Sweet Sorghum Cultivation: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో జొన్నసాగు విస్తీర్ణం నానాటికి తగ్గిపోతుంది. మార్కెట్లో జొన్నకు డిమాండ్ తగ్గిపోవడం. చీడపీడల ఆశించడం వల్ల గింజ నాణ్యత తగ్గిపోవడం, రైతులు వాణిజ్య పంటలవైపు మక్కువ చూపడం లాంటివి దీనికి ప్రధాన కారణాలు. అయితే అంత తక్కువ సమయంలో వనరులను ఉపయోగించుకొని తక్కువ సమయంలో కోతకు వచ్చే తీపి జొన్నసాగు చేపట్టినట్లయితే గింజ దిగుబడితో పాటు రైతులు అదనపు ఆదాయం రాబట్టవచ్చు. తీపి జొన్న నుండి ఇధనాల్ సంగ్రామంలో ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదు.
జొన్నకు ఉన్న ఉపయోగాలు
భారత ప్రభుత్వం జారీ చేసిన నిబంధన ప్రకారం, ఐదు శాతం ఇధనాల్ ను పెట్రోల్ లో కలపవచ్చు. ఇప్పటివరకు చెరుకు నుండి మాత్రమే విధానాలను సంగ్రహించేవారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం తీపి జొన్న నుండి కూడా ఈ ఇథనాల్ ను తీస్తున్నారు. కాండములో చక్కెరను నిలువ చేసుకునే గుణం ఉంటుంది. ఈ చక్కెరతో బెల్లం సిరప్ ను తయారు చేయవచ్చు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం గింజల నుండి కూడా కేకులు బిస్కెట్లు, బెల్లం తయారు చేయవచ్చు. కాండం నుంచి చక్కెర వేరు చేశాక మిగిలిన వ్యర్దంతో 3.25 మెగావాట్ల శక్తిని ఉత్పన్నం చేయడమే కాక, దీనితో పేపర్ ను కూడా తయారు చేయవచ్చు. మరియు పశువుల దాణాగా కూడా వాడొచ్చు. చెరుకు కంటే కూడా తక్కువ నీటిని ఉపయోగించి తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయంను మనం తీసుకోవచ్చు.
Also Read: ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య కుదిరిన ఒప్పందం.!
మూడు కాలల దిగుబడి
అన్ని రకాల నేలలు దానిసాగుకు అనుకూలము. నేలను రెండు సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. మురుగునీరు నిల్చే నేలలు అనుకూలం కాదు. తీపి జొన్నను మూడు కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ లో జూన్ మొదటి పక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు, రబీలో ఖరీఫ్ మొదటి పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు, వేసవిలో జనవరి మొదటి పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు ఈపంటను వేసుకోవచ్చు.
పూత మొదలైనప్పటి నుండి 40 రోజులు తర్వాత పంట కోత చేపట్టవచ్చు కోత మొదలైనప్పటినుండి గింజ గట్టి పడే దశ వరకు గడలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈదశలో చేపట్టినట్లయితే ఒక హెక్టారుకు ఇధనాల్ ను సంగ్రహించే శాతం పెంచుకోవచ్చు. గడలను కోసిన 48 గంటల్లోపు ఇధనాల్ ను మిల్లులకు చేర్చగలగాలి. లేనిచో దిగుబడి తగ్గే ఆవకాశముంటుంది. ఈ విధంగా తక్కువ నీటితో తక్కువ వనరులతో తీపి జొన్నసాగు చేపడితే రైతులు ఆర్థికంగా బలపేతం అవుతారు.
Also Read: విదేశీ కూరగాయల సాగుతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.!