Tomato Crop Protection: వ్యాపారం చేసి కోట్లు సంపాదించడం చూశాం. ఇక సినిమాల్లో హీరో అయితే ఒక్క రూపాయితో ఛాలెంజ్ విసిరి, పదో రీలు వచ్చే సరికి వేల కోట్లు సంపాదించే స్తాడు. ప్రస్తుతం టమాటా సాగు చేసిన రైతుల లక్ కూడా అలాగే ఉంది. ఏటా టమాటా సాగుతో నష్టాలను చవిచూసిన రైతులు, ఈ ఏడాది నక్కను తొక్కారు. గతంలో కోత కూలీ రవాణా ఖర్చులు కూడా రాక రోడ్ల వెంట టమాటాలను పారబోయడం మనం చాలా సార్లు చూశారు. కానీ నేడు సంపన్నులు తప్ప పేద, మధ్య తరగతి వారు టమాటా కొనలేని వస్తువుగా తయారైంది. అయితే టమాటో సాగు చేసిన రైతులు మాత్రం కొత్త కోటీశ్వరుగా ఎదుగడం ఆనందించవలసిన విషయమే.
దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగు పడాల్సిందే
రాయలసీమ రైతుల పంట పండింది. టమాట సాగు చేసిన రైతులు మంచి లాభాలు కళ్ల చూస్తున్నారు. సీమలోని సోమల మండలానికి వందలాది మంది రైతులు వచ్చి టమాటా సాగు చేశారు.కలకడ, దేవపట్ల, మదనపల్లె ప్రాంతాల నుంచి రైతులు ఆయా సీజన్లలో టమాటా సాగు కోసం సోమల మండలానికి వలస వస్తున్నారు. పదేళ్లుగా కొందరు రైతులు పొలాలు కౌలుకు తీసుకుని 5 నుంచి 30 ఎకరాల వరకూ టమాటా సాగు చేస్తున్నారు. సోమల, అడుసు పల్లె, గన్నావారిపల్లె, దిడ్డివారిపల్లె, రాశెట్టివారిపల్లె, సరస్వతీపురం, బుడ్డారెడ్డిపల్లె గ్రామాల్లో టమాటా సాగుకు అనువైన భూములు, కూలీలు అందుబాటులో ఉండటంతో ఆ ప్రాంతంలో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అదే వారిని నేడు కోటీశ్వరులను చేసింది.
టమోటా ధరలు పెరగడంతో వాటికి చిల్లర దొంగలు తోడై రాత్రి వేళల్లో కాయలను చోరీ చేస్తున్నారని రైతులు పొలాల వద్ద రాత్రి జాగరణలు చేస్తూ పంటలను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా టమోటా తోటల్లో విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం ఏర్పాటు, తోటల చుట్టూ నైలాన్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. చూడటానికి వింతగా ఉంది కదా. మరీ టమాటాలను కాపాడుకోవడానికి రైతులు ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తారో మరీ..
Also Read: Flower Cultivation: రైతులకు పరిమళాలు పంచుతున్న పూలసాగు.!
వేసవి పంట వేసిన వారి పంట పండింది
టమాటో అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే అధిక వర్షాలు తట్టుకోలేదు. అలాగే అధిక వేడికి పూత రాలిపోతుంది. అందుకే ఏప్రిల్ మాసంలో నర్సరీ పెంచుకుని మే నెలలో పంట సాగు చేస్తారు రైతులు, జూన్ లో వర్షాలు రాగానే ఇక పంట ఎదుగుదల వేగం అందుకుంటుంది. జూలై మాసంలో పంట దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది ఎండలకు చీడపీడలకు, అధిక వర్షాలకు టమాటో దెబ్బతిని పోయింది. కొందరు రైతులు మాత్రం టమాటా పంటను రక్షించుకో గలిగారు. ధరలు అనూహ్యంగా దూసుకుపోవడంతో నేడు వారి పంట పండింది.
ప్రధాన నగరాలకు దగ్గరగా సోమల
సోమల మండలం అటు చెన్నై, కోలారు, కర్ణాటక వడ్డిపల్లె క్రాస్ మార్కెట్‌లకు సమీపంలో ఉండటం కలసి వచ్చింది. పండించిన టమాటోలో మదనపల్లి, కోలార్, చెన్నై మార్కెట్లకు తరలిస్తూ లక్షలు ఆర్జించారు. ధరలు పెరగడంతో దొంగలు కూడా చేతికి పనిచేస్తున్నారు. దీంతో రైతులు టమాటా పొలాలకు సీసీ కెమెరాలు అమర్చుకుని సెక్యూరిటీ టైట్ చేశారు.
Also Read: 10 Profitable Agricultural Business Ideas: బాగా లాభాలందించే పది వ్యవసాయ వ్యాపారాలు.!