Rice Farmers Struggles: సాగునీటికి కటకట ఏర్పడింది. నీరులేక దమ్ము పొలాలు బీటలు వారుతున్నాయి. వరిని కాపాడుకునేందుకు రైతుల నానా అగచాట్లు పడుతున్నారు. ఇంజన్లతో పంటలను కాపాడెందుకు నానా తంటాలు పడుతున్నారు. వేలాది ఎకరాల్లో ఇదే దుస్థితి ఏర్పడింది.
తక్షణం పంట కాలువలకు నీరు వదిలితేనే ఫలితం, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. నిన్నటి దాకా అధిక వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులు నేడు పొలాలకు నీరు లేక నోళ్లెళ్లబెడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నారుమడులు, మాగాణి పొలాలు నీట మునిగాయి. బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండా దిగువకు వదిలారు. అంతా సముద్రం పాలైంది. ఇప్పుడు బ్యారేజీలో నీరు తక్కువగా ఉందనే కారణంగా కాలువలకు నీటిని వదలడం లేదు. దిగువ ప్రాంతంలో నాట్లు పడిన పొలాలు నీరు లేక ఎండుముఖం పట్టాయి. రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ ఇంజన్లులతో నారుమడులు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు
రైతులు ఇంజన్ల ద్వారా నీటిని తోడుకుంటుండటంతో చివరి గ్రామాల రైతులు నారుమడులకు బొట్టు నీరు అందక విలవిలలాడుతున్నారు. కళ్లముందే బెట్టకొట్టడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాగు నీరందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంట కాలువల్లో సాగు నీరందక రైతులు కాల్వల్లో ఉన్న నీటిని మోటార్లతో తోడుతున్నారు.
నాలుగు రోజులుగా నీటి సరఫరా తగ్గిపోవటంతో నారుమడులు కాపాడుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నారుమడిలో నీరు లేక గిడసబారి పోతున్నాయి. సాగునీటి సరఫరా సక్రమంగా జరిగి ఉంటే ఈపాటికి నాట్లు మొదలు పెట్టుకుని ఉండేవాళ్లమని ప్రభుత్వం సాగునీటి నిర్వహణ విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవటంతోనే మాకు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు, రైతు నాయకులు అంటున్నారు.
Also Read: Chilli Cultivation: మిరప సాగుపై రైతులు ఆసక్తి.. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి.!
ప్రభుత్వాలు స్పందించాలి
బ్యారేజీలో నీటి లెవల్స్ పూర్తిగా తగ్గిపోవటంతో నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎదురైంది. మొన్నటి వరకు నిండుకండను తలపించిన జలశయాలు ఉన్న నీరును దిగువకు విడుదల చేయడంతో నీరు లేక వెలవెలబోతున్నాయి. దానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం పుడిక తీయకపోవడం మరోక కారణం. సాగు ఆలస్యం ఆవుతోందని రైతులు అంటున్నారు. దానికి తోడు దిగుబడులు కూడా ఆలస్యంగా చేతికి వస్తాయాని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగు నీరు అందించాలని కోరుతున్నారు.
Also Read: Thailand Grass: థాయిలాండ్ గడ్డిపై ఆసక్తి చూపిస్తున్న రైతులు.!