Groundnut Seeds: భారతదేశం ప్రపంచంలో వేరుశెనగ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. కాని ఉత్పాదకతలో పదవ స్థానంలో వుంది. భారతదేశంలో దీన్ని ప్రధానంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. విస్తీర్ణం 50%, ఉత్పత్తి 67.3% కలిగివున్నాయి.
మన రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలో విస్తీర్ణం మరియు ఉత్పత్తి విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో 17.95లక్షల | హెక్టార్లలలో సాగు చేయబడూ 26.04 ల. టన్నుల కాయల ఉత్పత్తినిస్తుంది. సగటు దిగుబడి 1449 కిలోలు హెక్టారుకు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, మహబూబ్ నగర్, కడప జిల్లాల్లో 80% విస్తీర్ణం, విజయనగరం, నల్గొండ, గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 11%, మిగిలిన జిల్లాల్లో 9% విస్తీర్ణం వుంది.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశెనగలో విత్తన శుద్ధి ఎలా చేయాలి.!
ఉపయోగాలు: వేరుశెనగను ప్రాధమికంగా నూనెకోసం సాగుచేస్తారు. దీనిని వంట కొరకు వాడతారు. రిఫైన్డ్ నూనె మరియు వనస్పతి నెయ్యి తయారీలో కొంతభాగం ఉపయోగిస్తారు. గింజల్లో సుమారు 45% నూనె, 26% మాంసకృతులు ఉంటాయి. గింజలు పచ్చివిగాని, వేయించినవి గాని, ఉడకబెట్టిన గాని ఎంతో ఇష్టంగా అన్ని వయస్సుల వారు తింటారు. బి12 తప్ప, బి విటమిన్, ఇ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.
నూనె తీసిన తర్వాత పిండిని ఎరువుగానూ, దానాగానూ ఉపయోగిస్తారు. వేరుశనగ పిండి 8% నత్రజని, 1.5 % భాస్వరిక్ ఆమ్లం, 1.2% పోటాష్ ఆక్సైడ్ కలిగి ఉంటుంది. వేరుశెనగ నూనెను కొంత వరకు వంట నూనెగా, కొంత సబ్బుల తయారీ, కాస్మెటిక్స్, లూబ్రికెంట్గా ఉపయోగిస్తారు. 100గ్రా॥ గింజల నుండి 349 క్యాలరీల శక్తి వస్తుంది.
హెచ్.పి.యస్ రకం గింజలను (Hand Picked Selected) విదేశాలకు ఎగుమతికి ఉపయోగిస్తారు. వేరుశెనగ ఎండురొట్ట పశువులకు మేతగా ఉపయోగిస్తారు. వేరుశెనగ కాయల తొక్కలు వంటచెరకుగా, కోర్స్వేర్డ్లో కార్క్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది పంటల భ్రమణంలో మంచి అనుకూలమైన పంట. గాలిలో నత్రజనిని స్థిరీకరించి, భూమిలో నేలసారాన్ని పెంచుటకు ఉపయోగిస్తారు. భారతదేశంలో ఉత్పత్తి చేసిన వేరుశనగ, 12% విత్తనంగా, 6% తినుటకు, 81% నూనె కొరకు మరియు 19% ఎగుమతి కొరకు ఉపయోగిస్తున్నారు.
Also Read: Groundnut Crushing Machine: వేరుశనగ కాయలు వొలుచు యంత్రము