వ్యవసాయ పంటలు

Fruit Drop: పండ్ల తోటల్లో కాయ, పిందె రాలుట ఎలా నివారణ చేయాలి? నిల్వకు ఏం చేయాలి.!

0
Stop Fruit Drop
Stop Fruit Drop

Fruit Drop – కాయ మరియు పిందె రాలుటకు నివారణ చర్యలు: సాధారణంగా కాయ మరియు పిందె రాలుట రెండు దశలలో గమనించవచ్చు. చెట్ల పాదుల్లోని ఒడిదుడుకులు హఠాత్తుగా వాతావరణం లో వచ్చే మార్పులు కొన్ని చెట్లలో జరిగే రాసాయనిక మార్పులు వలన కాయ పిందె రాలడం గమనించగలరు.చెట్లు పూత పిందెలతో ఉన్నపుడు త్రవ్వడం, దున్నడం చేయకూడదు.ఆలా చేయడం వలన పూత రాలిపోవడం జరుగుతుంది.ఎండలు ముదిరినప్పుడు చెట్లకు నీరు పెట్టకపోవడం మరియు హార్మోన్ల లోపం వలన పూత పిందె రాలడం జరుగుతుంది.

కొబ్బరిలో కొత్తగా కాపు పట్టిన లేత తోటల్లో 8-10 సంవత్సరాల వయసులో పిందెలు రాలుతు ఉండడం మనం గమనించవచ్చు.పోటాష్ లోపం వల్ల, నీటి ఎద్దడి, హార్మోన్ల లోపం వల్ల పిందె రాలడం అనేది ఎక్కువగా ఉంటుంది.కొన్ని సార్లు పురుగుల వల్ల కూడా పూత పిందె రాలుతూ ఉంటుంది.

Also Read: Bud and fruit dropping in trees: కాయ, పిందె రాలుట కు కారణాలు మరియు అరికట్టే పద్ధతులు

Fruit Drop

Fruit Drop

నివారణకు ఎం చేయాలి?
హార్మోన్ల లోపం వల్ల పూత పిందె రాలిపోయినట్లు అయితే కృత్రిమంగా 5-10 PPM,2-4 డి 10-20PPM NAA పిచికారీ చేయడం ద్వారా అరికట్టవచ్చును. కొబ్బరిలో పిందె రాలుట నివారణకు 2-4 డి పిచికారీ చేయాలి.

గ్రేడింగ్ ఎలా చేయాలి?
పండ్లు కోసిన తర్వాత నీడలో పెట్టాలి.దానిలో పిందెలు వ్యాధి సోకిన మరియు కుళ్ళిన వాటిని వేరు చేయాలి.వేరు చేసిన తర్వాత పండ్ల ఆకారం మరియు పరిమాణం, రంగు బరువును బట్టి యత్రికంగా కానీ మనుషుల ద్వారా కానీ వేరు చేయాలి.

Citrus fruit drop

Citrus fruit drop

రవాణాను ఎలా ఎన్నుకోవాలి?
రవాణా ఎన్నుకొనే ముందు పంపించే సరుకు యొక్క నిలువ సామర్ధ్యం మరియు పంపించే దూరం ను దృష్టిలో ఉంచుకోవాలి.తొందరగా పడయ్యే వాటిని పొలంలో వేడిని తగ్గించుటకు ప్యాక్ చేయకముందే చల్ల పరచి రవాణా చేయాలి.

ఎలా నిలువ చేయాలి?
ఉల్లి మరియు ఆలుగడ్డ ఎక్కువ కాలం నిలువ ఉంచుతారు.మిగతా కూరగాయలు తక్కువ సమయం కొద్ది రోజులు లేదా కొన్ని వారలు మాత్రమే నిల్వ ఉంటాయి.పండ్లు మరియు కూరగాయల నిల్వ కు తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ తేమ శాతం అవసరం.

Also Read: Coconut Fruit Drop: కొబ్బరిలో పిందెలు రాలటాన్ని ఇలా నివారించండి.!

Leave Your Comments

Minister Niranjan Reddy: చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!

Previous article

Curry Leaves Health Benefits: కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే ఏమోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Next article

You may also like