Avocado Crop: వ్యవసాయం పై చిన్నప్పటి నుంచి ఆసక్తి అందరికి ఉంటుంది. ఈ మధ్య కాలంలో వ్యవసాయం పై అందరూ దృష్టి పెడుతున్నారు. వ్యవసాయం పై ఇష్టంతో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో మానేశాడు ఒక యువ రైతు జైపాల్‌నాయక్ గారు రంగారెడ్డి జిల్లాకి చెందిన వారు. ఎంబీఏ చదవాలి అని కోరికతో లండన్ వెళ్ళాడు. అక్కడ కొన్ని అవాంతరాలు వల్ల మళ్ళీ సొంత దేశానికి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టారు. వ్యవసాయంలో ఏదైనా సాధించాలి అని అందరి రైతుల కంటే బిన్నంగా వ్యవసాయం చేయాలి అని అనుకున్నారు.
మన జిల్లాలో ఇప్పటి వరకు ఏ రైతు సాగు చేయని పంటని సాగు చేయాలి అనుకున్నారు. ఆ ఆలోచనతో అవకాడో పంటను సాగు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అవకాడో పంట సాగు చేయడానికి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకి పర్యటించారు. అక్కడి రైతుల నుంచి అవకాడో పంట సాగు చేసే విధానం నేర్చుకున్నాడు.
Also Read: Woman Farmer: మహిళా రైతు ఈ తోటను తన సొంతగా సాగు చేస్తున్నారు..
ఎకరం పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అవకాడో పంట సాగు చేయడం మొదలు పెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతం నుంచి ఈ మొక్కలు తీసుకొని పెంచుతున్నాడు. ఒక మొక్కకి 400 రూపాయల ఖర్చు వచ్చింది. ఎకరం పొలంలో దాదాపు 200 మొక్కల వరకు నాటాడు. ఇప్పటి వరకు దాదాపు 80 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. ఈ పంటకి ఇప్పటికి వరకు ఎరువులుగా వేప పిండి, పశువుల ఎరువు మాత్రమే వేశాడు. ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. మన ప్రాంతాల్లో గత సంవత్సరం ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు వెళ్ళింది. కానీ ఈ పంట అంత ఉష్ణోగ్రత కూడా తట్టుకుంది.
ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఒక చెట్టుకి సుమారు 200 కాయల వరకు వచ్చాయీ. అంటే ఒక చెట్టుకి దాదాపు 20-30 కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఒక కిలోకి 200 రూపాయల వరకు రైతులు అమ్ముతున్నారు. ఒకసారి ఈ చెట్టుని నాటితే 50-60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పంట సంవత్సరం మొత్తం వస్తుంది. కర్ణాటక, మహారాష్ట్రలో రైతులు ఒక చెట్టుకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ జిల్లలో అవకాడో పంట మొదటి సారి సాగు చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఈ పంటని చూడడానికి వచ్చి ఈ పంటని పొలం దగ్గరే కొనుగోలు చేస్తున్నారు. ఈ రైతు కొత్త పంటలు సాగు చేస్తూ చదువు కంటే వ్యవసాయమే మేలు అని నిరూపించారు.
Also Read: Floriculture: ఈ సాగులో పెట్టుబడి తగ్గి, రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి..