SRI Method of Paddy Cultivation: వరి పంట సాగు పద్ధతులు చాలానే ఉన్నాయి. కానీ రైతులు వరి పంట పండించడానికి ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ నీటితో అధిక దిగుబడులు రావడం కోసం రైతులు వరి పంటని శ్రీ పద్దతిలో సాగు చేస్తున్నారు. శ్రీ వరి సాగు పద్ధతి 1980లో “మడగాస్కర్” దేశంలో రూపొందించ బడింది. ఈ రకం వరి సాగు ఇపుడిపుడే ప్రాధాన్యత వస్తుంది. ఈ పద్ధతిలో లోతుకు చొచ్చుకు పోయి భూమి లోపల పొరల నుండి పోషక పదార్ధాలను తీసుకోగలుగుతాయి. వరి బాగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వాలంటే పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలను రైతులు అనుకుంటారు. కానీ వరి నీటిలో బ్రతక గలదు గాని నీటి మొక్క కాదు.
వరి పూత దశకు వచ్చేటప్పటికి 70 శాతం వేర్లు ముదిరి, కొసలు నుంచి పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి. శ్రీ పద్ధతి వరి పొలంలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. కనుక మామూలు పధ్ధతిలో వాడే నీటిలో 1/3 నుండి 2 శాతం నీరు సరిపోతుంది.
1. లేత నారు నాటడం: 8-12 రోజుల వయసు గల రెండు ఆకుల నారును మాత్రమే నాటాలి. దీనివలన అధిక సంఖ్యలో పిలకలు వస్తాయి.
2. జాగ్రత్తగా నాటడం: నారు మడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పై పైన నొక్కి పెట్టాలి, లోతుగా నాటకూడదు. దీనివలన పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురి కాకుండా బ్రతికి త్వరగా పెరిగి అధికంగా పిలకలు వస్తాయి.
3. దూరంగా నాటడం: మొక్కకు మొక్కకు మధ్య , సళ్ళుకు సళ్ళకు మధ్య 25 సెం.మీ దూరం ఉండేల నాటుకోవాలి. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో ఇంకా ఎక్కువ దూరంలో నాటుకోవచ్చు.
Also Read: Pulses Cultivation: పప్పు ధాన్యాలు ఇలా సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది..
4. కలుపు నివారణ: పొలంలో నీరు నిలబడకుండా చూసి, కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు రోటరీ/కోనో వీడర్తో, నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మూడు సార్లు. నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా కలియ బెట్టడం వలన ప్రతిసారీ సుమారు హెక్టారుకు ఒక టన్ను పచ్చి రొట్ట భూమికి చేరి సేంద్రియ ఎరువుగా పని చేస్తుంది. రోటరీ / కోనో వీడరు వాడడం వల్ల నేలను కదుపుతూ ఉండడం వల్ల మొక్కకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. దాంతో సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది నత్రజనిని విదుదల చేస్తాయి.
5. నీటి యాజమాన్యం: పొలం తడిగా ఉండాలి కానీ నీరు నిలవ ఉండకూడదు. మధ్య మధ్య పొలం ఆరితే నీరు పెడుతుండాలి. దాంతో మొక్కలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.
6. సేంద్రియ ఎరువులు: సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసారం పెంచాలి. ప్రస్తుత పరిస్థితులలో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తొలి దశలో వాడవచ్చు. కానీ మొక్క పెరిగేకొద్దీ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుతూ రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకుంటూ పోవాలి.
శ్రీ పద్దతి సాగులో మొక్కకు 50-100 వరకు బలమైన పిలకలు వచ్చి అన్ని పిలకల నుండి బలమైన మొక్కలుగా వస్తాయి. ఒక్కొక్క వెన్నులో 400 గింజలు వరకూ ఉంటాయి. ఈ పద్దతిలో వరి సాగు చేయడం వల్ల ఒక ఎకరంలో 25 క్వింటాల వరకు దిగుబడి పొందవచ్చు. రైతులు ఈ పద్దతిని పాటించి వరి పంట సాగుతో మంచి లాభాలు పొందవచ్చు.
Also Read: PM Kisan 14th Installment Release Date: తొందరలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల..