Ethanol Production: చెఱకే కాకుండా, జొన్నతో కూడా బెల్లం, ఇథనాల్ మరియు సిరఫ్ ను తయారుచేయవచ్చు. తీపిజొన్నతో ఇథనాల్ ఉత్పత్తి , జొన్నలో చెఱకు జొన్న అను రకము కలదు. చెఱకు జొన్నలో చెక్కర శాతం 15-19 వరకు ఉంటుంది. చక్కర శాతం 17 కన్నా అధికముగా ఉన్న రకములను బెల్లం, సిరప్ తయారిలో ఉపయోగిస్తారు.
బెల్లం తయారీలో చెఱకు జొన్న గడల నుండి తీసిన రసాన్ని సున్నంతో కలిపి మరిగిస్తారు. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు తక్కువ కావున ఇది చెఱకు బెల్లం కంటే తక్కువ ధరలో లభ్యమవుతుంది.
సిరప్ తయారికి చెఱకు గడల రసాన్ని సున్నం నీటితో మరిగించి, బెల్లం ఘనీభవించుటకు ముందుగా 105” సెల్సియస్ వద్ద మరిగిన రసాన్ని చల్లార్చి దానికి సోడియం బెంజోయేట్ లేదా ప్రిజర్వేటివ్లను కలిపి చల్లార్చాలి. ఒక హెక్టారుకి సుమారుగా 2 టన్నుల సిరప్ లభిస్తుంది.
రైతులు కుటీర పరిశ్రమగా తక్కువ ఖర్చుతో చెఱుకు జొన్నని సాగుచేసి సిరప్ తయారుచేసి అధిక లాభాలు పొందవచ్చు.
Also Read: Vegetable Cultivation: కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ.!
ఇథనాల్ ఉత్పత్తి చేయుటకు చెఱుకు జొన్న చాలా అనువైన ముడి పదార్ధం, 4.6 టన్నుల చెఱకు జొన్న గడల రసం ఒక టన్ను మొలసినకు సమానము. చక్కెర కర్మాగారాలకు అనుబంధంగా ఉన్న ఇథనాల్ డిస్టిలరీలలో చెఱుకు జొన్న గదల నుండి ఇథనాల్ తయారు చేయడం వలన ఈ పంట నుండి మంచి ఫలితములు పొందవచ్చును.
చివరగా, ప్రపంచ జనాభా అనూహ్య రీతితో పెరగడం, జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం. ఇంకోవైపు భూగర్భజలాల మట్టాలు పడిపోవడంతో, నీటిని తక్కువగా ఉపయోగించుకొని, ప్రపంచ జనాభా ఆకలి తీర్చే ఆహార పంటలు పండించడం, తక్కువ ఖర్చుతో ఆహార ఉత్పత్తులను తయారుచేయగల పంటల ప్రస్తుత పరిస్థితులలో ఎంతో అవసరము పై సమస్యలకు కొంతవరకు ప్రత్యామ్నాయంగా జొన్నను చెప్పవచ్చు. కావున జొన్న పండించే విస్తీర్ణంను పెంచి, రైతులకు అధిక లాభాలు చేకూర్చుదాం.
Also Read: Foods that lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు.!