Rabi Cultivation: ఋతుపవనాలు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలబెట్టుటలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఈ ఋతుపవనాలు ప్రతి ఏటా కొన్ని రోజులు అటూ ఇటూ వ్యవధిలో విచ్చేసి తాగు మరియు సాగు నీటి వనరులను స్థిరీకరించటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా మన రాష్ట్రంలో రబీ పంటల సాగు విస్తరణ, రబీ పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదగతలు ఆశించిన మేర ఫలించి మంచి ఫలసాయం పొంది రైతన్నని ఆర్థికంగా బలోపేత దిశలో అడుగులు వేయించుడంలో నైరుతి ఋతుపవనంతోపాటు ఈశాన్య ఋతుపవనాల ఆగమనము మరి దాని విస్తరణ ఏంతో ముఖ్య భూమిక పోషిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఈశాన్య ఋతుపవనాలు సాధారణంగా అక్టోబర్ 15వ తేదికి రాష్ట్రంలో ప్రవేసిస్తాయి కాని ఈ ఏడాది అక్టోబర్ 29న అనగా పదిహేను రోజుల అలస్యంగా ప్రవేశించాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేది నుండి డిసెంబర్ 31వ తేది వరకు నాలుగు అల్పపీడనాలు 20-10-22, 22-10-22, 23-10-22, 22-11-22, అక్టోబర్ 21 నుండి 25 వరకు చిత్రంగ్ తుఫాను, డిసెంబర్ 6 నుండి 10 వరకు విచ్చేసిన మాండుస్ తుఫాను కొంతమేర పంట ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపించినప్పటికి రాష్ట్రమంతటా మంచి వర్షపాతం నమోదుకాబడి మంచి ఫలితాలను ఇచ్చినదని చెప్పుకోవచ్చు. వాస్తవ వర్షపాత వివరాలను ఓమారు విశ్లేషించిన వాస్తవము మనకు బోధపడుతుంది.
ఈ రబీ పంటకాలానికి సాధారణ వర్షపాతం 284 మి.మీ గాను 310 మి.మీ అంటే సాధారణాకి అతిసమిపంగా (8.9%) నమోదు కాబడినది. జిల్లాల వారిగా ఈ ఈశాన్య ఋతుపవనాలు పనితీరు ఓ మారు పరిశీలించిన చో ఒక్క ఏలూరు జిల్లాలో మాత్రమే లోటు వర్షపాతం (-24.4%) నమోదు కాగా శ్రీసత్యసాయి (59.0%), అనంతపురం(43.3%), పల్నాడు (35.8%) మరియు గుంటూరు (32.4%), జిల్లాలో అధిక వర్షపాతం నమోదుకాగా మిగిలిన 21 జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదుకాబడినది. ఈ వివరాలు పఠం1 లో పొందుపరచబడినవి మరియు ఉత్తర కోస్తా వాతావరణ మండలంలో కొంతమేర లోటు వర్షపాతం (-5.6%) నమో దైనప్పటికీ మండలాలలో మొత్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొల్పబడివి ఈ వివరాలను పఠం 2 లో చూపింపబడినవి.
వాతావరణ మండలాల వారీగా ఈ ఏడాది ఈ ఈశాన్య ఋతుపవనాలు పనితీరు ఓ మారు పరిశీలించినచో సాధారణ వర్షపాత పరిస్థితులు నెలకొల్పబడినవి. ఉత్తర కోస్తా (-5.6%), దక్షిణ కోస్తా (10.1%), రాయలసీమ (13.1%) తో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో (8.9%)సాధారణ వర్షపాతం నమోదుకాబడినది. ఈ వివరాలు పఠం 2 లో పొందుపరచబడినవి.
Also Read: Tulasi Health Benefits: ఆరోగ్య వరదాయని తులసి.!
మన రాష్ట్రం రబీ సాగు లక్ష్యం 23.2 లక్షల హెక్టార్లకుగాను సాధారణ సాగు విస్తీర్ణం 22.9 లక్షల హెక్టార్లయినప్పటికీ ఈ ఏడాది 10.5 లక్షల హెక్టార్ల్లలో మాత్రమే సాగు చేపట్టబడి మొత్తం సాగు విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే 46% నమోదుకాబడినది. జిల్లాల వారిగా రబీ పంట కాలానికి 76 % తో ప్రకాశం, అనంతపురం జిల్లాలు అగ్ర స్థానం నిలవగా, 69%తో శ్రీసత్యసాయి జిల్లా ద్వితీయ స్థానం లోను, 67% తో వై. ఎస్. ఆర్. కడప తృతీయ స్థానంలో నిలబడగా, పశ్చిమ గోదావరి (1%) మరియు విశాఖపట్నం (8%) జిల్లాలు చివరి రెండు స్థానాలలో సాగు విస్తీర్ణం నమోదుకాబడినది. ఈ వివరాలను పఠం 3 లో విశదీకరించబడినది. ఈ సంవత్సరం రబీ సాగు విస్తీర్ణంను సాధారణ రబీ సాగు విస్తీర్ణంతో పోల్సినచో -53 శాతం వ్యత్యాసం గమనించడ మైనది.
ఈ ఏడాది మన రాష్ట్రంలో వివిధ రబీ పంటల సాగు విస్తీర్ణంలో ఈ ఈశాన్య ఋతుపవన ఫలితాన్ని గమనించినచో, 159 % తో కుసుమ అగ్రస్తానంలోను, శనగ (72%), పొగాకు (67%), వేరు శనగ (62%), మినుము (59%), ఒడిశలు (51%) మరియు ప్రత్తి (51%) 50శాతానికి పైబడి సాగు చేపట్టబడినవి. నువ్వులు మరియు చిరుధాన్యాలు 7 శాతంతో చివరి స్థానంలో సాగుచేపట్టబడినవి. ఈ పంటలు మినహా తక్కిన అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం కంటే 50% విస్తీర్ణంలోపు సాగు చేయటం జరిగింది. ఈ రబీ పంటకాలానికి మొత్తం ఆహార ధాన్యాలు (సాధారణ సాగు విస్తీర్ణం 20.76 ల.హె. గాను) 45 శాతం, అపరాలు (సాధారణ సాగు విస్తీర్ణం 9.6 ల.హె గాను) 62 శాతం మొతం నూనెగింజలు (సాధారణ సాగు విస్తీర్ణం 1.39 ల.హె. గాను) 49% తో సాగు చేపట్ట బడినవి.
డా.రత్నం, డి. సౌమ్య మరియు డా. జి.సుబ్బారావు
గ్రామీణ కృషి మౌసం సేవ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, లాం, గంటూరు.
Also Read: Paddy Plantation: యంత్రాలతో వరినాట్లు వేసే విధానం.!