో మాంసకృత్తులు, నూనె శాతం  పెరగడానికి ఉపయోగపడుతుంది.
  • ఉల్లి, వెల్లుల్లి  ఘాటు రావడానికి గంధకం ధాతువు దోహదపడుతుంది.
Tamato Plant with Deficiency symptoms

Tomato Plant with Deficiency symptoms

జిప్సం పంటకు వేసే సమయం :

  •  కారుచౌడు నేలలను బాగు చేయడానికి వేసవి వర్షాల సమయంలో వేసి నేలలో కలియ దున్నాలి. తరువాత పొలంలో నీటిని నిల్వగట్టాలి. జిప్సం ఎరువు మోతాదును భూసార పరీక్షల ద్వార తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతె  ఎకరాకు సుమారుగా 1.2-1.6 టన్నుల జిప్సంను వేయవచ్చు.
  • నూనె గింజల  పంటలకు ఎకరాకు 200 కిలోల జిప్సంను  చివరి దుక్కిలో వేయాలి. వేరు శనగ పైరుకైతే పూత దశలో వేసి నేలలో  కలపాలి.
  • అపరాల పంటలైన సోయాచిక్కుడు కంది,పెసర, మినుము, సంగ వంటి పైర్లకు జిప్సం ఎరువును  చివరి దుక్కిలో ఎకరాకు 50-100 కిలోలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Also Read: Fruit Plants Planting Methods: పండ్ల మొక్కలు నాటే విధానం – పద్ధతులు.!

Also Watch:

Leave Your Comments

Percentage of Butter in Milk : పాలలోని వెన్న శాతం ను ఎలా కనుక్కోవాలి.!

Previous article

National Nutrition Week 2022: జాతీయ పోషకాహార వారోత్సవాలు.!

Next article

You may also like