Spirulina: మనదేశంలో కరోనా తర్వాత రైతులు ఔషధ మొక్కలకు డిమాండ్ ఉండటంతో, ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. రైతులు ఆహార పంటలతో పాటు ఔషధ మొక్కలు పెంచుతున్నారు. తక్కువ సమయం, శ్రమతో, మన ఇంటి దగ్గర మట్టితో పనిలేకుండ, నిల ట్యాంకుల్లో స్పిరులినా సాగు చేసుకోవచ్చు. స్పిరులినాలో 60-70 శాతం ప్రొటీన్ ఉంది. స్పిరులినా ఇమ్యూనిటీబూస్టర్‌గా పనిచేస్తుంది. స్పిరులినా టాబ్లెట్స్ రూపంలో కూడా వాడుకోవచ్చు. సూర్య కాంతి బాగా ఉంటే స్పిరులినా బాగా పెరుగుతుంది. స్పిరులినా పెంచడం వల్ల ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
సముద్రంలో దొరికే నాచుని స్పిరులినా అంటారు. సముద్రం నీరు ఉప్పగా ఉండటంతో స్పిరులినా మంచిగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకి 15-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. స్పిరులినా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటే పెరగదు. నీటిలో pH 9 ఉండాలి, తక్కువ ఉంటే సోడియం క్లోరైడ్, బేకింగ్ సోడా, ఉప్పు నీటిలో కలపడం వల్ల pH 9కి వస్తుంది. స్పిరులినా సాగుకు మీ పొలం వద్ద లేదా ఇంటి వద్ద పొడవైన ట్యాంక్ ఉండి, అడుగుభాగంలో మందమైన ప్లాస్టిక్ కవర్ వేసి నీటిని నింపాలి. తల్లి స్పిరులినా తెచ్చి ట్యాంక్లో వేసి నీటిలో కలపాలి. టైమర్ మోటారుతో అరగంటకోసారి ట్యాంక్‌లోని నీలను కదిలించాలి. నీలని కదిలించడం వల్ల స్పిరులినా ట్యాంక్లోని నీలతో కలిసి తొందగర పెరుగుతుంది. స్పిరులినా సాగు మొదలు పెట్టక 15 రోజులో తయారు అవుతుంది.
నీరు ఆకు పచ్చగా మారడంతో స్పిరులినా ఏర్పడింది అన్ని తెలుసుకోవచ్చు. ట్యాంక్ నీలను ఒక వస్త్రంతో వాడకట్టుకోవాలి. ఆ వస్త్రం ఫై
స్పిరులినా ఉండిపోతుంది. మిగిలిన నీలను ట్యాంకులోకి పోసుకోవాలి. వస్త్రం ఫై ఉన్న స్పిరులినాను మంచి నీలతో మళ్ళీ కడగాలి. వస్త్రంలో నుంచి నీళ్లు పోయాక, స్పిరులినాను నేరుగా తినవచ్చు, లేదా ఎండపెట్టుకొని పొడి చేసుకొని తినవచ్చు లేదా టాబ్లెట్స్ రూపంలో వాడుకోవచ్చు.
ఒక ట్యాంక్ 50 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండాలి. మొదటి సారి 3-5 లక్షలు పెట్టుబడి అవుతుంది. తర్వాత పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. మెయింటెనెన్స్ అవసరం లేదు. ప్రతి రోజూ స్పిరులినా తీసే పని తప్ప, తర్వాత పని ఉండదు. ఒక ట్యాంక్లో రోజు 30 కేజీలు స్పిరులినా వస్తుంది. ఎండిపోయాక 4 కేజీలు బరువు ఉంటుంది. ఒక కిలో ధర మార్కెట్లో 600 ఉంది. స్పిరులినా సాగులో ఒక నెలలో 70-80 వేలు లాభాలు వస్తాయి.
మనదేశంలో స్పిరులినా పొడితో టాబ్లెట్స్ తయారు చేసే కంపెనీలు చాల ఉన్నాయి. ఈ స్పిరులినా పొడిని చేపలు, రొయ్యలు, కోళ్ల ఆహారంగా ఉపయోగించడం వల్ల తొందరగా బరువు పెరుగుతాయి. వ్యాపారాలు ఆన్లైన్ ద్వారా స్పిరులినా పొడిని ఇతర దేశాలకి అముతున్నారు.
Also Read: Aeroponics Saffron Farming: మట్టి లేకుండా కుంకుమ పువ్వు సాగు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్