Finger Millet Importance – ఆర్ధిక ప్రాముఖ్యత:- ఇది చిరుధాన్యాలలో ముఖ్యమైన ఆహారపు పంటగింజ రూపం లో కొన్ని ప్రత్యేక రకాలు పాప్ చేయడానికి ఉపయోగ పడతాయి. రాగి పిండి ని అనేక ఆహారపు వంటకాల లో ఉపయోగిస్తారు. దీని నుండి ప్రత్యేకమైన తినుబండారాలైన చాకొలేట్ లు, లడ్డులు, దోసెలు,పాయసం మరియు అనేక ఇతర తిను బండారాల తయారీలో వినియోగిస్తారు. ఆహారపు పంటలు అన్నిటిలో కన్నా రాగి లో సున్నం ఎక్కువగా లభించడం వలన రాగి మాల్టు రూపం లోనూ ఇతర చంటి పిల్లల ఆహారాల తయారీ లోనూ వినియోగిస్తున్నారు.
బీహార్ రాష్ట్రము లోని మన్య ప్రజలు రాగి నుండి సారాయిని కాచి వినియోగిస్తున్నారు. చక్కర వ్యాధిని అధికం కాకుండా ఉంచడానికి రాగిని దేశ వ్యాప్తంగా వాడుతున్నారు. రాగి చొప్ప చాలా ప్రాంతాలలో పశువుల ఆహారం గా వినియోగిస్తున్నారు.
విస్తీర్ణం:- ఆంధ్రప్రదేశ్ లో రాగి 1.13 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. ముఖ్యం గా చిత్తూరు, మహబూబ్ నగర్, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రం లో ఉత్పత్తి 49 వేల టన్నులు కాగా ఎకరానికి 4.35 క్వింటాళ్ళ దిగుబడి సాధిస్తున్నారు. దేశం లో కర్ణాటక, ఒడిశా, బీహార్, ఉత్తర ప్రదేశ్, తమిళ నాడు రాష్ట్రాలలో పండిస్తున్నారు.
ఉత్తరకోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలలో ముందుగా పడిన వర్షాలను ఆధారం గా చేసుకొని వరి పండించే పంట పొలాలలో అదనం గా ఒక పంటగా బురద చొడి ని పండించడం పరిపాటి. వరి కోసిన తర్వాత మాగాణి నేలల లోనూ, తోట భూముల లోనూ కొద్ది నీటి పారుదల క్రింద రాగి ని రెండవ పంట గా సాగు చేస్తున్నారు.
Also Read: Finger Millet Crop: రాగి పంటలో యాంత్రిక కోత యొక్క ప్రాముఖ్యత
విత్తనం:- 2.5 కిలోల విత్తనం తో ఐదు సెంట్ల లో పెంచిన నారు ఎకరా పొలం లో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్దతి లో ఎకరాకు 3-4 కిలోల విత్తనం కావాలి.
విత్తన శుద్ధి:- కిలో విత్తనాన్ని రెండు గ్రాముల కార్బండిజిం లేదా మూడు గ్రాముల మాంకోజెబ్ తో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తుట:- తేలిక పాటి దుక్కి చేసి విత్తనం చల్లి, పట్టే తోలాలి. నారు పోసి నాటు కోవాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం గల నేలల్లో నాటు కోవాలి.
నాటడం:- 85-90 రోజుల స్వల్ప కాలిక రకాలకు 21 రోజుల వయసు కల్గిన మొక్కలను, 105-125 రోజుల దీర్ఘ కాలిక రకాలకు 30 రోజుల వయసు కలిగిన మొక్కలను నాటు కోవాలి. ఎకరాకు దీర్ఘకాలిక రకాలను లక్ష ముప్పై మూడు వేల మొక్కలు, స్వల్ప కాలిక రకాలకు రెండు లక్షల అరవై వేల మొక్కలు ఉండాలి.
విత్తే దూరం:- స్వల్ప కాలిక రకాలకు వరుసల మధ్య 15 సెం. మి వరుసలో 10 సెం. మి. దీర్ఘ కాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెం. మి, వరుసలో 15 సెం. మి దూరం పాటించి విత్తుకోవాలి.
నీటి యాజమాన్యం:- నాటిన పైరు బాగా వేర్లు తొడిగిన తర్వాత పది రోజుల నీరు పెట్టరాదు. పూత, గింజ పాలు పోసుకొనే దశల్లో పైరు నీటి ఎద్దడి కి గురి కాకుండా చూడాలి.
అంతర పంటలు:- రాగి తో కంది 8:2 నిష్పతి లో సాగు చేయవచ్చు. దీనిలో రాగి వరుసల మధ్య దూరం 30 cm, పాటించాలి. రాగి తో చిక్కుడు ను 8:1 నిష్పతి లో వేసుకోవచ్చు. వరుసల మధ్య దూరం 30cm, వరుసల్లో రాగి మొక్కల మధ్య దూరం 10 cm, మరియు చిక్కుడు మొక్కల మధ్య దూరం 20 cm, పాటించాలి.
Also Read: Foxtail Millets: అండుకొర్రల సాగు వర్షాభావ పరిస్థితులకు సరైన సమాధానం