Amruth pattern Cotton Farming: రైతులు పత్తి విత్తనాలు నాటుకొని కలుపు తీసే దశలో ఉన్నారు. ఇంకా కొంత మంది రైతులు వారి ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటికి సరిగా పడకపోవడంతో పత్తి మొక్కలకి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిని అందించినా మొక్కల పెరుగుదల కూడా తక్కువగా ఉంది. ఇలాంటి వాతావరణంలో కూడా ఆదిలాబాద్ జిల్లా, కొల్హారి గ్రామంలో విజయ్ అనే రైతు పత్తి పండిస్తూ ఎక్కువ దిగుబడిని పొందుతున్నారు.
పత్తి సాగు రైతు విజయ్ గారు అమృత్ పద్దతిలో సాగు చేస్తున్నారు. ఈ అమృత్ పద్దతిలో మొక్కల మధ్య దూరం పెంచుతారు. సాధారణ పంటలు కంటే ఈ పద్దతిలో సాగు చేసే మొక్కల మధ్య దూరం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పద్దతిలో సాగు చేసే పంటలకు దిగుబడి ఎక్కువగా వస్తుంది.
Also Read: Barahi Dates: ఈ ఖర్జూర ధర ఒక క్వింటాల్ లక్ష రూపాయలు.!
రైతు విజయ్ గారు పత్తి పంటకి మొక్కల మధ్య ఒక ఫీట్ దూరంలో విత్తనాలు విత్తుకున్నారు. వరుసల మధ్య 6 ఫీట్ల దూరం ఉంటుంది. ఇంత దూరంలో విత్తనాలు విత్తుకోవడం ద్వారా మొక్కలకి గాలి, వెలుతురు మంచిగా వెళ్తుంది. దాని వల్ల మొక్కల పెరుగుదల కూడా బాగుంది. కొమ్మలు కూడా విస్తారంగా పెరగడం వల్ల పత్తి కాయలు ఎక్కువగా వస్తాయి.
ఒక ఎకరంలో పత్తి అమృత్ పద్దతిలో విత్తుకుంటే దాదాపు 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. గత సంవత్సరం ఈ రైతు అమృత్ పద్దతిలో పత్తి సాగు చేస్తే 19.20 క్వింటాల దిగుబడి వచ్చింది. ఈ అమృత్ విధానంలో గాలి, వెలుతురు బాగా రావడంతో చీడపీడల బాధ కూడా తగ్గుతుంది. పత్తి మొక్కలకి ఎక్కువ కొమ్మలు వస్తాయి. కొమ్మల మధ్య మూడు ఇంచులు దూరమే ఉంటుంది. అందువల్ల దిగుబడి కూడా పెరుగుతుంది.
పత్తి ధర 2021తో పోలిస్తే 2022లో తగ్గింది. 2022 సంవత్సరంలో ఒక క్వింటాల్ ధర 5500 నుంచి 6000 వరకు రైతులు అమ్ముకున్నారు. 2021 సంవత్సరంలో క్వింటాల్ ధర 11500 రూపాయలకి అమ్ముకున్నారు. దిగుబడి పెరగరాటంతో ధర తగ్గింది. కనీసం ఈ సంవత్సరం అయిన మంచి మంచి ధర వచ్చి రైతులకి లాభాలు రావాలి. అమృత్ పద్దతిలో సాగు చేయడం వల్ల ధర తక్కువ ఉన్న కూడా దిగుబడి పెరుగడం వల్ల రైతులకి లాభాలు వస్తాయి.
Also Read: Colocasia Cultivation: చామ దుంప సాగు వివరాలు.!