Plant Growth Regulators: ఏ చిన్న మొక్క పెరగడానికి హార్మోన్ల కావాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి తగిన మోతాదులో హార్మోన్ల ఉత్పత్తి అవసరం ఉంటుంది. అలాగే మొక్కలకి కూడా హార్మోన్ల అవసరం ఎంతో ఉంది. ఒక మిల్లీ గ్రాము హార్మోను పదార్థం ఒక లీటరు నీటిలో కలిపితే దానిని ఒక పి.పి.యం అంటారు. ఒక మిల్లీ లీటరు హార్మోను ద్రావణం ఒక లీటరు నీటిలో కలిపితే దానిని 1000 పి.పి.యం అంటారు.
1. శాఖీయోత్పత్తి: కాండపు మొక్కల నుండి వేర్లు బాగా పెరిగేలా చేస్తుంది. కాండం మొక్కల మొదళ్లను 12-24 గంటల వరకు 50-100 పి.పి.యం ద్రావణంలో ముంచి మొక్కలని నాటుకోవాలి. ద్రావణం తీవ్రతని బట్టి ద్రావణంలో ఉంచే సమయం మారుతుంది. ముంచిన తర్వాత పొడి రూపంలో ఉండే సెరడిక్స్, రూటోన్మొ వాడాలి. కాండం మొక్కలను మొదట నీటిలో హార్మోను పోడిలో ముంచి, విదిలించి, నేలలో నాటుకోవాలి.
2. గడ్డలు, దుంపలు మొలకెత్తకుండా చేయడం: నిలువచేసినప్పుడు బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, మొలకెత్తకుండా ఎం.హెచ్, టిఐబిఏ, న్ఏఏ హార్మోన్లు వాడవచ్చు. ఒక టన్నుకు 50-100 గ్రాముల రసాయనం అవసరమవుతుంది.
3. మొక్కలలో పూత, త్వరగా రావటానికి: పూత తక్కువగా లేదా పూత కాలంలో కృత్రిమంగా మొక్కలు పూతకు వచ్చేలా చేయటానికి తోడ్పడే హార్మోన్లు 2.4 డి,న్ఏఏ, సైకోసిల్. 10 పి.పి.యం న్ఏఏ ను 50 మిల్లీ లీటర్ల ద్రావణం మొక్క మొవ్వలో, ఆకుల దశలో పోసే మొక్కలన్నీ ఒకే సారి పూతకు వస్తాయి. అదే విధంగా 25 పి.పి.యం ఇథెరిల్ కూడా వాడవచ్చు.
3.పూత ఆలస్యంగా రావటానికి: ఎం.హెచ్ 100 పి.పి.యం ద్రావణం చల్లితే పూత ఆలస్యమవుతుంది.
Also Read: Plant Growth Hormones: మొక్కలో హార్మోన్ల ఉత్పత్తి వల్ల కలిగే లాభాలు ఏంటి.?
4. పూత, పిందె రాలుడం అరికట్టడం: మొక్కలలో హార్మోన్ల లోపంతో పూత పిందె రాలినట్లయితే, 5-10 పి.పి.యం 2,4 – డి , 10-20 పి.పి.యం న్ఏఏ లేదా 5-10 పి.పి.యం న్ఏఏ పిచికారీ చేయటం ద్వారా అరికట్ట వచ్చు. కొబ్బరి పిందెల రాలుట అరికట్టడానికి 30 పి.పి.యం 2,4 డి బాగా పనిచేస్తుంది.
5. గింజలు లేని పండ్ల ఉత్పత్తి: కొన్ని ఫలజాతులలో పరాగసంపర్కం లేకుండానే గింజల్లేని కాయలు అభివృద్ధి చెందుతాయి. అరటి, కొన్ని ద్రాక్ష, జామ రకాలు. మరి కొన్నింటిలో సహజంగా గింజలుండే కాయలే అయినప్పటికీ, హార్మోన్ల చల్లితే గింజల్లేని కాయలు పెరుగుతాయి. ముఖ్యంగా జిఏ 500-1000 పి.పి.యం ద్రావణం పిచికారీతో నిమ్మ, బత్తాయి, జామ, పంపర పనసలలో గింజలు లేని కాయలు వృద్ది అవును. నిమ్మ మీద 10 పి.పి.యం ఐఏఏ కూడా పనిచేస్తుంది.
6. పండ్లు పక్వానికి: దీని కోసం న్ఏఏ, 2,4,డి ,2,4,5-టి ఇథరిల్ వంటి రసాయనాలు వాడవచ్చు. దీని వలన పండ్లకు మంచి ఆకర్షనీయమైన పసుపు రంగు వస్తుంది.
7. పండ్ల నిలువకు నిలువ కాలం పెంచటానికి 2,4-డి , 2,4,5 – టి హార్మోన్లు వాడవచ్చు..
8. కలుపు మొక్కల నిర్మూలన: కలుపు మొక్కల నిర్మూలనకు 2,4-డి , ఎంసిపిఏ హార్మోనుల్నీ, వాటి లవణాలు, ఎస్టర్లు, ఎమైన్లు మొదలైన వాటిని వాడుతారు. ఇవి ద్విదళ జాతి మొక్కలపై బాగా పనిచేస్తాయి. 2, 4డి సోడియం లవణం కలుపు మొక్కలపై పిచికారీ చేసినప్పుడు మొక్క అంతర్భాగాల్లో ప్రవేశించి వివిధ జీవన క్రియలను ప్రభావితం చేసి, విషపూరితం చేస్తాయి.