High Income for Farmers: మారుతున్న వ్యవసాయరంగంలో కొన్ని పాత విధానాలు, పద్ధతులు అంతగా ఇమడలేకపోతున్నాయి. ఉద్యానపంటలు, పూలతోటలు, పాడిపశువుల పోషణ రోజురోజుకు విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా పశుపోషణ, డెయిరీ రంగాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటికి వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులతో పాటు మార్కెటింగ్, ప్రాసెసింగ్ కోసం వివిధ రకాల సహకారం అవసరం. లేదంటే ధరల్లో హెచ్చుతగ్గులు తప్పవు.
సుస్థిర వ్యవసాయ దిశ: దేశంలో దాదాపు 80 శాతానికి పైగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వీరికి పంటల బీమా, మార్కెటింగ్ సదుపాయాలు, మద్దతు ధరలు, రాయి తీల వంటి విషయాల్లో సరైన సహకారం అందడం లేదు. అనేక సంవత్సరా లుగా భూమి, నీరు వంటి సహజ వనరులను నిర్లక్ష్యం చేశాం. దీనివల్ల వాటిపై ఒత్తిడి పెరిగి, పంట దిగుబడులు పూర్తిగా పడిపోతున్నాయి. మనం అనుసరిస్తున్న నూతన విధానాలు సహజ వనరులను తక్కువ వినియోగిం చుకుంటూ.. వాతావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఉండాలి. నూతన పరిజ్ఞానం, పద్ధతులు, రకాల అభివృద్ధిపైన దృష్టి సారించాలి. వ్యవసాయంలో రైతులు సుస్థిరాభివృద్ధి సాధించాలంటే అస్థిరమైన రుతుపవనాలు, మార్కెట్ సమస్యలను ఎదుర్కొనేలా సంస్థాగతమైన విధానాలను రూపొందించాలి. విశ్వవిద్యాలయాల్లో, విస్తరణ కార్యక్రమాల్లో, సహకార సంఘాల్లో చిన్న, సన్న కారు రైతులను నిర్లక్ష్యం చేయకుండా కృషిచేస్తేనే వ్యవసాయంలో సుస్థిరాభి వృద్ధి సాధ్యమవుతుంది. తాత్కాలికంగా వచ్చే సంక్షోభాలను తట్టుకొని కరవు పరిస్థితుల్లో కూడా రైతులు ఆదాయాన్ని గడించేలా విధానాలు ఉండాలి.
Also Read: Farmers Income: దిగ్భ్రాంతికి గురి చేస్తున్న రైతుల ఆదాయ పరిస్థితి
ప్రణాళికావేత్తల నిర్లక్ష్యం: దేశ వ్యవసాయరంగంలో కావాల్సినంత మానవ, సాంకేతిక వనరులున్నాయి. అయితే ప్రణాళికా వేత్తలు దీన్ని వ్యాపార అవకాశాలుగా మార్చడంలో నిర్లక్ష్యం చేశారు. రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి సేద్యానికి కేటాయింపులు తగ్గి చారు. పట్టణ నిరుపేదలకు చౌకగా ఆహారధాన్యాలను పంపిణీచేసే వనరు గానే వ్యవసాయరంగాన్ని చూశారు. దీనితోనే ప్రజాపంపిణీ వ్యవస్థ వచ్చింది. ఆహారధాన్యాల సేకరణ, ధరల విధానంతో రైతులు తాము పండించిన ధాన్యం రవాణాలో ఆంక్షలు విధించారు. మారుతున్న పరిస్థితులకు అనుగు ణంగా ప్రభుత్వాల తీరు మారకపోవడంతో వ్యవసాయరంగంలో ఎన్నో సమ – స్యలు తలెత్తుతున్నాయి.
అధిక ఉత్పత్తి ఖర్చులు: సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలో సరైన పరిశోధన, అభివృద్ధి లేకపోవడం.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పరచ కపోవడం. వ్యవసాయ విస్తరణ వ్యవస్థ పూర్తిగా విఫలమవ్వడం.ఎరువులపైన రాయితీ అసంబద్ధంగా ఉండటం.కాంప్లెక్సు ఎరువులు, పురుగుమందుల ధరల విధానంపై నియంత్రణ లేక పోవడం.విచక్షణారహితంగా పురుగుమందులు, ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం.పంట ఉత్పాదకతలు తక్కువగా ఉండటం.. రైతుకొచ్చే వాటా స్వల్పం: వినియోగదారుడు చెల్లించే దానిలో రైతులకు వచ్చేది చాలా తక్కువగాఉంటుంది. సింహభాగం దళారులకే వెళుతోంది.
దీనికి కారణాలు: రైతు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం. రైతు మార్కెట్లు లేకపోవడం.మార్కెట్ యార్డుల్లో నిల్వ సదుపాయాలు లేకపోవడం. సరైన సారధ్యం, అవగాహన లేమితో సహకార సంఘాలు విఫలమ య్యాయి.
సూచనలు: ఉత్పత్తి ఖర్చు తగ్గించి, ఉత్పాదకతను పెంచాలి. పెట్టుబడులు తగ్గించాలి. వ్యవసాయం సుస్థిరంగా, ఆచరణీయంగా, అనుకూలంగా ఉండాలి. ఈ దశలో పరిశోధనలు ఎక్కువగా జరగాలి.రైతుల్లో సమగ్ర సస్యరక్షణ (ఐ.పి.ఎం.) సమగ్ర పోషక యాజమాన్యంలో (ఐ.ఎన్.ఎం.) అవగాహన కల్పించేందుకు పెద్దపీట వేయాలి. పోలియో నిర్మూలనలో చేస్తున్నట్లుగా ప్రభుత్వం తీవ్రస్థాయిలో దీనిపై ప్రచారం చేయాలి.రైతులకు అవరమయ్యే విషయాలపైన ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపట్టి వారు ఆచరించేలా ఒప్పించాలి.పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలు తమ ఇష్టానుసారంగా కాకుండా స్థానిక సమస్యల ప్రాతిపదికన పరిశోధనలు నిర్వహించాలి. ప్రభుత్వం యూరియా పైన రాయితీ తగ్గించాలి. లేదంటే దాని వాడకం.విపరీతంగా పెరిగి వాతావరణ, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. * హానికర పురుగుమందులపైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అధిక పన్నులు విధించి వీటి ఉత్పత్తి తగ్గేవిధంగా కట్టడి చేయాలి. అత్యవసర పరిస్థితుల్లోనే రైతులు వీటిని వాడేలా చూడాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో చదువులు కేవలం పట్టాల కోసమే కాకుండా స్వల్పకాలిక స్వయం ఉపాధి పరిశ్రమలు నిర్వహించుకునేందుకు వీలుగా విద్యాప్రణాళిక ఉండాలి.వ్యవసాయంలో సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం తెలిసేవిధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థి తుల్లో ఇది చాలా ముఖ్యం. ఉదాహరణకు వరిసాగు తీసుకుంటే… రైతులు ఎకరాకు 25-30 కిలోల విత్తనంతో పెంచిన నారు వాడుతున్నారు.
Also Read: Farmers Income: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు.!
Also Watch: