Stylo (Stylosanthes guianensis): మన ఇరు రాష్ట్రాల్లో 70% జనాభా యొక్క జీవనాధారం. వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులు వర్షాధారంగా ఉండే పంటల సాగును చేపడుతున్నారు. ఒక్క ఆహార పంటల సాగుపై కాకుండా పాడి పశువుల పోషణ పాల ఉత్పత్తి, మేకలు, గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ నేపద్యంలో చౌకగా లభ్యమయ్యే పశుగ్రాస పంటలను ఎంచుకొని సాగుచేస్తున్నారు. పశువులకు మేతగా ఉపయోగించే పంటలలో ధాన్యపు జాతి, గడ్డి జాతి మరియు పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి, సంవత్సరం లోపు పూర్తి చేసుకునే పంటలను ఏకవార్షికాలని, సంవత్సరము కంటే ఎక్కువ పంటకాలమున్న పంటలను బహువార్షికాలని అంటారు.
తక్కువ వర్షపాతం తో కూడా పెరుగుతాయి
స్టైలో లో ఏకవార్షికాలు మరియు బహువార్షికాలు ఉన్నాయి. నిటారుగా ఉండే పశువుల మేతగా, పచ్చిక బయళ్లులో పెంచినపుడు ప్రాకే స్వభావాన్ని సంతరించుకొని కాండాలు గరుకుగా ఉండి, నూగును కలిగి ఉంటాయి. కాండాలు వయసు పెరిగే కొద్దీ గట్టిగా మారతాయి. ఆకు త్రి దళాలుగా ఉండి సన్నగా, పొడవుగా ఉంటాయి. పూలు గుత్తులు గుత్తులుగా నారింజ రంగులో ఉంటాయి. విత్తనాలు పసుపుతో కూడిన ముదురు గోధుమ రంగును కలిగి ఉంటాయి. స్టైలో పంట దక్షిణ ఆఫ్రికా ఖండం ప్రాంతానికి చెందినది. ఇవి చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం తో కూడా పెరుగుతాయి.
Also Read: Best Farmer Award: జమ్మికుంట రైతుకు బెస్ట్ ఫార్మర్ అవార్డు
వర్షాభావ పరిస్థితులను బాగా తట్టుకునే స్వభావం ఉండదు. అంత ఎక్కువ సారవంతం గాని నేలలో కూడా బాగా పెరుగుతాయి. మిశ్రమ పంటగా దీన్ని సాగు చేయవచ్చు. స్టైలో పంటలో మూడు రకాల జాతులు ఉన్నాయి.స్టైలో జాంధస్ స్కాబ్రా: ఇది నిట్టనిలువుగా పెరిగే మొక్క, లేత ఆకుపచ్చ ఆకులు వెడల్పుగా ఉండి, నూగును కలిగి ఉంటాయి. దీనిని అంతర పంటగా వేయడానికి ఉపయోగించవచ్చు.స్టైలో బాంధస్ హమాటా: ఈహమాటా జాతి ప్రాకే స్వభావాన్ని ఉంటుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ వర్ణం గా సన్నగా ఉండి త్రి దళాలు ఉంటాయి. ఇవి వర్షాభావాన్ని తట్టుకుంటుంది. స్టైలో జాంధస్ హ్యుమాలీస్ : ఇది చాలా తక్కువగా నిలువుగా పెరిగే వార్షికం, సన్నగా పీచుతో నిండిన కాండాలను కలిగి ఉంటుంది. ఆకులు సన్నగా పొడవుగా ఉండి చివర ముక్కుతో నూగు లేకుండా ఉంటాయి.
సాగు వివరాలు ఇలా :
వర్షాధారంగా జూన్-జూలై, సెప్టెంబర్ అక్టోబర్ నీటి వసతితో సంవత్సరం పొడుగున్న అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల నేలల్లో దీన్ని సాగు చేసుకోవచ్చు. పొలాన్ని 2-3 సార్లు దుక్కి తరువాత బాగా దున్ని, 10 లేక 20 చదరపు మీటర్ల మళ్ళను తయారు చేసుకోవాలి. హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 60 కిలోల బాస్వరం 15 కిలోల పొటాష్, 25 కిలోల మ్యూరేజ్ ఆఫ్ పోటాస్ మిశ్రమాన్ని చివరి దుక్కిలో వేసి దున్ని చదును చేయాలి
విత్తనాలు మరియు విత్తుట:
6 కి/హె. వరసలలో విత్తుటకు, 10 కి /హె పొలంలో వెదజల్లుటకు, 30 x 15 సెం.మీ విత్తన శుద్ధి స్టైలో విత్తనాలపై పొర చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి విత్తనాలను విత్తే ముందుగా 80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లని నీటిలో నానబెట్టాలి. విత్తు పధ్ధతి విత్తనాలను 1 సెం.మీ లోతులో మాత్రమే విత్తుకోవాలి. లోతుగా పెట్టినట్లయితే మొలకలు తక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. నీటి ఆధారంగా పండించే పంటలలో విత్తిన 25వ రోజున కలుపును తీయాలి. వర్షాధారంగా పండించే పంటకు విత్తిన వెంటనే 3వ రోజున వీటిని అందించాలి, తరువాత అవసరాన్ని బట్టి 7-10 రోజులకు ఒకసారి చొప్పున నీటిని ఇవ్వాలి. మొదటి కోత విత్తిన 75 రోజులు తరువాత తదుపరి కోతలు పంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి.
Also Read: PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.12000 అందాయా?