Cover Crops: రైతులు సాధారణంగా తమ ప్రధాన పంటను పండించిన తర్వాత కవర్ పంటలను వేస్తారు. ఇది నేల కోతను, పోషకాలను, లీచింగ్‌ను తగ్గిస్తుంది. ఈ పంటల మూలాలు నేల నాణ్యతని పెంచుతాయి. వివిధ కవర్ పంటలు ముఖ్యంగా ఇంటెన్సివ్ రూటింగ్‌కు దారి తీస్తాయి. ఒకే రకమైన కవర్ పంటను నాటినప్పుడు సన్నగా వేర్లు పెరుగుతాయి. మొక్కల మూలాల మధ్య పరస్పర చర్యలు జరిగి మొక్కలు బాగా పెరిగి నేల నాణ్యత పెరుగుతుంది.
మొదటి పంటగా బంగాళదుంపలు లేదా మొక్కజొన్న పంటలు పండించాలి. ఈ పంటలు పండించిన తర్వాత, కవర్ పంట వేసుకోవాలి. నేల నాణ్యతను మెరుగుపరచడానికి ఈ కవర్ పంటలు పండించాలి. కవర్ పంటలు కలుపు మొక్కలను అణిచివేస్తాయి, నైట్రేట్ లీచింగ్‌ను తగ్గిస్తాయి. వర్షం, గాలి ద్వారా కోతను తగ్గిస్తాయి.
Also Read: Papaya Cultivation: ఈ పంట సాగు ద్వారా రెండు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది.!
కవర్ పంటల మూలాలు నేలలోకి ఎంత బాగా చొచ్చుకుపోతాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఒకే మొక్క జాతులతో కూడిన స్వచ్ఛమైన కవచ పంటల కంటే మిశ్రమ కవర్ పంట మట్టిలోకి మరింత ఎక్కువగా చొచ్చుకుపోతాయి.
ఒకే సమయంలో నాటిన అనేక జాతుల కవర్ పంటల మూలాలు పోటీపడితే నేల నాణ్యత మరింత ఎక్కువ పెరుగుతుంది. కొన్ని కవర్ పంటల మూలాలు ప్రధానంగా నేల పై పొరలలోకి చొచ్చుకుపోతాయి, మరికొన్ని నేలలోపల పొరలోకి పోతాయి. దీని ద్వారా నేలలోకి ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది, నేల నాణ్యత పెరుగుతుంది.
Also Read: Tomato Cultivation: రైతులు ఎక్కువగా సాగు చేసే ఈ కూరగాయ.. మీరు సాగు చేయాలి అనుకుంటున్నారా…