Irradiation Onions Experiment: ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు భారత ప్రభుత్వం అరేడియేషన్ అనే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఉల్లిపాయలు ఎక్కువగా నిల్వ చేసుకోవడానికి ఆవకాశం ఉంటుది. దీనిద్వారా రైతులకు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈధరలతో వినియోగదారులు టమాటా కొనాలంటేనే బెంబేలు ఎత్తుతున్నారు. దీంతో సామాన్యుడు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో రైతులు నీరసించి పోతున్నారు. ఇప్పుడు టమాటాతో పాటు ఉల్లి కూడా అదే బాటలో నడుస్తుంది.
ఉల్లిని నిల్వ చేయడానికి ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీకి తెరతీసింది. ఇప్పుడు టమాటాకు ఉన్న పరిస్ధితే గతంలో ఉల్లిపాయలకు కూడా ఉంది. అందుకే భారత్ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ముందుగా దానిని ఉల్లిపాయలపై ప్రయోగించనుంది. దీంతో ఉల్లిపాయలు ఎక్కువ రోజులు ఉండేలా, వర్షాలకు కుళ్లిపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పంట వేసిన రైతులు నష్టపోకుండా చూసుకోవచ్చు. తొలిసారిగా నిల్వచేయడానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉల్లి పంట వేసిన రైతులు దీని ద్వారా లాభపడవచ్చు. ఉల్లిసాగుకు భారీగా పెట్టుబడులు పెరిగాయి కాబట్టి పెట్టుబడులు తగ్గటు దిగుబడులకు రేటును పొందవచ్చు..
Also Read: Tips to Farmers in Rainy Season: అధిక వర్షాల సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు.!
ఈప్రక్రియ అనేది విజయవంతం
అరేడియేషన్ ప్రక్రియలో ఆహరంలో రేడియేషన్ చేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఎలక్ర్టాన్ కిరణాలను వినియోగిస్తారు. ప్రస్తుతం మన ఉల్లిపాయలకు గామా రేడియేషన్ చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా ఇందులోని కీటకాలు. సూక్ష్మజీవులు నశించి వాటిలోని ఉన్న నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పాలను పాయిశ్చరైజ్ చేయడం, పండ్లు, కూరగాయలను క్యానింగ్ చేయడం ద్వారా వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో ఇప్పుడు ఈవిధానంలోను మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒక పదార్ధానికి అరేడియేషన్ ను గుర్తించడం చాలా చాలా కష్టం.. దీనిని అమెరికాలోని పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం ఆమోదించాయి. అమెరికాలోని యూనివర్సిటి అఫ్ మిస్సౌరీ కి చెందిన లెవిస్ స్టాడ్లర్ అనే శాస్త్రవేత్త ఈ విత్తనాలపై ప్రయోగం చేశారు. ఈప్రక్రియ అనేది తృణధాన్యాలు. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వెల్లుల్లి పై విజయం సాధించారు..
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సహయంతో
అరేడియేషన్ చేసిన ఆహరపదార్ధాలు తినడం వల్లన వ్యాధులు తగ్గుతాయి. వీటిలో ఉండే హానికర జీవులను కూడా చంపుతుంది. అంతేకాకుండా దీనిద్వారా పండ్లు, కాయగూరలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మనం ఏదైనా పంటలను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచడానికి మందులను కూడా వాడాల్సిన అవసరం లేదు.. ఉల్లిపాయలను ఈ ఏడాది భారత ప్రభుత్వం సుమారు 3లక్షల టన్నుల ఉల్లిని బంఫర్ స్ఠాకుగా ఉంచింది. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సహయంతో ఉల్లిపాలపై అరేడియేషన్ ప్రయోగ్మకంగా పరిశీలించనుంది.. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ సింగ్ తెలిపారు.. పైలట్ ప్రాజెక్టు కింద 150 టన్నుల ఉల్లిపాయలను అరేడియేషన్ చేయనున్నారు. మహరాష్ట్రలోని లాసల్ గామ్ లో చేస్తున్నారు.
Also Read: Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.!