Cardamom Cultivation: భారతదేశం మసాలా దినుసులు పండించడంలో మంచి ప్రావిణ్యం కలిగి ఉంది. మన దేశంలో పండించే మసాలా దినుసులు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. ఈ మసాలా దినుసులో యాలకుల కూడా ఒకటి. యాలకులు మసాలా దినుసులుగా మాత్రమే కాదు వాటిని ఔషధాల గుణాలు కూడా ఉన్నాయి.
వీటిలో ఉన్న ఔషధ గులని వల్ల వీటిని ఆయుర్వేద వైద్యంలో వాడుతారు. యాలకులు వాడటం ద్వారా శ్వాస , దగ్గు , దురద, మూత్రపిండములో రాళ్ళు , గనేరియా వ్యాధులు తగ్గించడానికి వాడుతారు. స్వీట్లల తయారీలో యాలకులను వాడితే మంచి సువాసన వస్తుంది.
Also Read: Bamboo Crafts: కొత్త పథకం ద్వారా మహిళలకి ఉపాధి..
యాలకులు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా మొత్తంలో సాగు చేస్తారు. సముద్రపు మట్టికి 600 నుంచి 1500 మీటర్ల ఎత్తులో యాలకులు సాగు మంచిగా ఉంటుంది. తేమ , నీటి పారుదల ఉన్న మట్టి యాలకుల సాగుకి మంచిది. ఇసుక లోమ్ నేలలు, ఎర్రమట్టి నేలలు యాలకుల సాగుకు అత్యంత అనుకూలమైనది. నేల pH 5 నుండి 7.5 వరకు ఉండాలి.
యాలకుల మొక్కను రెండు విధాలుగా పెంచుకోవచ్చు. యాలకులను విత్తనాలుగా లేదా మొక్కల నుండి కూడా పెంచుకోవచ్చు. దానికి మంచి నాణ్యమైన విత్తనం ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది. యాలకుల నర్సరీలో కూడా పెంచుకోవచ్చు. విత్తనాలను 10 సెంటీ మీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తనాలు విత్తే ముందు వాటిని శుభ్రం చేసుకోవాలి. ఒక హెక్టారు భూమికి 1.25 కిలోల విత్తనాలు అవసరం అవుతుంది. యాలకుల మొక్కలను వర్షాకాలంలో పెంచడం మొదలు పెట్టాలి. వర్షాకాలంలో మొక్కలు నాటితే మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలు పండించడం వల్ల మంచి దిగుబడితో పాటు లాభాలు కూడా వస్తాయి.
Also Read: Bull Driven Oil Business: ఎద్దు గానుగల ద్వారా రైతులకి మంచి లాభాలు…