Saffron Flowers: కుసుమ పంట తక్కువ నీటి వనరులను ఉపయోగించుకుంటుంది. ఈ పంటను పొడిబారిన నేలల్లో కూడా సాగు చేయవచ్చు. ప్రపంచంలో 60 కంటే ఎక్కువ దేశాల్లో కుసుమ పంటను సాగు చేస్తునారు. సాదారణంగా ఈ పంటను కుసుమ గింజల కొరకు పండిస్తున్నారు. అయితే గింజలతో పోలిస్తే పువ్వుల నుండి అధిక రాబడిని సాధించవచ్చు. ఒక కిలో కుసుమ గింజల ధర రూ.55/`లు ఉండగా, ఒక కిలో కుసుమ పువ్వుల ధర రూ.1500/` నుండి 3000/` వరకు ఉంది. కుసుమను ఎకపంటగానే కాకుండా శనగ, తెల్లజొన్న పంటలల్లో అంతరపంటగా సాగు చేయవచ్చును. చైనాలో కుసుమ పంటను కేవలం పువ్వుల కొరకే సాగుబడి చేసి అనేక రోగాల కొరకు ‘టానిక్ టీ’ గా విక్రయిస్తున్నారు.
Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!
కుసుమ పువ్వులను ప్రాచీన కాలంలో రంగు కొరకు ఉపయోగించేవారు. కుసుమ రంగును ఇటలీ, ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వారు ఆహార పదార్ధాలలో రుచి కొరకు, సహజమైన ఆహారపు రంగుగాను వినియోగించేవారు. బ్రెజిల్ మరియు పోర్ట్యుగల్‌లో కుసుమ పువ్వు రెక్కల పొడిని బస్టార్డ్ సాఫ్రాన్‌గా పిలుస్తూ, విక్రయాలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్పైసస్‌గా పిలువబడే కుంకుమ పువ్వును ప్రత్యామ్నాయంగా కుసుమ పువ్వులను ఉపయోగించవచ్చు.
కుసుమ పువ్వులలో ఉండే కర్‌తామిన్ రెంజ్ పిగ్మెంట్ మరియు ఎరువు పిగ్మెంట్ నుండి సహసిద్ధమైన రంగును ఉత్పత్తి చేయవచ్చు. కుసుమ పువ్వుల నుండి ఎరుపు, పసుపు పచ్చ మరియు ఆరెంజ్ రంగులను తయారు చేయవచ్చు. ప్రపంచ ఆరోగ్యం సంస్ధ (ఔనూ) ఇప్పటికే ఆహారంలో కృత్రిమ రంగు వాడాకాన్ని నిషేధించింది. ఈ తరహాలో చూసినట్లైతే కుసుమ పువ్వుల నుండి సేకరించిన సహజమైన రంగును కృత్రిమ రంగుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. దీనికి మార్కెట్లో మంచి విలువ ఉంది. కుసుమ రంగును బ్రెడ్, కేక్, బిస్కెట్, వెన్నె, ఐస్‌క్రీమ్, జిలేబి, బిర్యాని, సూప్, సాస్, పచ్చడలు, పండ్ల రసాలు, సలాడ్ మొదలగు ఆహార పదార్థాలలో ఆహారపు రంగుగా ఉపయోగించడం వలన ఇవి కంటికి ఇంపుగా కనిపించడమే కాకుండా, చక్కటి రుచిని, విలువైన బయోయాక్టీవ్ ఆహార పోషకాలు ఎన్నో అందిస్తాయి, కాబట్టి ఆరోగ్య నిబద్ధతను కలిగి ఉన్న వారు కుసుమ రంగును ఆహారపు రంగుగా వాడవచ్చు.
కుసుమ పువ్వులను ఆహార పరిశ్రమలో మాత్రమే కాకుండ సౌంధర్య సాధన పరిశ్రమలో షాంపు, టాయిలెట్ సబ్బు, పరిమళ ధ్రావ్యాలు, బాడి లోషన్, పేసే క్రీమ్‌ల తయారీలలోను ఉపయోగించవచ్చు. వస్త్ర పరిశ్రమలో కుసుమ పువ్వుల నుండి సేకరించిన సహజరంగును బట్టలపై ప్రింటింగ్, పేయింటింగ్‌్, టై Ê డై, బతిక్‌ల కొరకు వినియోగించవచ్చు.
ఔషద లాభాలు:
కుసుమ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, వీటిని గుండె సంబందిత వ్యాధులకు, వాపు సంబందిత వ్యాధులకు, మధుమేహం, రక్తపోటు, స్పాండిలోసిస్ వంటి వ్యాధులకు వినియోగింవచ్చు. కుసుమ పువ్వుల డికాషన్ (టీ)ను తీసుకోవడం వలన పురుషులలో వ్యంధ్యత్వ సమస్యను, స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు, సంతానలేమి వంటి సమస్యలను తొలగిస్తుందని ఎన్నో అధ్యాయానాల్లో శాస్త్రవేత్తలు వెల్లడిరచారు.
నెలసరి ఆలస్యంగా వచ్చేవారు, నొప్పితో కూడిన నెలసరి కలవారు, ఒక చెంచ కుసుమ పువ్వు రెక్కలను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా వారి భాద నుండి ఉపశమనం పొందవచ్చు. వైధ్యరంగంలో కుసుమ పువ్వులను ల్యాక్సెటివ్, సెడటీవ్, కొలెస్ట్రాల్ వ్యతిరేక కారకం గాను వినియోగిస్తున్నారు.
ఎండిన కుసుమ పువ్వు రెక్కలను ‘టీ’ గా త్రాగే అలవాటు ఇప్పటికే చాలా దేశాలలో ఉంది. మన దేశంలో కూడా వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో టీని విక్రయిస్తున్నారు. అయితే కుసుమ చెట్లకు ముళ్ళు ఉండడం వలన పువ్వులను సేకరించడం చాలా కష్టతరమైన పని దీని కొరకు వెస్టర్న్ యూరోప్, జపాన్, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో ముళ్ళులేని కుసుమలను సాగుబడి చేస్తున్నారు. కుసుమ పంటను పువ్వుల కొరకు సాగుబడి చేయాలనుకునే వారు ఈ ముళ్ళులు లేని వంగడంలను సాగు చేయడం ఉత్తమం.
కుసుమ చెట్ల నుండి పువ్వు రెక్కలను సేకరించడం వలన గింజలకు ఏలాంటి నష్టం ఉండదు. కాబట్టి కుసుమలను సాగుబడి చేసే రైతులు గింజల నుండి మరియు పువ్వుల నుండి అధిక ఆదాయం పొందవచ్చు.
గమనిక:
` కుసుమ పువ్వులను గర్భంతో ఉన్న స్త్రీలు తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వలన గర్భస్రావం అవుతుంది.
` కుసుమ పువ్వులను మరియు గింజలకు రక్తాన్ని పలుచపరిచే వ్యక్తిత్వం ఉండడం వలన, శస్త్రచికిత్సలు చేయించుకోవాలి అని అనుకొనేవారు వీటికి దూరంగా ఉండడం మంచిది.
యం. హేమలత, గృహ విజ్ఞాన శాస్తవేత్త డిడియస్ కెవికె
Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం