Intercropping: అంతర పంటల ప్రాముఖ్యత రైతులకి తెలియడంతో ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా అంతర పంటలని సాగు చేస్తున్నారు. అంతర పంటల ద్వారా రైతులకి లాభాలు పెరుగుతాయి. ఈ పంటలో ఒక పంట ఇంకో పంటకి రక్షణ కలిగిస్తుంది. నేలకోత కూడా ఈ పంటల ద్వారా తగ్గుతుంది. ఒక పంటకలో ఉన్న పోషకాలు రెండో పంట కూడా వాడుకుంటుంది. అంతర పంటలో ఎరువుల వాడకం కూడా తగ్గుంది. ఈ పంటలో కలుపు కూడా ఎక్కువ రాదు. ఈ ప్రయోజనాలను చూసి జగిత్యాల జిల్లా, శ్రీ రాములపల్లి గ్రామంలో రైతు వెంకటేశ్వర్ రావు గారు రెండు సంవత్సరాలలో పూర్తి అయే అంతర పంటలని సాగు చేస్తున్నారు.
అంతర పంటలో ముఖ్యమైన పంటగా పసుపు పంట సాగు చేశారు. పసుపు పంటని జూన్ నెలలో 2021 సంవత్సరం మొదలు పెట్టి సెప్టెంబర్ నెలలో కోతలు కోశారు. పసుపు పంటలో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న పంటని కూడా సెప్టెంబర్ నెలలో కోతలు కోశారు.
Also Read: Polished vs Unpolished Rice: పురుగు పట్టని, పాలిష్ బియ్యాన్ని తింటున్నారా.? అయితే ఇది మీ కోసం.!
పసుపు పంట ద్వారా 1.6 లక్షలు ఆదాయం వచ్చింది. పెట్టుబడి తీసివేసాక లక్ష రూపాయలు లాభం వచ్చింది. మొక్కజొన్న పంటకి 15 వేల లాభాలు వచాయి. ఈ పంటల తర్వాత బొప్పాయి పంట మొదలు పెట్టారు. సంవత్సరం తర్వాత బొప్పాయి పండ్ల దిగుబడి వస్తున్నాయి. ఇంకో నెల రోజుల పూర్తి అయ్యాక ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తాయి.
బొప్పాయి పంటలో అంతర పంటగా అల్లం సాగు చేస్తున్నారు. అల్లం పంట కోతకి రావడానికి ఎనిమిది నుంచి తొమిది నెలల సమయం పడుతుంది. ఆ సమయం వరకు బొప్పాయి పండ్లు నుంచి మంచి ఆదాయం పొందుతారు. జూన్ నెల 2023 సంవత్సరం వరకు ఈ నాలుగు పంటలు పండించడం పూర్తి అవుతుంది. ఇలా అంతర పంటలు పండించడం ద్వారా రైతులు ఒక పంటలోని నష్టాలు ఇంకో పంటలోని లాభాలతో మంచి ఆదాయం చేసుకుంటారు.