Grafting in Brinjal: జులై నెల మొదటి నుంచి కూరగాయాల ధరలు 50 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. కూరగాయాలు సాగు చేసిన రైతులకి మంచి ఆదాయం వస్తుంది. ఉత్తర భారతదేశంలో ప్రస్థితం ఎక్కువ వర్షాలు రావడం వల్ల రానున్న రోజులో వీటి ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీని ఆధారంగా దక్షిణ భారతదేశ రైతులు ఈ సంవత్సరం ఎక్కువగా కూరగాయాల సాగు చేస్తున్నారు. బాపట్ల జిల్లా, చిన్నకొత్తపల్లి గ్రామంలో శ్రీనివాస్ అనే రైతు ఎక్కువ కాలం దిగుబడి వచ్చేలా అంటుకట్టు విధానం ద్వారా వంకాయలని సాగు చేస్తున్నారు.
ఈ అంటుకట్టు విధానంలో ఒక ఎకరంలో వంకాయ మొక్కలు నాటుకున్నారు. ఈ మొక్కలు నాటిన మూడు నెలలో దిగుబడి రావడం ప్రారంభం అవుతుంది. వంకాయ మొక్కలని పందిరిల పెంచడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక ఎకరంలో దాదాపు 2600 మొక్కలు నాటుకున్నారు. ఒక మొక్క ఖరీదు 8 రూపాయలుగా మార్కెట్లో అమ్ముతున్నారు.
Also Read: Amruth pattern Cotton Farming: ఈ పద్దతిలో పత్తి సాగు చేస్తే ఒక ఎకరంలో 20 క్వింటాల దిగుబడి వస్తుంది….
మొక్కల ఒక మీటర్ దూరంలో నాటారు. అంటుకట్టి, పందిరి పద్దతిలో వంకాయలు సాగు చేస్తే రెండు సంవత్సరాల వరకు ప్రతి రోజు దిగుబడి వస్తుంది. ఈ మొక్కలకి డ్రిప్ పద్దతిలో నీటిని అందించడం వల్ల రైతులకి నీళ్లు వృధా జరగదు. సాధారణ వంకాయలు ఒక బుతువులో 2-3 కిలోల దిగుబడి వస్తే, అంటుకట్టు విధానంలో ఒక బుతువులో 7-8 కిలోల దిగుబడి వస్తుంది.
వంకాయ మొక్కలు సేంద్రియ పద్దతిలో సాగు చేయడం ద్వారా ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వంకాయల ధర కూడా పెరగంతో రైతులు కిలో 70-80 రూపాయలకి అమ్ముతున్నారు. అంటుకట్టు విధానంలో దిగుబడి ఎక్కువగా రావడం దానికి తోడుగా మార్కెట్లో మంచి ధరలు ఉండటం రైతులకి మంచి ఆదాయాన్ని ఇస్తుంది.
Also Read: Barahi Dates: ఈ ఖర్జూర ధర ఒక క్వింటాల్ లక్ష రూపాయలు.!