Yellow Chilli: మనం రోజు చూసే మిర్చి రంగు ఆకుపచ్చగా లేదా ఎరుపు రంగులో ఉంటుంది. పచ్చిమిర్చి రంగు ఆకుపచ్చగా, ఎండుమిర్చి రంగు అరుపురంగులో ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా పసుపు రంగులో మిరప కాయలు లేదా మిరప పండును చూశారా. ఇప్పుడు కొత్తగా పసుపు రంగులో కూడా మిర్చిని సాగు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తిప్పారెడ్డిగూడెంలోని ఉపేందర్ రైతు ఈ పసుపు రంగులో ఉండే మిర్చిని సాగు చేస్తున్నారు.
ఈ రైతు గత రెండు సంవత్సరాలుగా పసుపు రంగు మిర్చిని సాగు చేస్తున్నారు. పసుపు రంగు మిర్చి మొక్కలు ఖరీదు కొంచం ఎక్కువ ఉంటుంది. సాధారణ మిర్చి ఒక మొక్క రెండు రూపాయలు ఉంటే. ఈ పసుపు మిర్చి ఒక మొక్క నాలుగు రూపాయలు ఉంటుంది. మొక్క ఖరీదు ఎక్కువ ఉన్న, పండించిన పంట ధర కూడా అలానే ఉండటంతో రైతులు ఈ మిర్చి పండించడానికి ఇష్టపడుతున్నారు.
Also Read: Onion Price Rise: నాలుగు రోజులుగా పెరుగుతున్న ఉల్లిపాయ ధర..
ఉపేందర్ రైతు గారు ఒక ఎకరంలో పసుపు మిర్చి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర 70 వేలు ఉంది. దీనితో రైతులు పండించిన పంటకి మంచి లాభాలు పొందుతున్నారు. ఈ పసుపు మిర్చి పంట ఏ కాలంలో అయిన పండించుకోవచ్చు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే ఇంకా మంచి దిగుబడి వస్తుంది.
ఒక ఎకరం పొలంలో 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలో పసుపు మిర్చికి ఒక క్వింటాకు 1.25 లక్షలు దార వచ్చింది. ఈ మిర్చిలో ఔషధ గుణా లు ఎక్కువ ఉండటంతో ప్రజలు, వ్యాపారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
ప్రస్తుతం ఈ మిర్చి ధర తగ్గడంతో పండించిన పంటని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి దాచిపెట్టాడు.ఈ పంట సాగు కూడా సాధారణ మిర్చిలనే ఉంటుంది. ఈ పసుపు మిర్చికి మంచి ధర, ఎక్కువ దిగుబడి రావడంతో ఇతర ప్రాంతాల రైతులు కూడా ఈ పంటని పండించడానికి ఇష్టపడుతున్నారు.
Also Read: Brush Cutter: బ్రష్ కట్టర్ రైతులు ఎలా వాడుకోవాలి..?