వ్యవసాయ పంటలు

Safflower Crop Cultivation: కుసుమ పంట సాగు.!

1
Safflower crop
benefits od safflower Oil
Safflower Crop Cultivation: కుసుమ నల్ల రెగడి నెలల్లో వర్ష ధారం గా పండించే పంట.
నేల తయారీ :
ఖరీఫ్ లో స్వల్ప Sకాలిక అపరాల తర్వాత కుసుమను 2-3
సార్లు దున్నీ వేసుకోవచ్చు.రబిలో ఏక పంటగా వేసినప్పుడు
నాగలి తో గాని ట్రాక్టర్ తో గాని లోతుగా దున్నీ చదును చేసి
విత్తుకోవచ్చు.
 Safflower Crop Cultivation

Safflower Crop Cultivation

నేలలు:
నీరు నిల్వని బరువైన తేమను నిలుపుకునే నల్ల రెగడి లేదా
నీటి వసతి గల ఎర్ర నేలలు అనుకూలం.ఫ్యూజెరియం ఎండు
తెగులు అవకాశం ఉండడం వల్ల ఆమ్ల నేలలు పనికి రావు.
విత్తు సమయం
తెలంగాణ లో అయితే సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో
విత్తుకోవాలి.
కోస్తా లేదా రాయలసీమ లో అయితే అక్టోబర్ లో
విత్తుకోవాలి.
విత్తనం మరియు విత్తు పద్దతి
శుద్ధ పంటగా( pure crop )-4 కిలో / ఎకరానికి
అంతర పంటగా ( inter cropping ( -1.5 కిలో /ఎకరనికి.
  •  విత్తనాన్ని గొర్రు చళ్ళతో గాని నాగలి చాలుతోగాని విత్తుకోవచ్చు.
  •  విత్తనం 4-5 సేం. మీ లోతు కంటే ఎక్కువగా వేయకూడదు.
  • విత్తన లోతు బట్టి తేమ బట్టి 4-7 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది.
విత్తు దూరం:
45×20 సేం. మీ దూరంలో విత్తుకోవాలి.
విత్తన శుద్ది:
విత్తనం ద్వారా సంక్రమించే ఆల్టర్ నెరియా ఆకు మచ్చ
తెగులు, త్రప్పు తెగులు భూమిలో శిలీంద్రాల ద్వారా
వచ్చు ఎండు తెగులు అరికట్టుటకు కిలో విత్తనానికి 3
గ్రా థైరామ్ లేదా కెప్టెన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.
Dried Safflower

Dried Safflower

నీటి యాజమాన్యం: బరువైన నెలల్లో నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం
లేదు.తేలిక నెలల్లో 1-2 సార్లు నీటి తడులు
అవసరం.పూత దశ 65-75 రోజుల్లో వస్తుంది.కాండం
సాగు దశ, పూత దశ,నీటికి కీలక దశలు ఈ దశలో
నీరు పెడితే 40-60% దిగుబడి పెరిగే అవకాశం
ఎక్కువగా ఉంది.కుసుమ మొక్క మొలిచినప్పుడు
రోజేట్టి ఏర్పడే వరకు నీటి ఎద్దడి తట్టుకోలేదు.
ఎరువుల యాజమాన్యం:
వర్ష ధారపు పంట – ఎకరాకు 16 కిలోల నత్రజని,10
కిలోల భాస్వరం,విత్తనం తో పాటు దుక్కిలో వేయాలి.
భాస్వరం ఎస్. ఎస్. పి రూపంలో ఇస్తే గంధకం వల్ల
నూనె శతం పెరుగుతుంది.జీవన ఎరువులైన
అజోస్పైరిల్లం 25 గ్రా.కిలో విత్తనానికి పట్టిస్తే ఎకరాకు 8
కిలోల వరకు నత్రజని ఆదా చేసుకోవచ్చు.
కలుపు నివారణ మరియు అంతర కృషి
విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా
చూసుకోవాలి.విత్తిన 25 రోజుల లోపు మరియు 40-
50 రోజుల లోపు దంతెల తో అంతర కృషి చేసుకోవాలి.
అల్లాక్లోర్ 50% లేదా పెండిమీథాలీన్ 30% ఎకరాకు
లీటర్ చొప్పున విత్తుకోవాలి.
benefits od safflower Oil

Benefits of Safflower Oil

పంట కోత:
రకాన్ని బట్టి విత్తిన 115-130 రోజుల్లో కోతకు
వస్తుంది.ఆకులు పసుపు రంగుకు మారి పువ్వులు
గోధుమ రంగుకు మారి పంట కోత తయారు అయినట్లు
కనిపిస్తుంది.ఉదయం పూట పంట కొస్తే గింజలు రాలుట
తగ్గును.ముళ్ళు మెత్తగా ఉండును.మొక్కలను నేల
మట్టం వరకు కోసి అరబెట్టి కల్లంపై గింజలను కట్టెలతో
లేదా ట్రాక్టర్ తో కాని తొక్కించి గింజలను వేరు చేయాలి.
అంతర పంటలు.
గోధుమ + కుసుమ -3:1/2:1
శెనగ + కుసుమ -3:1/2:1
Leave Your Comments

Vitamin A Deficiency: విటమిన్ A లోపం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు.!

Previous article

Maize(Corn) Products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!

Next article

You may also like