Importance of Food Grain Crops: ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, రాగి మరియు ఇతర చిరు ధాన్యాలు ప్రపంచ ప్రజలందరికి ప్రధాన ఆహారం గా వినియోగించ బడుతుంది. వరి గోధుమ తర్వాత ప్రపంచం లో ప్రధాన ఆహార పంట. వరి ముఖ్యం గా ఆసియా దేశ వాసులకు ముఖ్య ఆహార పంట కాగా, పాశ్చాత్య దేశాలలో గోధుమ వినియోగం ఎక్కువ. భారత దేశంలో దక్షిణ రాష్ట్రాలకు వరి ప్రధాన ఆహార పంట కాగా ఉత్తర భారతం లో గోధుమ ప్రధాన ఆహార పంట గా పరిగణింపబడుతుంది.గోధుమ ప్రపంచ జనాభాలో 10 బిలియన్ల ప్రజలకు ప్రధాన పోషకాహారమై ఉన్నది. కాని భారత దేశం లో వరి తర్వాత గోధుమ రెండవ స్థానం లో ఉన్నది.
మొక్కజొన్న అతి ప్రధాన ధాన్యపు పంట. ఈ పంట కు గల ఉత్పాదక శక్తి ఏ ధాన్యపు పంటకు లేదు. ప్రస్తుతం పశువులు, కోళ్ళ దాణాలో మొక్కజొన్న ప్రముఖ పాత్ర వహిస్తున్నది. మొక్కజొన్నలో తీపి మొక్కజొన్న, ఏలాల మొక్కజొన్న, బేబీ కార్న్ అత్యధికం గా ఉపయోగించబడుతుంది.మొక్కజొన్నతో తయారయే అనేక పదార్థాలు వివిధ పరిశ్రమలలో ఉపయోగించడం వల్ల ప్రస్తుతం ఈ పంట అత్యధిక ప్రాధాన్యత సంతరించు కొంటున్నది.
Also Read: Quail Rearing: కౌంజు పిట్టలపెంపకం లో కొన్ని సూచనలు.!
జొన్న ఆసియా, ఆఫ్రికా ఖండ ప్రజలకు ప్రధాన ఆహార పంటగా వున్నది. దీని నుండి వచ్చిన గడ్డి పశువుల మేత గా ఉపయోగపడుతుంది.మొక్కజొన్న, జొన్న పంటలలో ప్రత్యేక రకాలు పశువుల పచ్చిమేత కు రూపొందించ బడినవి. పంట గింజ పాలు పోసుకునే సమయం లో యంత్ర సహాయం తో చిన్న చిన్న ముక్కలు గా (chaffing) చేసి దాడా గా అనేక ప్రాంతాల్లో ఉపయోగపడుతున్నది. అంతేకాక అత్యధికం గా పంట వచ్చినపుడు పచ్చి కాండము లను ముక్కలు గా చేసి “సైలేజ్” గా తయారు చేసి పశువుల దాణా గా వేసిన పాల ఉత్పత్తి పెరుగుతుంది.
బార్లీ, ఓట్స్ ముఖ్యమైన పశువుల దాణాగా వాడటమే కాకుండా బార్లే మాల్ట్ ను బీరు తయారీకి ముఖ్య ముడిపదార్ధం గా వాడబడుతుంది. రాగి ముఖ్యం గా దక్షిణ భారత దేశం లో ప్రధాన ఆహార పంట. ఇది ముఖ్యం గా ఆరోగ్యకరమైన తిండి పంటగా పరిగణింపబడుతుంది. కనుక దీనిని ధనికులు, పేదవారికి అందుబాటులో వుండడం వల్ల ఎక్కువ గా వాడుకలో ఉన్నది. ముఖ్యం గా దీనిని “షుగర్ వ్యాధి” గల వారు వాడుకోవచ్చు.మిగిలిన చిరు ధాన్యాలు అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా నీటి ఎద్దడి ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతాల్లో పండిస్తూ గిరిజనుల ప్రధాన ఆహార పంటలు గా చలామణి అవుతున్నాయి.
ఇవి నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. 12. చిరుధాన్యాలు నిల్వ చేసినపుడు చీడ పీడల వల్ల గింజలకు ఎటువంటి నష్టం కలగకుండా కనీసం 2-3 సంవత్సరాలు నిల్వ చేసుకోవచ్చు. అందువలన కరువు వచ్చిన సంవత్సరాలలో ఈ చిరుదాన్యాలే మనకు ఆధారం అవుతున్నాయి. చిరుదాన్యాలలో అధిక పీచు పదార్ధం వుండడం వల్ల శరీర ఆరోగ్యానికి మంచిది. అంతేగాక అధిక శ్రమ చేసేవారు. వీటిని ఆహారం గా ఉపయోగించడం వల్ల బలవర్ధకమైన ఆహారం గానే కాకుండా వెంటనే ఆకలి వేయదు. ప్రపంచం లో అనేక జాతుల ప్రజలు అన్ని ధాన్య రకాలను వివిధ పద్ధతులలో ఆహార పదార్ధాలుగా వినియోగించు కోవడం గొప్ప విశేషం.
Also Read: Cassia Angustifolia Cultivation: నేలతంగేడు సాగులో మెళుకువలు.!